నెహెమ్యా 7 : 1 (TEV)
నేను ప్రాకారమును కట్టి తలుపులు నిలిపి, ద్వార పాలకులను గాయకులను లేవీయులను నియమించిన పిమ్మట
నెహెమ్యా 7 : 2 (TEV)
నా సహోదరుడైన హనానీకిని, కోటకు అధిపతియైన హనన్యాకును యెరూషలేముపైన అధి కారము ఇచ్చితిని. హనన్యా నమ్మకమైన మనుష్యుడు, అందరికంటె ఎక్కువగా దేవునియెదుట భయభక్తులు గలవాడు.
నెహెమ్యా 7 : 3 (TEV)
అప్పుడు నేనుబాగుగా ప్రొద్దెక్కు వరకు యెరూషలేముయొక్క గుమ్మముల తలుపులు తియ్యకూడదు;మరియు జనులు దగ్గర నిలువబడియుండగా తలుపులు వేసి అడ్డగడియలు వాటికి వేయవలెననియు, ఇదియుగాక యెరూషలేము కాపురస్థు లందరు తమ తమ కావలి వంతులనుబట్టి తమ యిండ్లకు ఎదురుగా కాచుకొనుటకు కావలి నియమింపవలెననియు చెప్పితిని.
నెహెమ్యా 7 : 4 (TEV)
అప్పటిలో ఆ పట్టణము మిగుల విశాలముగాను పెద్దదిగాను ఉండెనుగాని దానిలో జనులు కొద్దిగా ఉండిరి, యిండ్లు ఇంక కట్టబడలేదు.
నెహెమ్యా 7 : 5 (TEV)
జనసంఖ్యచేయునట్లు నా దేవుడు నా హృదయములో తలంపు పుట్టింపగా, ప్రధానులను అధికారులను జనులను నేను సమకూర్చితిని. అంతలో ముందు వచ్చినవారినిగూర్చిన వంశావళి గ్రంథము నాకు కనబడెను, అందులో వ్రాయబడిన వంశావళులు ఇవి.
నెహెమ్యా 7 : 6 (TEV)
జెరుబ్బాబెలు యేషూవ నెహెమ్యా అజర్యా రయమ్యా నహమానీ మొర్దెకై బిల్షాను మిస్పెరేతు బిగ్వయి నెహూము బయనా అనువారితోకూడ బాబెలు రాజైన నెబుకద్నెజరుచేత చెరలోనికి కొనిపోబడి
నెహెమ్యా 7 : 7 (TEV)
తిరిగి యెరూషలేమునకును యూదాదేశమునకును తమ తమ పట్టణములకు వచ్చినవారు వీరే. ఇశ్రాయేలీయులయొక్క జనసంఖ్య యిదే.
నెహెమ్యా 7 : 8 (TEV)
అది ఏలాగనగా పరోషువంశస్థులు రెండువేల నూట డెబ్బదియిద్దరును
నెహెమ్యా 7 : 9 (TEV)
షెఫట్య వంశస్థులు మూడువందల డెబ్బది యిద్దరును
నెహెమ్యా 7 : 10 (TEV)
ఆరహు వంశస్థులు ఆరువందల ఏబది యిద్దరును
నెహెమ్యా 7 : 11 (TEV)
యేషూవ యోవాబు సంబంధు లైన పహత్మోయాబు వంశస్థులు రెండువేల ఎనిమిదివందల పదునెనిమిదిమందియు
నెహెమ్యా 7 : 12 (TEV)
ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును.
నెహెమ్యా 7 : 13 (TEV)
జత్తూవంశస్థులు ఎనిమిది వందల నలువది యయిదుగురును
నెహెమ్యా 7 : 14 (TEV)
జక్కయి వంశస్థులు ఏడువందల అరువది మందియు
నెహెమ్యా 7 : 15 (TEV)
బిన్నూయి వంశస్థులుఆరువందల నలువది యెనమండుగురును
నెహెమ్యా 7 : 16 (TEV)
బేబై వంశస్థులు ఆరువందల ఇరువది యెనమండుగురును
నెహెమ్యా 7 : 17 (TEV)
అజ్గాదు వంశస్థులు రెండువేల మూడువందల ఇరువది యిద్దరును
నెహెమ్యా 7 : 18 (TEV)
అదోనీకాము వంశస్థులు ఆరువందల అరువది యేడుగురును
నెహెమ్యా 7 : 19 (TEV)
బిగ్వయి వంశస్థులు రెండు వేల అరువది యేడుగురును
నెహెమ్యా 7 : 20 (TEV)
అదీను వంశస్థులు ఆరువందల ఏబది యయిదుగురును
నెహెమ్యా 7 : 21 (TEV)
హిజ్కియా బంధువుడైన ఆటేరు వంశస్థులు తొంబది యెనమండు గురును
నెహెమ్యా 7 : 22 (TEV)
హాషుము వంశస్థులు మూడువందల ఇరువది యెనమండుగురును
నెహెమ్యా 7 : 23 (TEV)
జేజయి వంశస్థులు మూడువందల ఇరువదినలుగురును
నెహెమ్యా 7 : 24 (TEV)
హారీపు వంశస్థులు నూటపండ్రెండు గురును
నెహెమ్యా 7 : 25 (TEV)
గిబియోను వంశస్థులు తొంబది యయిదు గురును
నెహెమ్యా 7 : 26 (TEV)
బేత్లెహేము నెటోపావారు నూట ఎనుబది యెనమండు గురును
నెహెమ్యా 7 : 27 (TEV)
అనాతోతువారు నూట ఇరువది యెనమండు గురు
నెహెమ్యా 7 : 28 (TEV)
బేతజ్మావెతువారు నలువది యిద్దరును
నెహెమ్యా 7 : 29 (TEV)
కిర్యత్యారీము కెఫీరా బెయేరోతులవారు ఏడువందల నలువది ముగ్గురును
నెహెమ్యా 7 : 30 (TEV)
రామా గెబలవారు ఆరువందల ఇరువది యొకరును
నెహెమ్యా 7 : 31 (TEV)
మిక్మషువారు నూట ఇరువది యిద్దరును
నెహెమ్యా 7 : 32 (TEV)
బేతేలు హాయిలవారు నూట ఇరువది ముగ్గురును
నెహెమ్యా 7 : 33 (TEV)
రెండవ నెబోవారు ఏబది యిద్దరును
నెహెమ్యా 7 : 34 (TEV)
రెండవ ఏలాము వారు వెయ్యిన్ని రెండువందల ఏబది నలుగురును
నెహెమ్యా 7 : 35 (TEV)
హారిము వంశస్థులు మూడువందల ఇరువది మందియు
నెహెమ్యా 7 : 36 (TEV)
యెరికో వంశస్థులు మూడువందల నలువది యయిదుగురును
నెహెమ్యా 7 : 37 (TEV)
లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడువందల ఇరువది యొకరును
నెహెమ్యా 7 : 38 (TEV)
సెనాయా వంశస్థులు మూడువేల తొమి్మది వందల ముప్పది మందియు
నెహెమ్యా 7 : 39 (TEV)
యాజకులలో యేషూవ యింటివారైన యెదాయా వంశస్థులు తొమి్మదివందల డెబ్బది ముగ్గురును
నెహెమ్యా 7 : 40 (TEV)
ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని ఏబది యిద్దరును
నెహెమ్యా 7 : 41 (TEV)
పషూరు వంశస్థులు వెయ్యిన్ని రెండువందల నలువది యేడుగురును
నెహెమ్యా 7 : 42 (TEV)
హారిము వంశస్థులు వెయ్యిన్ని పదు నేడుగురును
నెహెమ్యా 7 : 43 (TEV)
లేవీయులైన యేషూవ హోదవ్యా కద్మీయేలు అనువారి వంశస్థులు డెబ్బది నలుగురును
నెహెమ్యా 7 : 44 (TEV)
గాయకు లైన ఆసాపు వంశస్థులు నూట నలువది యెనమండుగురును
నెహెమ్యా 7 : 45 (TEV)
ద్వారపాలకులైన షల్లూము వంశస్థులు అటేరు వంశస్థులు టల్మోను వంశ స్థులు అక్కూబు వంశస్థులు హటీటా వంశస్థులు షోబయి వంశస్థులు నూట ముప్పది యెనమండు గురునుొ
నెహెమ్యా 7 : 46 (TEV)
నెతీనీయులైన జీహా వంశస్థులు హశూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు
నెహెమ్యా 7 : 47 (TEV)
కేరోసు వంశస్థులు సీయహా వంశస్థులు పాదోను వంశస్థులు
నెహెమ్యా 7 : 48 (TEV)
లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు షల్మయి వంశస్థులు
నెహెమ్యా 7 : 49 (TEV)
హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు
నెహెమ్యా 7 : 50 (TEV)
రెవాయ వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు
నెహెమ్యా 7 : 51 (TEV)
గజ్జాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పాసెయ వంశస్థులు
నెహెమ్యా 7 : 52 (TEV)
బేసాయి వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూషేసీము వంశస్థులు.
నెహెమ్యా 7 : 53 (TEV)
బక్బూకు వంశస్థులు హకూపా వంశస్థులు హర్హూరు వంశస్థులు
నెహెమ్యా 7 : 54 (TEV)
బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్షా వంశస్థులు
నెహెమ్యా 7 : 55 (TEV)
బర్కోసు వంశస్థులు సీసెరా వంశస్థులు తెమహు వంశస్థులునెజీయహు వంశస్థులు హటీపా వంశస్థులు
నెహెమ్యా 7 : 56 (TEV)
సొలొమాెెను దాసుల వంశస్థులు సొటయి వంశస్థులు
నెహెమ్యా 7 : 57 (TEV)
సోపెరెతు వంశస్థులు పెరూదా వంశస్థులు
నెహెమ్యా 7 : 58 (TEV)
యహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు
నెహెమ్యా 7 : 59 (TEV)
షెఫట్య వంశస్థులు హట్టీలు వంశస్థులు జెబాయీయుల సంబంధమైన పొకెరెతు వంశస్థులు ఆమోను వంశస్థులు.
నెహెమ్యా 7 : 60 (TEV)
ఈ నెతీనీయులందరును సొలొమోను దాసుల వంశస్థులును మూడువందల తొంబది యిద్దరు.
నెహెమ్యా 7 : 61 (TEV)
తేల్మెలహు తేల్హర్షా కెరూబు అదోను ఇమ్మేరు మొద లైన స్థలములనుండి వచ్చినవారు తాము ఇశ్రాయేలీయుల సంబంధులో కారో తెలుపుటకు తమ యింటి పేరులైనను తమ వంశావళి పత్రికయైనను కనుపరచలేకపోయిరి.
నెహెమ్యా 7 : 62 (TEV)
వారెవరనగా దెలాయ్యా వంశస్థులు టోబీయా వంశస్థులు నెరోదా వంశస్థులు వీరు ఆరువందల నలువది యిద్దరు
నెహెమ్యా 7 : 63 (TEV)
హబాయ్యా వంశస్థులు హక్కోజు వంశస్థులు బర్జిల్లయి వంశస్థులు, అనగా గిలాదీయులైన బర్జిల్లయి కుమార్తెలలో ఒకతెను పెండ్లి చేసికొని వారి పేరుచేత పిలువబడిన బర్జిల్లయి వంశస్థులును యాజక సంతానులు.
నెహెమ్యా 7 : 64 (TEV)
వీరి వంశా వళులనుబట్టి యెంచబడినవారిలో వారి పద్దు పుస్తకమును వెదకగా అది కనబడకపోయెను; కాగా వారు అపవిత్రు లుగా ఎంచబడి యాజకులలో ఉండకుండ వేరుపరచబడిరి.
నెహెమ్యా 7 : 65 (TEV)
కాగా అధికారిఊరీము తుమీ్మము అనువాటిని ధరించు కొని ఒక యాజకుడు ఏర్పడువరకు అతి పరిశుద్ధవస్తువులను మీరు తినకూడదని వారితో చెప్పెను.
నెహెమ్యా 7 : 66 (TEV)
సమాజకులందరును నలువది రెండువేల మూడువందల అరువదిమంది.
నెహెమ్యా 7 : 67 (TEV)
వీరు గాక వీరి పని వారును పనికత్తెలును ఏడు వేల మూడు వందల ముప్పది యేడుగురును, గాయకులలో స్త్రీ పురు షులు రెండువందల నలువది యయిదుగురునై ఉండిరి.
నెహెమ్యా 7 : 68 (TEV)
వారి గుఱ్ఱములు ఏడువందల ముప్పది ఆరును, వారి కంచర గాడిదలు రెండువందల నలువది యయిదును
నెహెమ్యా 7 : 69 (TEV)
వారి ఒంటెలు నాలుగువందల ముప్పది యయిదును వారి గాడిదలు ఆరు వేల ఏడువందల ఇరువదియునై యుండెను.
నెహెమ్యా 7 : 70 (TEV)
పెద్దలలో ప్రధానులైన కొందరు పనికి కొంత సహా యము చేసిరి. అధికారి ఖజానాలో నూట ఇరువది తులముల బంగారమును ఏబది పళ్లెములను ఏడువందల ముప్పది యాజక వస్త్రములను వేసి యిచ్చెను.
నెహెమ్యా 7 : 71 (TEV)
మరియు పెద్దలలో ప్రధానులైనవారు కొందరు ఖజానాలో నూట నలువది తులముల బంగారమును పదునాలుగు లక్షల తుల ముల వెండిని వేసిరి.
నెహెమ్యా 7 : 72 (TEV)
మిగిలినవారును రెండువందల నలువది తులముల బంగారమును రెండువందల నలువది లక్షల తుల ముల వెండిని అరువదియేడు యాజక వస్త్రములను ఇచ్చిరి.
నెహెమ్యా 7 : 73 (TEV)
అప్పుడు యాజకులు లేవీయులు ద్వారపాలకులు గాయ కులు జనులలో కొందరును, నెతీనీయులు ఇశ్రాయేలీయు లందరును, తమ పట్టణములయందు నివాసము చేసిరి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73

BG:

Opacity:

Color:


Size:


Font: