లూకా సువార్త 11 : 1 (TEV)
ఆయన యొక చోట ప్రార్థన చేయుచుండెను. ప్రార్థన చాలించిన తరువాత ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పి నట్టుగా మాకును ప్రార్థనచేయ నేర్పుమని ఆయన నడిగెను.
లూకా సువార్త 11 : 2 (TEV)
అందు కాయనమీరు ప్రార్థన చేయునప్పుడుతండ్రీ, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక,
లూకా సువార్త 11 : 3 (TEV)
మాకు కావలసిన అనుదినాహారము దినదినము మాకు దయచేయుము;
లూకా సువార్త 11 : 4 (TEV)
మేము మాకచ్చియున్న ప్రతి వానిని క్షమించుచున్నాము గనుక మాపాపములను క్షమించుము; మమ్మును శోధనలోనికి తేకుము అని పలుకు డని వారితో చెప్పెను.
లూకా సువార్త 11 : 5 (TEV)
మరియు ఆయన వారితో ఇట్లనెనుమీలో ఎవని కైన ఒక స్నేహితుడుండగా అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహి తుని యొద్దకు వెళ్లిస్నేహితుడా, నాకు మూడురొట్టెలు బదులిమ్ము;
లూకా సువార్త 11 : 6 (TEV)
నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నాయొద్దకు వచ్చి యున్నాడు; అతనికి పెట్టు టకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల
లూకా సువార్త 11 : 7 (TEV)
అతడు లోపలనే యుండినన్ను తొందరపెట్టవద్దు; తలుపు వేసియున్నది, నా చిన్నపిల్లలు నాతోకూడ పండుకొని యున్నారు, నేను లేచి ఇయ్యలేనని చెప్పునా?
లూకా సువార్త 11 : 8 (TEV)
అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయి నను, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలన నైనను లేచి అతనికి కావలసినవన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను.
లూకా సువార్త 11 : 9 (TEV)
అటువలె మీరును అడుగుడి, మీ కియ్యబడును; వెదకుడి, మీకు దొరకును; తట్టుడి, మీకు తీయబడును.
లూకా సువార్త 11 : 10 (TEV)
అడుగు ప్రతివానికియ్యబడును, వెదకువానికి దొరకును, తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను.
లూకా సువార్త 11 : 11 (TEV)
మీలో తండ్రియైనవాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలు నిచ్చునా?
లూకా సువార్త 11 : 12 (TEV)
కాబట్టి మీరు చెడ్డవారైయుండియు, మీ పిల్లలకు మంచి యీవులనియ్య నెరిగియుండగా
లూకా సువార్త 11 : 13 (TEV)
పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయ ముగా అనుగ్రహించుననెను.
లూకా సువార్త 11 : 14 (TEV)
ఒకప్పుడాయన మూగదయ్యమును వెళ్లగొట్టు చుండెను. ఆ దయ్యము వదలిపోయిన తరువాత మూగవాడు మాట లాడెను గనుక జనసమూహములు ఆశ్చర్యపడెను.
లూకా సువార్త 11 : 15 (TEV)
అయితే వారిలో కొందరువీడు దయ్యములకు అధిపతి యైన బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నా డని చెప్పుకొనిరి.
లూకా సువార్త 11 : 16 (TEV)
మరికొందరు ఆయనను శోధించుచుపరలోకము నుండి యొక సూచక క్రియను చూపుమని ఆయన నడిగిరి.
లూకా సువార్త 11 : 17 (TEV)
ఆయన వారి ఆలోచనల నెరిగి వారితో ఇట్లనెనుతనకు తానే వ్యతిరేకముగా వేరుపడిన ప్రతి రాజ్యమును పాడైపోవును; తనకుతానే విరోధమైన యిల్లు కూలిపోవును.
లూకా సువార్త 11 : 18 (TEV)
సాతానును తనకు వ్యతిరేక ముగా తానే వేరుపడినయెడల వాని రాజ్యమేలాగు నిలుచును? నేను బయెల్జెబూలువలన దయ్యములను వెళ్లగొట్టుచున్నానని మీరు చెప్పుచున్నారే.
లూకా సువార్త 11 : 19 (TEV)
నేను బయెల్జెబూలువలన దయ్య ములను వెళ్లగొట్టు చున్నయెడల మీ కుమారులు ఎవనివలన వెళ్లగొట్టుచున్నారు? అందుచేత వారే మీకు తీర్పరులై యుందురు.
లూకా సువార్త 11 : 20 (TEV)
అయితే నేను దేవుని వ్రేలితో దయ్యము లను వెళ్లగొట్టుచున్నయెడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీయొద్దకు వచ్చియున్నది.
లూకా సువార్త 11 : 21 (TEV)
బలవంతుడు ఆయుధములు ధరించుకొని, తన ఆవరణమును కాచుకొనునప్పుడు, అతని సొత్తు భద్రముగా ఉండును.
లూకా సువార్త 11 : 22 (TEV)
అయితే అతనికంటె బల వంతుడైన ఒకడు అతని పైబడి జయించునప్పుడు, అతడు నమ్ముకొనిన ఆయుధముల నన్నిటిని లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును.
లూకా సువార్త 11 : 23 (TEV)
నా పక్షమున ఉండనివాడు నాకు విరోధి; నాతో సమకూర్చనివాడు చెదరగొట్టువాడు.
లూకా సువార్త 11 : 24 (TEV)
అపవిత్రాత్మ యొక మనుష్యుని వదలిపోయిన తరువాత అది విశ్రాంతి వెదకుచు నీరులేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందుననేను విడిచి వచ్చిన నా యింటికి తిరిగి వెళ్లుదుననుకొని
లూకా సువార్త 11 : 25 (TEV)
వచ్చి, ఆ యిల్లు ఊడ్చి అమర్చి యుండుట చూచి
లూకా సువార్త 11 : 26 (TEV)
వెళ్లి, తనకంటె చెడ్డవైన మరి యేడు (అపవిత్ర) ఆత్మలను వెంటబెట్టుకొని వచ్చును; అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును; అందు చేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటిదానికంటె చెడ్డ దగునని చెప్పెను.
లూకా సువార్త 11 : 27 (TEV)
ఆయన యీ మాటలు చెప్పుచుండగా ఆ సమూహ ములో నున్న యొక స్త్రీ ఆయనను చూచినిన్ను మోసిన గర్భమును నీవు కుడిచిన స్తనములును ధన్యములైనవని కేకలు వేసి చెప్పగా
లూకా సువార్త 11 : 28 (TEV)
ఆయన అవునుగాని దేవుని వాక్యము విని దానిని గైకొనువారు మరి ధన్యులని చెప్పెను.
లూకా సువార్త 11 : 29 (TEV)
మరియు జనులు గుంపులుగా కూడినప్పుడు ఆయన యీలాగు చెప్పసాగెనుఈ తరమువారు దుష్టతరము వారై యుండి సూచక క్రియ నడుగుచు న్నారు. అయితే యోనానుగూర్చిన సూచక క్రియయే గాని మరి ఏ సూచక క్రియయు వీరికి అనుగ్రహింప బడదు.
లూకా సువార్త 11 : 30 (TEV)
యోనా నీనెవె పట్టణస్థులకు ఏలాగు సూచనగా ఉండెనో ఆలాగే మనుష్య కుమారుడును ఈ తరమువారికి సూచనగా ఉండును.
లూకా సువార్త 11 : 31 (TEV)
దక్షిణదేశపు రాణి విమర్శకాలమున ఈ తరమువారితో కూడ లేచి వారిమీద నేరస్థాపనచేయును. ఆమె సొలొ మోను జ్ఞానము వినుటకు భూమ్యంతములనుండి వచ్చెను, ఇదిగో సొలొమోనుకంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.
లూకా సువార్త 11 : 32 (TEV)
నీనెవె మనుష్యులు విమర్శకాలమున ఈ తరమువారితో కూడ నిలువబడి వారిమీద నేరస్థాపనచేయుదురు. వారు యోనా ప్రకటన విని మారుమనస్సు పొందిరి; ఇదిగో యోనా కంటె గొప్పవాడిక్కడ ఉన్నాడు.
లూకా సువార్త 11 : 33 (TEV)
ఎవడును దీపము వెలిగించి, చాటుచోటునైనను కుంచముక్రిందనైనను పెట్టడు గాని, లోపలికి వచ్చువారికి వెలుగు కనబడుటకు దీపస్తంభముమీదనే పెట్టును.
లూకా సువార్త 11 : 34 (TEV)
నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక, నీ కన్ను తేటగా నుంటె నీ దేహమంతయు వెలుగు మయమై యుండును; అది చెడినదైతే నీ దేహ మును చీకటిమయమై యుండును.
లూకా సువార్త 11 : 35 (TEV)
కాబట్టి నీలోనుండు వెలుగు చీకటియైయుండకుండ చూచు కొనుము.
లూకా సువార్త 11 : 36 (TEV)
ఏ భాగమైనను చీకటికాక నీ దేహమంతయు వెలుగు మయమైతే, దీపము తన కాంతివలన నీకు వెలు గిచ్చు నప్పుడు ఏలాగుండునో ఆలాగు దేహమంతయు వెలుగుమయమై యుండునని చెప్పెను.
లూకా సువార్త 11 : 37 (TEV)
ఆయన మాటలాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడ భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్లి భోజనపంక్తిని కూర్చుండెను.
లూకా సువార్త 11 : 38 (TEV)
ఆయన భోజన మునకు ముందుగా స్నానము చేయలేదని ఆ పరిసయ్యుడు చూచి ఆశ్చర్యపడెను.
లూకా సువార్త 11 : 39 (TEV)
అందుకు ప్రభువిట్లనెనుపరి సయ్యులైన మీరు గిన్నెయు పళ్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగము దోపుతోను చెడు తనముతోను నిండియున్నది.
లూకా సువార్త 11 : 40 (TEV)
అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా?
లూకా సువార్త 11 : 41 (TEV)
కాగా మీకు కలిగినవి ధర్మము చేయుడి, అప్పుడు మీ కన్నియు శుద్ధిగా ఉండును.
లూకా సువార్త 11 : 42 (TEV)
అయ్యో పరిసయ్యులారా, మీరు పుదీనా సదాప మొదలైన ప్రతి కూరలోను పదియవవంతు చెల్లించు చున్నారే గాని, న్యాయమును దేవుని ప్రేమను విడిచి పెట్టుచున్నారు. వాటిని మానక వీటిని చే¸
లూకా సువార్త 11 : 43 (TEV)
అయ్యో పరిసయ్యులారా, మీరు సమాజ మందిరములలో అగ్రపీఠములను సంతవీధులలో వందనము లను కోరుచున్నారు.
లూకా సువార్త 11 : 44 (TEV)
అయ్యో, మీరు కనబడని సమా ధులవలె ఉన్నారు; వాటిమీద నడుచు మనుష్యులు (అవి సమాధులని) యెరుగరనెను.
లూకా సువార్త 11 : 45 (TEV)
అప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడొకడుబోధకుడా, యీలాగు చెప్పి మమ్మునుకూడ నిందించుచున్నావని ఆయ నతో చెప్పగా
లూకా సువార్త 11 : 46 (TEV)
ఆయన అయ్యో, ధర్మ శాస్త్రోపదేశకు లారా, మోయ శక్యముకాని బరువులను మీరు మను ష్యులమీద మోపుదురు గాని మీరు ఒక వ్రేలితోనైనను ఆ బరువులను ముట్టరు.
లూకా సువార్త 11 : 47 (TEV)
అయ్యో, మీ పితరులు చంపిన ప్రవక్తల సమాధులను మీరు కట్టించుచున్నారు.
లూకా సువార్త 11 : 48 (TEV)
కావున మీరు సాక్షులై మీ పితరుల కార్యములకు సమ్మతించు చున్నారు; వారు ప్రవక్తలను చంపిరి, మీరు వారి సమా ధులు కట్టించుదురు.
లూకా సువార్త 11 : 49 (TEV)
అందుచేత దేవుని జ్ఞానము చెప్పిన దేమనగానేను వారియొద్దకు ప్రవక్తలను అపొస్తలులను పంపుదును.
లూకా సువార్త 11 : 50 (TEV)
వారు కొందరిని చంపుదురు, కొందరిని హింసింతురు.
లూకా సువార్త 11 : 51 (TEV)
కాబట్టి లోకము పుట్టినది మొదలుకొని, అనగా హేబెలు రక్తము మొదలుకొని బలిపీఠమునకును మందిరము నకును మధ్యను నశించిన జెకర్యా రక్తమువరకు చిందింపబడిన ప్రవక్తలందరి రక్తము నిమిత్తము ఈ తరము వారు విచారింపబడుదురు; నిశ్చయముగా ఈ తరమువారు ఆ రక్తము నిమిత్తము విచారింపబడుదురని మీతో చెప్పు చున్నాను.
లూకా సువార్త 11 : 52 (TEV)
అయ్యో, ధర్మశాస్త్రోపదేశకులారా, మీరు జ్ఞానమను తాళపుచెవిని ఎత్తికొని పోతిరి; మీరును లోపల ప్రవేశింపరు, ప్రవేశించువారిని అడ్డగింతురని చెప్పెను.
లూకా సువార్త 11 : 53 (TEV)
ఆయన అక్కడనుండి వెళ్లినప్పుడు శాస్త్రులును పరి సయ్యులును ఆయన మీద నిండ పగబట్టి ఆయన మీద నేరము మోపవలెనని యుండి, ఆయన నోట నుండి వచ్చు ఏమాటనైనను పట్టుకొనుటకు పొంచి,
లూకా సువార్త 11 : 54 (TEV)
వదకుచు చాల సంగతులనుగూర్చి ఆయనను మాట లాడింపసాగిరి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54

BG:

Opacity:

Color:


Size:


Font: