నెహెమ్యా 12 : 1 (TEV)
షయల్తీయేలు కుమారుడైన జెరుబ్బాబెలుతో కూడ వచ్చిన యాజకులును లేవీయులును వీరే. యేషూవ శెరాయా యిర్మీయా ఎజ్రా
నెహెమ్యా 12 : 2 (TEV)
అమర్యా మళ్లూకు హట్టూషు
నెహెమ్యా 12 : 3 (TEV)
షెకన్యా రెహూము మెరేమోతు
నెహెమ్యా 12 : 4 (TEV)
ఇద్దో గిన్నెతోను అబీయా.
నెహెమ్యా 12 : 5 (TEV)
మీయామిను మయద్యా బిల్గా
నెహెమ్యా 12 : 6 (TEV)
షెమయా యోయారీబు యెదాయా
నెహెమ్యా 12 : 7 (TEV)
సల్లూ ఆమోకు హిల్కీయా యెదాయా అనువారు.వారందరును యేషూవ దినములలో యాజకులలోను వారి బంధువులలోను ప్రధానులుగా ఉండిరి.
నెహెమ్యా 12 : 8 (TEV)
మరియు లేవీయులలో యేషూవ బిన్నూయి కద్మీయేలు షేరేబ్యా యూదా స్తోత్రాది సేవవిషయములో ప్రధానియైన మత్తన్యాయు అతని బంధువులును.
నెహెమ్యా 12 : 9 (TEV)
మరియు బక్బుక్యాయు ఉన్నీయును వారి బంధువులును వారికి ఎదురు వరుసలోనుండి పాడువారు.
నెహెమ్యా 12 : 10 (TEV)
యేషూవ యోయాకీమును కనెను, యోయాకీము ఎల్యాషీబును కనెను, ఎల్యాషీబు యోయా దాను కనెను.
నెహెమ్యా 12 : 11 (TEV)
యోయాదా యోనాతానును కనెను. యోనాతాను యద్దూవను కనెను.
నెహెమ్యా 12 : 12 (TEV)
యోయాకీము దిన ములలో పితరులలో ప్రధానులైనవారు యాజకులై యుండిరి. వారెవరనగా, శెరాయా యింటివారికి మెరాయా, యిర్మీయా యింటివారికి హనన్యా
నెహెమ్యా 12 : 13 (TEV)
ఎజ్రా యింటివారికి మెషుల్లాము, అమర్యా యింటివారికి యెహో హానాను
నెహెమ్యా 12 : 14 (TEV)
మెలీకూ యింటివారికి యోనాతాను, షెబన్యా యింటివారికి యోసేపు
నెహెమ్యా 12 : 15 (TEV)
హారిము ఇంటివారికి అద్నా, మెరాయోతు ఇంటివారికి హెల్కయి
నెహెమ్యా 12 : 16 (TEV)
ఇద్దో యింటివారికి జెకర్యా, గిన్నెతోను ఇంటివారికి మెషుల్లాము
నెహెమ్యా 12 : 17 (TEV)
అబీయా యింటివారికి జిఖ్రీ, మిన్యామీను ఇంటివారికి మోవద్యా యింటివారికి పిల్టయి.
నెహెమ్యా 12 : 18 (TEV)
బిల్గా యింటివారికి షమ్మూయ, షెమయా యింటివారికి యెహో నాతాను
నెహెమ్యా 12 : 19 (TEV)
యోయారీబు ఇంటివారికి మత్తెనై యెదాయా యింటివారికి ఉజ్జీ
నెహెమ్యా 12 : 20 (TEV)
సల్లయి యింటివారికి కల్లయి ఆమోకు ఇంటివారికి ఏబెరు
నెహెమ్యా 12 : 21 (TEV)
హిల్కీయా యింటివారికి హషబ్యా, యెదాయా యింటివారికి నెతనేలు.
నెహెమ్యా 12 : 22 (TEV)
ఎల్యాషీబు దినములలో లేవీయుల విషయములో యోయాదా యోహానాను యద్దూవ కుటుంబ ప్రధానులుగా దాఖలైరి. మరియు పారసీకుడగు దర్యావేషు ఏలుబడికాలములో వారే యాజకకుటుంబ ప్రధానులుగా దాఖలైరి.
నెహెమ్యా 12 : 23 (TEV)
ఎల్యాషీబు కుమారుడైన యోహానాను దినములవరకు అనుదినము జరుగు విషయముల గ్రంథమందు వారు లేవీయుల కుటుంబ ప్రధానులుగా దాఖలైరి.
నెహెమ్యా 12 : 24 (TEV)
లేవీయుల కుటుంబ ప్రధానులైన హషబ్యాయు షేరేబ్యాయును కద్మీయేలు కుమారుడైన యేషూవయును వారికి ఎదురు వరుసలో పాడు తమ బంధువులతోకూడ దైవజనుడైవ దావీదు యొక్క ఆజ్ఞనుబట్టి స్తుతిపాటలు పాడుటకు వంతుల చొప్పున నిర్ణయింపబడిరి.
నెహెమ్యా 12 : 25 (TEV)
మత్తన్యా బక్బుక్యా ఓబద్యా మెషుల్లాము టల్మోను అక్కూబు అనువారు గుమ్మముల దగ్గరనున్న పదార్థపు కొట్టులయొద్ద కాపుకాచు ద్వార పాలకులుగా ఉండిరి.
నెహెమ్యా 12 : 26 (TEV)
వీరు యోజాదాకునకు పుట్టిన యేషూవ కుమారుడైన యోయాకీము దినములలోను అధి కారియైన నెహెమ్యాదినములలోను యాజకుడును శాస్త్రి యునగు ఎజ్రా దినములలోను ఆ పని జరువుచువచ్చిరి.
నెహెమ్యా 12 : 27 (TEV)
యెరూషలేము ప్రాకారమును ప్రతిష్ఠించు కాల ములో వారు ఆ ప్రతిష్ఠాచారమును స్తోత్రగీతములతోను పాటలతోను స్వరమండల సితారా చేయి తాళములతోను సంతోషముగా జరిగించునట్లు లేవీయులను తమ సకల స్థలములలోనుండి యెరూషలేమునకు రప్పించుటకు పూను కొనిరి
నెహెమ్యా 12 : 28 (TEV)
అప్పుడు గాయకుల వంశస్థులు యెరూషలేము చుట్టునున్న మైదాన భూమిలోనుండియు నెటోపాతి యొక్క గ్రామములలో నుండియు కూడుకొని వచ్చిరి.
నెహెమ్యా 12 : 29 (TEV)
మరియు గిల్గాలుయొక్క యింటిలోనుండియు, గెబ యొక్కయు అజ్మావెతుయొక్కయు పొలములలోనుండియు జనులు వచ్చిరి. ఏలయనగా యెరూషలేము చుట్టును గాయకులు తమకు ఊళ్లను కట్టుకొని యుండిరి.
నెహెమ్యా 12 : 30 (TEV)
యాజకు లును లేవీయులును తమ్మును తాము పవిత్రపరచుకొనిన తరువాత జనులను గుమ్మములను ప్రాకారమును పవిత్ర పరచిరి.
నెహెమ్యా 12 : 31 (TEV)
అటుతరువాత నేను యూదుల ప్రధానులను ప్రాకారముమీదికి తోడుకొని వచ్చి స్తోత్రగీతములు పాడువారిని రెండు గొప్ప సమూహములుగా ఏర్పరచితిని. అందులో ఒక సమూహము కుడిప్రక్కను పెంట గుమ్మము వైపున ప్రాకారముమీదను నడిచెను.
నెహెమ్యా 12 : 32 (TEV)
వారివెంబడి హోషయాయును యూదుల ప్రధానులలో సగముమంది యును వెళ్లిరి.
నెహెమ్యా 12 : 33 (TEV)
మరియు అజర్యాయు ఎజ్రాయు మెషుల్లామును
నెహెమ్యా 12 : 34 (TEV)
యూదాయు బెన్యామీనును షెమ యాయును యిర్మీయాయు అనువారు పోయిరి.
నెహెమ్యా 12 : 35 (TEV)
యాజకుల కుమారులలో కొందరు బాకాలు ఊదుచు పోయిరి; వారెవరనగా, ఆసాపు కుమారుడైన జక్కూరునకు పుట్టిన మీకాయా కనిన మత్తన్యాకు పుట్టిన షెమయా కుమారుడైన యోనాతానునకు పుట్టిన జెకర్యాయు
నెహెమ్యా 12 : 36 (TEV)
అతని బంధు వులగు షెమయా అజరేలు మిలలై గిలలై మాయి నెతనేలు యూదా హనానీ అనువారు. వీరు దైవజనుడగు దావీదు యొక్క వాద్యములను వాయించుచు పోయిరి; వారిముందర శాస్త్రియగు ఎజ్రాయును నడిచెను.
నెహెమ్యా 12 : 37 (TEV)
వారికి ఎదురుగా ఉన్న ఊట గుమ్మముదగ్గర దావీదుపురము యొక్క మెట్లమీద దావీదు నగరును దాటి ప్రాకారము వెంబడి తూర్పువైపు నీటి గుమ్మమువరకు పోయిరి.
నెహెమ్యా 12 : 38 (TEV)
స్తోత్రగీతములు పాడువారి రెండవ సమూహము వారికి ఎదురుగా నడిచెను, వారివెంబడి నేనును వెళ్లితిని. ప్రాకారముమీదనున్న సగముమంది కొలుముల గోపురము అవతలనుండి వెడల్పు ప్రాకారమువరకు వెళ్లిరి.
నెహెమ్యా 12 : 39 (TEV)
మరియు వారు ఎఫ్రాయిము గుమ్మము అవతలనుండియు, పాత గుమ్మము అవతలనుండియు, మత్స్యపు గుమ్మము అవతల నుండియు, హనన్యేలు గోపురమునుండియు, మేయా గోపురమునుండియు, గొఱ్ఱల గుమ్మమువరకు వెళ్లి బందీ గృహపు గుమ్మములో నిలిచిరి.ఒ
నెహెమ్యా 12 : 40 (TEV)
ఆ ప్రకారమే దేవుని మందిరములో స్తోత్రగీతములు పాడువారి రెండు సమూహ ములును నేనును, నాతోకూడ ఉన్న అధికారులలో సగముమందియు నిలిచియుంటిమి.
నెహెమ్యా 12 : 41 (TEV)
యాజకులగు ఎల్యా కీము మయశేయా మిన్యామీను మీకాయా ఎల్యోయేనై జెకర్యా హనన్యా బాకాలు పట్టుకొనిరి.
నెహెమ్యా 12 : 42 (TEV)
ఇజ్రహయా అనువాడు నడిపింపగా మయశేయా షెమయా ఎలియాజరు ఉజ్జీ యెహోహానాను మల్కీయా ఏలాము ఏజెరులను గాయకులు బిగ్గరగా పాడిరి.
నెహెమ్యా 12 : 43 (TEV)
మరియు దేవుడు తమకు మహానందము కలుగజేసెనని ఆ దినమున వారు గొప్ప బలులను అర్పించి సంతోషించిరి. వారి భార్యలు పిల్లలుకూడ సంతోషించిరి. అందువలన యెరూషలేములో పుట్టిన ఆనందధ్వని బహు దూరమునకు వినబడెను.
నెహెమ్యా 12 : 44 (TEV)
ఆ కాలమందు పదార్థములకును ప్రతిష్ఠార్పణలకును ప్రథమ ఫలములకును పదియవవంతుల సంబంధమైన వాటికిని ఏర్పడిన గదులమీద కొందరు నియమింపబడిరి, వారు యాజకుల కొరకును లేవీయులకొరకును ధర్మశాస్త్రాను సారముగా నిర్ణయింపబడిన భాగములను పట్టణముల పొలములనుండి సమకూర్చుటకు నియమింపబడిరి; సేవ చేయుటకు నియమింపబడిన యాజకులనుబట్టియు, లేవీయు లనుబట్టియు యూదులు సంతోషించిరి.
నెహెమ్యా 12 : 45 (TEV)
మరియు గాయ కులును ద్వారపాలకులును దావీదును అతని కుమారుడైన సొలొమోనును ఆజ్ఞాపించినట్లు దేవునిగూర్చిన పనులను తమ శుద్ధినిగూర్చిన పనులను నెరవేర్చుచు వచ్చిరి.
నెహెమ్యా 12 : 46 (TEV)
పూర్వ మందు దావీదు దినములలో గాయకుల విషయములోను స్తోత్రగీతముల విషయములోను పాటల విషయములోను ఆసాపు1 ప్రధానుడు.
నెహెమ్యా 12 : 47 (TEV)
జెరుబ్బాబెలు దినములలో నేమి నెహెమ్యా దినములలో నేమి ఇశ్రాయేలీయులందరును వారి వంతులచొప్పున గాయకుల కును ద్వారపాలకులకును భోజనపదార్థములను అనుదినము ఇచ్చుచు వచ్చిరి. మరియు వారు లేవీయుల నిమిత్తము అర్పణలను ప్రతి ష్ఠించుచు వచ్చిరి. లేవీయులు అహరోను వంశస్థులకు వాటిని ప్రతిష్ఠించిరి.
❮
❯