మార్కు సువార్త 13 : 1 (TEV)
ఆయన దేవాలయములోనుండి వెళ్లుచుండగా ఆయన శిష్యులలో ఒకడుబోధకుడా, యీ రాళ్లేలాటివో యీ కట్టడములు ఏలాటివో చూడుమని ఆయనతో అనెను.
మార్కు సువార్త 13 : 2 (TEV)
అందుకు యేసుఈ గొప్ప కట్టడములు చూచుచున్నావే; రాతిమీద రాయి యొకటియైన ఇక్కడ నిలిచియుండకుండ పడద్రోయబడునని అతనితో చెప్పెను.
మార్కు సువార్త 13 : 3 (TEV)
ఆయన దేవాలయము ఎదుట ఒలీవల కొండమీద కూర్చుండియుండగా, పేతురు యాకోబు యోహాను అంద్రెయ అను వారు ఆయనను చూచి
మార్కు సువార్త 13 : 4 (TEV)
ఇవి ఎప్పుడు జరుగును? ఇవన్నియు నెరవేరబోవుకాలమునకు ఏ గురుతు కలుగును? అది మాతో చెప్పుమని ఆయనను ఏకాంత మందు అడుగగా
మార్కు సువార్త 13 : 5 (TEV)
యేసు వారితో ఇట్లు చెప్పసాగెను ఎవడును మిమ్మును మోసపుచ్చకుండ చూచుకొనుడి.
మార్కు సువార్త 13 : 6 (TEV)
అనేకులు నా పేరట వచ్చినేనే ఆయననని చెప్పి అనేకులను మోసపుచ్చెదరు.
మార్కు సువార్త 13 : 7 (TEV)
మీరు యుద్ధములను గూర్చియు యుద్ధసమాచారములను గూర్చియు విను నప్పుడు కలవరపడకుడి; ఇవి జరుగవలసియున్నవి గాని అంతము వెంటనే రాదు.
మార్కు సువార్త 13 : 8 (TEV)
జనముమీదికి జనమును రాజ్యముమీదికి రాజ్యమును లేచును, అక్కడక్కడ భూకంపములు కలుగును, కరవులు వచ్చును. ఇవే వేద నలకుప్రారంభము.
మార్కు సువార్త 13 : 9 (TEV)
మిమ్మునుగూర్చి మీరే జాగ్రత్తపడుడి. వారు మిమ్మును సభల కప్పగించెదరు; మిమ్మును సమాజమందిరములలో కొట్టించెదరు; మీరు వారికి సాక్ష్యార్థమై అధిపతుల యెదుటను రాజుల యెదుటను నా నిమిత్తము నిలువబడె దరు.
మార్కు సువార్త 13 : 10 (TEV)
సకల జనములకు సువార్త ముందుగా ప్రకటింప బడవలెను.
మార్కు సువార్త 13 : 11 (TEV)
వారు మిమ్మును అప్పగించుటకు కొనిపోవు నప్పుడు మీరుఏమి చెప్పుదుమా అని ముందుగా చింతింపకుడి, ఆ గడియలోనే మీకేది ఇయ్యబడునో అదే చెప్పుడి; చెప్పువాడు పరిశుద్ధాత్మయే గాని మీరు కారు.
మార్కు సువార్త 13 : 12 (TEV)
సహోదరుడు సహోదరుని, తండ్రి కుమారుని, మరణమున కప్పగింతురు; కుమారులు తలిదండ్రులమీద లేచి వారిని చంపింతురు;
మార్కు సువార్త 13 : 13 (TEV)
నా నామము నిమిత్తము అందరిచేత మీరు ద్వేషింపబడుదురు; అంతమువరకు సహించినవాడే రక్షణ పొందును.
మార్కు సువార్త 13 : 14 (TEV)
మరియు నాశకరమైన హేయవస్తువు నిలువరాని స్థలమందు నిలుచుట మీరు చూచునప్పుడు చదువు వాడు గ్రహించుగాకయూదయలో ఉండువారు కొండలకు పారిపోవలెను;
మార్కు సువార్త 13 : 15 (TEV)
మిద్దెమీద ఉండువాడు ఇంటిలోనుండి ఏదైనను తీసికొనిపోవుటకై దిగి అందులో ప్రవేశింపకూడదు;
మార్కు సువార్త 13 : 16 (TEV)
పొలములో ఉండువాడు తన వస్త్రము తీసికొనిపోవుటకు ఇంటిలోనికి తిరిగి రాకూడదు.
మార్కు సువార్త 13 : 17 (TEV)
అయ్యో, ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చు వారికిని శ్రమ.
మార్కు సువార్త 13 : 18 (TEV)
అది చలికాలమందు సంభవింపకుండ వలెనని ప్రార్థించుడి.
మార్కు సువార్త 13 : 19 (TEV)
అవి శ్రమగల దినములు; దేవుడు సృజించిన సృష్ట్యాదినుండి ఇదివరకు అంత శ్రమ కలుగ లేదు, ఇక ఎన్నడును కలుగబోదు.
మార్కు సువార్త 13 : 20 (TEV)
ప్రభువు ఆ దినములను తక్కువచేయనియెడల ఏ శరీరియు తప్పించు కొనక పోవును; ఏర్పరచబడినవారి నిమిత్తము, అనగా తాను ఏర్పరచుకొనిన వారినిమిత్తము ఆయన ఆ దినములను తక్కువ చేసెను.
మార్కు సువార్త 13 : 21 (TEV)
కాగాఇదిగో క్రీస్తు ఇక్కడ నున్నాడు, అదిగో అక్కడ నున్నాడు అని యెవడైనను మీతో చెప్పినయెడల నమ్మకుడి.
మార్కు సువార్త 13 : 22 (TEV)
ఆ కాలమందు అబద్ధపు క్రీస్తులును అబద్ధపు ప్రవక్తలును వచ్చి, సాధ్యమైనయెడల ఏర్పరచబడినవారిని మోసపుచ్చుటకై సూచక క్రియలను మహత్కార్యములను అగపరచెదరు.
మార్కు సువార్త 13 : 23 (TEV)
మీరు జాగ్రత్తగా ఉండుడి; ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి యున్నాను.
మార్కు సువార్త 13 : 24 (TEV)
ఆ దినములలో ఆ శ్రమతీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు తన కాంతిని ఇయ్యడు, ఆకాశమునుండి నక్షత్రములు రాలును,
మార్కు సువార్త 13 : 25 (TEV)
ఆకాశమందలి శక్తులు కదలింపబడును.
మార్కు సువార్త 13 : 26 (TEV)
అప్పుడు మనుష్యకుమారుడు మహా ప్రభావముతోను మహిమతోను మేఘారూఢుడై వచ్చుట చూచెదరు.
మార్కు సువార్త 13 : 27 (TEV)
అప్పుడాయన తన దూతలను పంపి, భూమ్యంతము మొదలుకొని ఆకాశాంతమువరకు నలుదిక్కులనుండి తాను ఏర్పరచుకొనినవారిని పోగు చేయించును.
మార్కు సువార్త 13 : 28 (TEV)
అంజూరపుచెట్టును చూచి యొక ఉపమానము నేర్చు కొనుడి. దాని కొమ్మ యింక లేతదై చిగిరించునప్పుడు వసంతకాలము సమీపముగా ఉన్నదని మీకు తెలియును.
మార్కు సువార్త 13 : 29 (TEV)
ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచు నప్పుడు ఆయన సమీపముననే ద్వారము దగ్గరనే ఉన్నాడని తెలిసికొనుడి.
మార్కు సువార్త 13 : 30 (TEV)
ఇవన్నియు జరుగు వరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పు చున్నాను.
మార్కు సువార్త 13 : 31 (TEV)
ఆకాశమును భూమియును గతించును గాని నా మాటలు గతింపవు.
మార్కు సువార్త 13 : 32 (TEV)
ఆ దినమును గూర్చియు ఆ గడియను గూర్చియు తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను, పరలోకమందలి దూత లైనను, కుమారుడైనను ఎరుగరు.
మార్కు సువార్త 13 : 33 (TEV)
జాగ్రత్తపడుడి; మెలకువగానుండి ప్రార్థనచేయుడి; ఆ కాలమెప్పుడు వచ్చునో మీకు తెలియదు.
మార్కు సువార్త 13 : 34 (TEV)
ఒక మనుష్యుడు తన దాసులకు అధికారమిచ్చి, ప్రతివానికి వాని వాని పని నియమించిమెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి, యిల్లు విడిచి దేశాంతరము పోయినట్టే (ఆ కాలము ఉండును.)
మార్కు సువార్త 13 : 35 (TEV)
ఇంటి యజమానుడు ప్రొద్దు గ్రుంకివచ్చునో, అర్ధరాత్రివచ్చునో, కోడికూయునప్పుడు వచ్చునో, తెల్లవారునప్పుడు వచ్చునో, యెప్పుడు వచ్చునో మీకు తెలియదు.
మార్కు సువార్త 13 : 36 (TEV)
ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రబోవుచుండుట చూచునేమో గనుక మీరు మెలకువగా నుండుడి.
మార్కు సువార్త 13 : 37 (TEV)
నేను మీతో చెప్పుచున్నది అందరితోను చెప్పుచున్నాను; మెలకువగా నుండుడనెను.
❮
❯