విలాపవాక్యములు 5 : 1 (TEV)
యెహోవా, మాకు కలిగిన శ్రమ జ్ఞాపకము చేసి కొనుము దృష్టించి మామీదికి వచ్చిన నింద యెట్టిదో చూడుము.
విలాపవాక్యములు 5 : 2 (TEV)
మా స్వాస్థ్యము పరదేశుల వశమాయెను. మా యిండ్లు అన్యుల స్వాధీనమాయెను.
విలాపవాక్యములు 5 : 3 (TEV)
మేము దిక్కులేనివారము తండ్రిలేనివారము మా తల్లులు విధవరాండ్రయిరి.
విలాపవాక్యములు 5 : 4 (TEV)
ద్రవ్యమిచ్చి నీళ్లు త్రాగితివిు క్రయమునకు కట్టెలు తెచ్చుకొంటిమి.
విలాపవాక్యములు 5 : 5 (TEV)
మమ్మును తురుమువారు మా మెడలమీదికి ఎక్కి యున్నారు మేము అలసట చెందియున్నాము, విశ్రాంతి యనునది మాకు లేదు.
విలాపవాక్యములు 5 : 6 (TEV)
పొట్టకూటికై ఐగుప్తీయులకును అష్షూరీయులకును లోబడియున్నాము.
విలాపవాక్యములు 5 : 7 (TEV)
మా తండ్రులు పాపము చేసి గతించిపోయిరి మేము వారి దోషశిక్షను అనుభవించుచున్నాము.
విలాపవాక్యములు 5 : 8 (TEV)
దాసులు మాకు ప్రభువులైరి వారి వశమునుండి మమ్మును విడిపింపగలవా డెవడును లేడు.
విలాపవాక్యములు 5 : 9 (TEV)
ఎడారిజనుల ఖడ్గభయమువలన ప్రాణమునకు తెగించి మా ధాన్యము తెచ్చుకొనుచున్నాము.
విలాపవాక్యములు 5 : 10 (TEV)
మహా క్షామమువలన మా చర్మము పొయ్యివలె నలు పెక్కెను.
విలాపవాక్యములు 5 : 11 (TEV)
శత్రువులు సీయోనులో స్త్రీలను చెరిపిరి యూదా పట్టణములలో కన్యకలను చెరిపిరి.
విలాపవాక్యములు 5 : 12 (TEV)
చేతులు కట్టి అధిపతులను ఉరితీసిరి వారేమాత్రమును పెద్దలను ఘనపరచలేదు.
విలాపవాక్యములు 5 : 13 (TEV)
¸°వనులు తిరుగటిరాయి మోసిరి బాలురు కట్టెలమోపు మోయజాలక తడబడిరి.
విలాపవాక్యములు 5 : 14 (TEV)
పెద్దలు గుమ్మములయొద్ద కూడుట మానిరి ¸°వనులు సంగీతము మానిరి.
విలాపవాక్యములు 5 : 15 (TEV)
సంతోషము మా హృదయమును విడిచిపోయెను నాట్యము దుఃఖముగా మార్చబడియున్నది.
విలాపవాక్యములు 5 : 16 (TEV)
మా తలమీదనుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ.
విలాపవాక్యములు 5 : 17 (TEV)
దీనివలన మాకు ధైర్యము చెడియున్నది. సీయోను పర్వతము పాడైనది
విలాపవాక్యములు 5 : 18 (TEV)
నక్కలు దానిమీద తిరుగులాడుచున్నవి మా కన్నులు దీని చూచి మందగిలెను.
విలాపవాక్యములు 5 : 19 (TEV)
యెహోవా, నీవు నిత్యము ఆసీనుడవై యుందువు నీ సింహాసనము తరతరములుండును.
విలాపవాక్యములు 5 : 20 (TEV)
నీవు మమ్ము నెల్లప్పుడును మరచిపోవుట ఏల? మమ్ము నింతకాలము విడిచిపెట్టుట ఏల?
విలాపవాక్యములు 5 : 21 (TEV)
యెహోవా, నీవు మమ్మును నీతట్టు త్రిప్పినయెడల మేము తిరిగెదము. మా పూర్వస్థితి మరల మాకు కలుగజేయుము.
విలాపవాక్యములు 5 : 22 (TEV)
నీవు మమ్మును బొత్తిగా విసర్జించి యున్నావు నీ మహోగ్రత మామీద వచ్చినది.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22