లూకా సువార్త 3 : 1 (TEV)
తిబెరికైసరు ఏలుబడిలో పదునైదవ సంవత్సరమందు యూదయకు పొంతిపిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశ ములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబి లేనే దేశమునకు లుసానియ అధిపతిగాను,
లూకా సువార్త 3 : 2 (TEV)
అన్నయు, కయపయు ప్రధాన యాజకులుగాను, ఉన్నకాలమున అరణ్యములోనున్న జెకర్యా కుమారుడైన యోహాను నొద్దకు దేవుని వాక్యము వచ్చెను.
లూకా సువార్త 3 : 3 (TEV)
అంతట అతడు వచ్చి, పాపక్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము పొందవ లెనని యొర్దాను నదీ ప్రదేశమందంతట ప్రకటించు చుండెను.
లూకా సువార్త 3 : 4 (TEV)
ప్రభువు మార్గము సిద్ధపరచుడి ఆయన త్రోవలు సరాళముచేయుడి
లూకా సువార్త 3 : 5 (TEV)
ప్రతి పల్లము పూడ్చబడును ప్రతి కొండయు మెట్టయు పల్లము చేయబడును వంకర మార్గములు తిన్ననివగును కరకు మార్గములు నున్ననివగును
లూకా సువార్త 3 : 6 (TEV)
సకల శరీరులు దేవుని రక్షణ చూతురు అని అరణ్యములో కేకలువేయుచున్న యొకని శబ్దము అని ప్రవక్తయైన యెషయా వాక్యముల గ్రంథమందు వ్రాయబడినట్టు ఇది జరిగెను.
లూకా సువార్త 3 : 7 (TEV)
అతడు తనచేత బాప్తిస్మము పొందవచ్చిన జనసమూహ ములను చూచిసర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు?
లూకా సువార్త 3 : 8 (TEV)
మారుమనస్సునకు తగిన ఫలములు ఫలించుడి అబ్రాహాము మాకు తండ్రి అని మీలో మీరనుకొన మొదలుపెట్టుకొనవద్దు; దేవుడు ఈ రాళ్లవలన అబ్రా హామునకు పిల్లలను పుట్టింపగలడని మీతో చెప్పు చున్నాను.
లూకా సువార్త 3 : 9 (TEV)
ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి యున్నది గనుక మంచి ఫలము ఫలించని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడునని చెప్పెను.
లూకా సువార్త 3 : 10 (TEV)
అందుకు జనులుఆలాగైతే మేమేమి చేయవలెనని అతని నడుగగా
లూకా సువార్త 3 : 11 (TEV)
అతడురెండు అంగీలుగలవాడు ఏమియు లేనివానికియ్య వలెననియు, ఆహారముగలవాడును ఆలాగే చేయవలె ననియు వారితో చెప్పెను.
లూకా సువార్త 3 : 12 (TEV)
సుంకరులును బాప్తిస్మము పొందవచ్చిబోధకుడా, మేమేమి చేయవలెనని అతని నడుగగా
లూకా సువార్త 3 : 13 (TEV)
అతడు మీకు నిర్ణయింపబడినదాని కంటె ఎక్కువతీసికొనవద్దని వారితో చెప్పెను.
లూకా సువార్త 3 : 14 (TEV)
సైనికులును మేమేమి చేయవలెనని అతని నడిగిరి. అందుకు అతడుఎవనిని బాధపెట్టకయు, ఎవని మీదను అపనింద వేయ కయు, మీ జీతములతో తృప్తిపొందియుండుడని వారితో చెప్పెను.
లూకా సువార్త 3 : 15 (TEV)
ప్రజలు కనిపెట్టుచు, ఇతడు క్రీస్తయి యుండునేమో అని అందరును యోహానును గూర్చి తమ హృదయములలో ఆలోచించుకొనుచుండగా
లూకా సువార్త 3 : 16 (TEV)
యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మమిచ్చుచున్నాను; అయితే నాకంటె శక్తి మంతుడొకడు వచ్చుచున్నాడు; ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను; ఆయన పరిశుద్ధాత్మ లోను1 అగ్నితోను మీకు బాప్తిస్మమిచ్చును;
లూకా సువార్త 3 : 17 (TEV)
ఆయన చేట ఆయన చేతిలోనున్నది; ఆయన తన కళ్లమును బాగుగా శుభ్రముచేసి, తన కొట్టులో గోధుమలుపోసి, ఆరని అగ్నితో పొట్టు కాల్చి వేయునని అందరితో చెప్పెను.
లూకా సువార్త 3 : 18 (TEV)
ఇదియుగాక అతడింకను, చాల సంగతులు చెప్పి ప్రజలను హెచ్చరించుచు వారికి సువార్త ప్రకటించు చుండెను.
లూకా సువార్త 3 : 19 (TEV)
అయితే చతుర్థాధిపతియైన హేరోదుచేసిన సకల దుష్కార్యముల నిమిత్తమును, అతని సోదరుని భార్య యైన హేరోదియ నిమిత్తమును, యోహాను అతనిని గద్దించినందుకు
లూకా సువార్త 3 : 20 (TEV)
అదివరకు తాను చేసినవన్నియు చాల వన్నట్టు అతడు యోహానును చెరసాలలో వేయించెను.
లూకా సువార్త 3 : 21 (TEV)
ప్రజలందరును బాప్తిస్మము పొందినప్పుడు యేసుకూడ బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి
లూకా సువార్త 3 : 22 (TEV)
పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురమువలె ఆయనమీదికి దిగి వచ్చెను. అప్పుడునీవు నా ప్రియ కుమారుడవు, నీయందు నేనానందించుచున్నానని యొక శబ్దము ఆకాశమునుండి వచ్చెను.
లూకా సువార్త 3 : 23 (TEV)
యేసు (బోధింప) మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు ముప్పది ఏండ్ల యీడుగలవాడు; ఆయన యోసేపు కుమారుడని యెంచబడెను. యోసేపు హేలీకి,
లూకా సువార్త 3 : 24 (TEV)
హేలీ మత్తతుకు, మత్తతు లేవికి, లేవి మెల్కీకి,
లూకా సువార్త 3 : 25 (TEV)
మెల్కీ యన్నకు, యన్న యోసేపుకు, యోసేపు మత్తతీయకు, మత్తతీయ ఆమోసుకు, ఆమోసు నాహోముకు, నాహోము ఎస్లికి, ఎస్లి నగ్గయికి,
లూకా సువార్త 3 : 26 (TEV)
నగ్గయి మయతుకు, మయతు మత్తతీయకు, మత్తతీయ సిమియకు, సిమియ యోశేఖుకు, యోశేఖు యోదాకు,
లూకా సువార్త 3 : 27 (TEV)
యోదా యోహన్నకు, యోహన్న రేసాకు, రేసా జెరుబ్బాబెలుకు, జెరుబ్బాబెలు షయల్తీ యేలుకు, షయల్తీయేలు నేరికి,
లూకా సువార్త 3 : 28 (TEV)
నేరి మెల్కీకి, మెల్కీ అద్దికి, అద్ది కోసాముకు, కోసాము ఎల్మదాముకు, ఎల్మదాము ఏరుకు,
లూకా సువార్త 3 : 29 (TEV)
ఏరు యెహోషువకు, యెహోషువ ఎలీయెజెరుకు, ఎలీయెజెరు యోరీముకు, యోరీము మత్తతుకు, మత్తతు లేవికి,
లూకా సువార్త 3 : 30 (TEV)
లేవి షిమ్యోనుకు, షిమ్యోను యూదాకు, యూదా యోసేపుకు, యోసేపు యోనాముకు, యోనాము ఎల్యా కీముకు,
లూకా సువార్త 3 : 31 (TEV)
ఎల్యాకీము మెలెయాకు, మెలెయా మెన్నాకు, మెన్నా మత్తతాకు, మత్తతా నాతానుకు, నాతాను దావీ దుకు,
లూకా సువార్త 3 : 32 (TEV)
దావీదు యెష్షయికి, యెష్షయి ఓబేదుకు, ఓబేదు బోయజుకు, బోయజు శల్మానుకు, శల్మాను నయస్సోనుకు,
లూకా సువార్త 3 : 33 (TEV)
నయస్సోను అమీ్మనాదాబుకు, అమీ్మనాదాబు అరాముకు, అరాము ఎస్రోముకు, ఎస్రోము పెరెసుకు, పెరెసు యూదాకు,
లూకా సువార్త 3 : 34 (TEV)
యూదా యాకోబుకు, యాకోబు ఇస్సాకుకు, ఇస్సాకు అబ్రాహాముకు, అబ్రాహాము తెర హుకు, తెరహు నాహోరుకు,
లూకా సువార్త 3 : 35 (TEV)
నాహోరు సెరూగుకు, సెరూగు రయూకు, రయూ పెలెగుకు, పెలెగు హెబెరుకు, హెబెరు షేలహుకు,
లూకా సువార్త 3 : 36 (TEV)
షేలహు కేయినానుకు, కేయి నాను అర్పక్షదుకు, అర్పక్షదు షేముకు, షేము నోవహుకు, నోవహు లెమెకుకు,
లూకా సువార్త 3 : 37 (TEV)
లెమెకు మెతూషెలకు, మెతూ షెల హనోకుకు, హనోకు యెరెదుకు, యెరెదు మహల లేలుకు, మహలలేలు కేయినానుకు,
లూకా సువార్త 3 : 38 (TEV)
కేయినాను ఎనోషుకు, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38

BG:

Opacity:

Color:


Size:


Font: