నహూము 2 : 1 (TEV)
లయకర్త నీమీదికి వచ్చుచున్నాడు, నీ దుర్గమునకు కావలికాయుము, మార్గములో కావలియుండుము, నడుము బిగించుకొని బహు బలముగా ఎదిరించుము,
నహూము 2 : 2 (TEV)
దోచు కొనువారు వారిని దోపుడుసొమ్ముగా పట్టుకొనినను, వారి ద్రాక్షావల్లులను నరికివేసినను, అతిశయాస్పదముగా ఇశ్రా యేలీయులకువలె యెహోవా యాకోబు సంతతికి మరల అతిశయాస్పదముగా అనుగ్రహించును.
నహూము 2 : 3 (TEV)
ఆయన బలా ఢ్యుల డాళ్లు ఎరుపాయెను, పరాక్రమశాలురు రక్తవర్ణపు వస్త్రములు ధరించుకొనియున్నారు, ఆయన సైన్యము వ్యూహపరచిన దినమున రథభూషణములు అగ్నివలె మెరయుచున్నవి, సరళ దారుమయమైన యీటెలు ఆడు చున్నవి;
నహూము 2 : 4 (TEV)
వీధులలో రథములు మిక్కిలి తొందరగా పోవుచున్నవి, రాజమార్గములలో రథములు ఒక దానిమీద నొకటి పడుచు పరుగెత్తుచున్నవి, అవి దివిటీలవలె కన బడుచున్నవి, మెరుపులవలె అవి పరుగెత్తుచున్నవి,
నహూము 2 : 5 (TEV)
రాజు తన పరాక్రమశాలురను జ్ఞాపకము చేసికొనగా వారు నడుచుచు పడిపోవుదురు, ప్రాకారమునకు పరుగెత్తి వచ్చి మ్రాను సిద్ధపరచుదురు.
నహూము 2 : 6 (TEV)
నదులదగ్గరనున్న గుమ్మ ములు తెరువబడుచున్నవి, నగరుపడిపోవుచున్నది.
నహూము 2 : 7 (TEV)
నిర్ణయమాయెను, అది దిగంబరమై కొనిపోబడుచున్నది, గువ్వలు మూల్గునట్లు దాని దాసీలు రొమ్ము కొట్టు కొనుచు మూల్గుచున్నారు.
నహూము 2 : 8 (TEV)
కట్టబడినప్పటినుండి నీనెవె పట్టణము నీటికొలనువలె ఉండెను; దాని జనులు పారిపోవు చున్నారు; నిలువుడి నిలువుడి అని పిలిచినను తిరిగి చూచువాడొకడును లేడు.
నహూము 2 : 9 (TEV)
వెండి కొల్లపెట్టుడి, బంగా రము కొల్లపెట్టుడి, అది సకలవిధములైన విచిత్రములగు ఉపకరణములతో నిండియున్నది, అవి లెక్కలేక యున్నవి.
నహూము 2 : 10 (TEV)
అది వట్టిదిగాను శూన్యముగాను పాడుగాను అగుచున్నది, జనుల హృదయము కరిగిపోవుచున్నది, మోకాళ్లు వణకుచున్నవి, అందరి నడుములు బహుగా నొచ్చుచున్నవి, అందరి ముఖములు తెల్లబోవుచున్నవి.
నహూము 2 : 11 (TEV)
సింహముల గుహ యేమాయెను? సింహపుపిల్లల మేతస్థల మేమాయెను? ఎవరును బెదరింపకుండ సింహమును ఆడు సింహమును సింహపు పిల్లలును తిరుగులాడు స్థలమేమా యెను?
నహూము 2 : 12 (TEV)
తన పిల్లలకు కావలసినంత చీల్చివేయుచు, ఆడు సింహములకును కావలసినంత గొంతుక నొక్కి పట్టుచు, తన గుహలను ఎరతోను తన నివాసములను వేటాడి పట్టిన యెరతోను నింపిన సింహమేమాయెను?
నహూము 2 : 13 (TEV)
నేను నీకు విరోధినై యున్నాను, వాటి పొగ పైకెక్కునట్లుగా నీ రథములను కాల్చివేసెదను, కత్తి నీ కొదమ సింహములను మింగివేయును, నీకిక దొరకకుండ భూమిలోనుండి నీవు పట్టుకొనిన యెరను నేను తీసివేతును, నీ దూతల శబ్దము ఇక వినబడదు; ఇదే సైన్యములకధిపతియగు యెహోవా వాక్కు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13