మార్కు సువార్త 2 : 1 (TEV)
కొన్నిదినములైన పిమ్మట ఆయన మరల కపెర్న హూములోనికి వచ్చెను
మార్కు సువార్త 2 : 2 (TEV)
ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అ నేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా
మార్కు సువార్త 2 : 3 (TEV)
కొందరు పక్షవాయువుగల ఒక మనుష్యుని నలుగురిచేత మోయించుకొని ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
మార్కు సువార్త 2 : 4 (TEV)
చాలమంది కూడియున్నందున వారాయనయొద్దకు చేరలేక, ఆయన యున్నచోటికి పైగా ఇంటి కప్పు విప్పి, సందుచేసి పక్షవాయువుగలవానిని పరుపుతోనే దింపిరి.
మార్కు సువార్త 2 : 5 (TEV)
యేసు వారి విశ్వాసము చూచికుమారుడా, నీ పాపములు క్షమింపబడియున్నవని పక్ష వాయువుగలవానితో చెప్పెను.
మార్కు సువార్త 2 : 6 (TEV)
శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండియుండిరి.
మార్కు సువార్త 2 : 7 (TEV)
వారుఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయుచున్నాడు గదా; దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి.
మార్కు సువార్త 2 : 8 (TEV)
వారు తమలో తాము ఈలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని మీరీలాటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు?
మార్కు సువార్త 2 : 9 (TEV)
ఈ పక్షవాయువుగలవానితో నీ పాపములు క్షమింప బడియున్నవని చెప్పుట సులభమా? నీవు లేచి నీ పరుపెత్తి కొని నడువుమని చెప్పుట సులభమా?
మార్కు సువార్త 2 : 10 (TEV)
అయితే పాపములు క్షమించుటకు భూమిమీద మనుష్యకుమారునికి అధికారము కలదని మీరు తెలిసికొనవలెనని వారితో చెప్పి
మార్కు సువార్త 2 : 11 (TEV)
పక్ష వాయువు గలవానిని చూచినీవు లేచి నీ పరుపెత్తికొని యింటికి పొమ్మని నీతో చెప్పుచున్నాననెను.
మార్కు సువార్త 2 : 12 (TEV)
తక్షణమే వాడు లేచి, పరుపెత్తికొని, వారందరియెదుట నడచి పోయెను గనుక, వారందరు విభ్రాంతినొందిమనమీలాటి కార్యములను ఎన్నడును చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి.
మార్కు సువార్త 2 : 13 (TEV)
ఆయన సముద్రతీరమున మరల నడచిపోవుచుండెను. జనులందరును ఆయనయొద్దకు రాగా ఆయన వారికి బోధించెను.
మార్కు సువార్త 2 : 14 (TEV)
ఆయన మార్గమున వెళ్లుచు, సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా, అతడు లేచి, ఆయనను వెంబడించెను.
మార్కు సువార్త 2 : 15 (TEV)
అతని యింట ఆయన భోజన మునకు కూర్చుండియుండగా, సుంకరులును పాపులును అనేకులు యేసుతోను ఆయన శిష్యులతోను కూర్చుండి యుండిరి. ఇట్టివారనేకులుండిరి; వారాయనను వెంబ డి
మార్కు సువార్త 2 : 16 (TEV)
పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోను పాపులతోను భుజించుట చూచిఆయన సుంకరులతోను పాపులతోను కలిసి భోజనము చేయు చున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా
మార్కు సువార్త 2 : 17 (TEV)
యేసు ఆ మాట వినిరోగులకే గాని ఆరోగ్యముగలవారికి వైద్యు డక్కరలేదు; నేను పాపులనే పిలువ వచ్చితినిగాని నీతి మంతులను పిలువరాలేదని వారితో చెప్పెను.
మార్కు సువార్త 2 : 18 (TEV)
యోహాను శిష్యులును పరిసయ్యులును ఉపవాసము చేయుట కద్దు. వారు వచ్చియోహాను శిష్యులును పరిసయ్యుల శిష్యులును ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు; దీనికి హేతువేమని ఆయన నడుగగా
మార్కు సువార్త 2 : 19 (TEV)
యేసుపెండ్లికుమారుడు తమతోకూడ ఉన్న కాలమున పెండ్లి ఇంటివారు ఉపవాసము చేయ దగునా? పెండ్లికుమారుడు తమతోకూడ ఉన్నంతకాలము ఉపవాసము చేయదగదు గాని
మార్కు సువార్త 2 : 20 (TEV)
పెండ్లికుమారుడు వారి యొద్దనుండి కొనిపోబడు దినములు వచ్చును; ఆ దినముల లోనే వారుపవాసము చేతురు.
మార్కు సువార్త 2 : 21 (TEV)
ఎవడును పాతబట్టకు క్రొత్తగుడ్డ మాసిక వేయడు; వేసినయెడల ఆ క్రొత్తమాసిక పాతబట్టను వెలితిపరచును, చినుగు మరి ఎక్కువగును.
మార్కు సువార్త 2 : 22 (TEV)
ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షారసము పోయడు; పోసినయెడల ద్రాక్షారసము ఆ తిత్తులను పిగుల్చును, రసమును తిత్తులును చెడును; అయితే క్రొత్త ద్రాక్షా రసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పెను.
మార్కు సువార్త 2 : 23 (TEV)
మరియు ఆయన విశ్రాంతిదినమున పంటచేలలోబడి వెళ్లుచుండగా, శిష్యులు మార్గమున సాగిపోవుచు వెన్నులు త్రుంచుచునుండిరి.
మార్కు సువార్త 2 : 24 (TEV)
అందుకు పరిసయ్యులుచూడుము, విశ్రాంతిదినమున చేయకూడనిది వారేల చేయు చున్నారని ఆయన నడిగిరి.
మార్కు సువార్త 2 : 25 (TEV)
అందుకాయన వారితో ఇట్లనెనుతానును తనతో కూడ నున్నవారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడును చదువలేదా?
మార్కు సువార్త 2 : 26 (TEV)
అబ్యాతారు ప్రధాన యాజకుడై యుండగా దేవమందిరములోనికి వెళ్లి, యాజకులే గాని యితరులు తినకూడని సముఖపు రొట్టెలు తాను తిని, తనతోకూడ ఉన్నవారికిచ్చెను గదా అని చెప్పెను.
మార్కు సువార్త 2 : 27 (TEV)
మరియువిశ్రాంతిదినము మనుష్యులకొరకే నియమింపబడెను గాని మనుష్యులు విశ్రాంతిదినముకొరకు నియమింపబడలేదు.
మార్కు సువార్త 2 : 28 (TEV)
అందువలన మనుష్యకుమారుడు విశ్రాంతిదినమునకును ప్రభువై యున్నాడని వారితో చెప్పెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: