సంఖ్యాకాండము 11 : 1 (TEV)
జనులు ఆయాసమునుగూర్చి సణుగుచుండగా అది యెహోవాకు వినబడెను; యెహోవా దాని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను; యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాళెములో నొక కొనను దహింపసాగెను.
సంఖ్యాకాండము 11 : 2 (TEV)
జనులు మోషేకు మొఱపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను.
సంఖ్యాకాండము 11 : 3 (TEV)
యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటికి తబేరా అను పేరు పెట్టబడెను.
సంఖ్యాకాండము 11 : 4 (TEV)
వారి మధ్యనున్న మిశ్రితజనము మాంసాపేక్ష అధి కముగా కనుపరచగా ఇశ్రాయేలీయులును మరల ఏడ్చిమాకెవరు మాంసము పెట్టెదరు?
సంఖ్యాకాండము 11 : 5 (TEV)
ఐగుప్తులో మేము ఉచి తముగా తినిన చేపలును కీరకాయలును దోసకాయలును కూరాకులును ఉల్లిపాయలును తెల్ల గడ్డలును జ్ఞాపకమునకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను.
సంఖ్యాకాండము 11 : 6 (TEV)
ఈ మన్నా కాక మా కన్నులయెదుట మరేమియు లేదని చెప్పుకొనిరి.
సంఖ్యాకాండము 11 : 7 (TEV)
ఆ మన్నా కొతిమెరగింజలవలె ఉండెను. చూపునకు అది బోళమువలె ఉండెను.
సంఖ్యాకాండము 11 : 8 (TEV)
జనులు తిరుగుచు దానిని గూర్చుకొని తిరుగట విసిరి లేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి; దాని రుచి క్రొత్త నూనె రుచివలె ఉండెను.
సంఖ్యాకాండము 11 : 9 (TEV)
రాత్రియందు మంచు పాళెము మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడెను.
సంఖ్యాకాండము 11 : 10 (TEV)
జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారమునొద్దవారు ఏడ్వగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను. వారు ఏడ్చుట మోషే దృష్టికిని చెడ్డదిగా నుండెను.
సంఖ్యాకాండము 11 : 11 (TEV)
కాగా మోషే యెహోవాతో యిట్లనెనునీవేల నీ సేవకుని బాధిం చితివి? నామీద నీ కటాక్షము రానీయక యీ జను లందరి భారమును నామీద పెట్టనేల?
సంఖ్యాకాండము 11 : 12 (TEV)
నేనే యీ సర్వ జనమును గర్భమున ధరించితినా? నేనే వీరిని కంటినా? పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లను మోయునట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకముగా ఇచ్చిన దేశ మునకు వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు.
సంఖ్యాకాండము 11 : 13 (TEV)
ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నా కెక్కడిది? వారు నన్ను చూచి యేడ్చుచు తినుటకు మాకు మాంసమిమ్మని అడుగుచున్నారు
సంఖ్యాకాండము 11 : 14 (TEV)
ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నావలన కాదు; అది నేను భరింపలేని భారము; నీవు నాకిట్లు చేయదలచిన యెడల నన్ను చంపుము.
సంఖ్యాకాండము 11 : 15 (TEV)
నామీద నీ కటాక్షము వచ్చిన యెడల నేను నా బాధను చూడకుండునట్లు నన్ను చంపుము.
సంఖ్యాకాండము 11 : 16 (TEV)
అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెనుజనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రా యేలీయుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యు లను నాయొద్దకు పోగుచేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము. అక్కడ వారు నీతోకూడ నిలువబడవలెను.
సంఖ్యాకాండము 11 : 17 (TEV)
నేను దిగి అక్కడ నీతో మాటలాడెదను. మరియు నీమీద వచ్చిన ఆత్మలో పాలు వారిమీద ఉంచెదను; ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండునట్లు వారు దానిలో నొక పాలు నీతోకూడ భరింపవలెను.
సంఖ్యాకాండము 11 : 18 (TEV)
నీవు జనులను చూచి యిట్ల నుముమిమ్మును మీరు రేపటికి పరిశుద్ధపరచు కొనుడి; మీరు మాంసము తిందురు. యెహోవా విను నట్లు ఏడ్చిమాకు ఎవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మాకు బాగుగానే జరిగినదని మీరు చెప్పు కొంటిరి గనుక యెహోవా మీకు మాంసమిచ్చును, మీరు తిందురు.
సంఖ్యాకాండము 11 : 19 (TEV)
ఒక్క దినము కాదు, రెండు దినములు కాదు, అయిదు దినములు కాదు, పది దినములు కాదు, ఇరువది దినములు కాదు.
సంఖ్యాకాండము 11 : 20 (TEV)
ఒక నెల దినములవరకు, అనగా అది మీ నాసికా రంధ్రములలోనుండి వచ్చి మీకు అసహ్యము పుట్టువరకు దానిని తిందురు; ఏలయనగా మీరు మీ మధ్య నున్న యెహోవాను నిర్లక్ష్యము చేసి ఆయన సన్నిధిని ఏడ్చిఐగుప్తు లోనుండి యెందుకు వచ్చితిమనుకొంటిరి.
సంఖ్యాకాండము 11 : 21 (TEV)
అందుకు మోషేనేను ఈ జనులమధ్య ఉన్నాను; వారు ఆరు లక్షల పాదచారులువారు నెలదినములు తినుటకు వారికి మాంసమిచ్చెదనని చెప్పితివి.
సంఖ్యాకాండము 11 : 22 (TEV)
వారు తృప్తిగా తినునట్లు వారినిమిత్తము గొఱ్ఱలను పశువులను చంప వలెనా? వారు తృప్తిగా తినునట్లు సముద్రపు చేప లన్నియు వారినిమిత్తము కూర్చవలెనా? అనెను.
సంఖ్యాకాండము 11 : 23 (TEV)
అందుకు యెహోవా మోషేతో ఇట్లనెను యెహోవా బాహుబలము తక్కువైనదా? నా మాట నీ యెడల నెరవేరునో లేదో యిప్పుడు చూచెదవు.
సంఖ్యాకాండము 11 : 24 (TEV)
మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి, జనుల పెద్దలలోనుండి డెబ్బదిమంది మనుష్యులను పోగుచేసి గుడారముచుట్టు వారిని నిలువబెట్టగా
సంఖ్యాకాండము 11 : 25 (TEV)
యెహోవా మేఘములో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బదిమంది పెద్దలమీద ఉంచెను; కావున ఆ ఆత్మ వారిమీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచింపలేదు.
సంఖ్యాకాండము 11 : 26 (TEV)
ఆ మను ష్యులలో నిద్దరు పాళెములో నిలిచియుండిరి; వారిలో ఒకనిపేరు ఎల్దాదు, రెండవ వానిపేరు మేదాదు; వారి మీదను ఆత్మ నిలిచియుండెను; వారు వ్రాయబడినవారి లోను ఉండియు వారు గుడారమునకు వెళ్లక తమ పాళెములోనే ప్రవచించిరి.
సంఖ్యాకాండము 11 : 27 (TEV)
అప్పుడు ఒక ¸°వనుడు మోషే యొద్దకు పరుగెత్తివచ్చిఎల్దాదు మేదాదులు పాళె ములో ప్రవచించుచున్నారని చెప్పగా
సంఖ్యాకాండము 11 : 28 (TEV)
మోషే ఏర్పరచు కొనినవారిలో నూను కుమారుడును మోషేకు పరిచార కుడునైన యెహోషువమోషే నా ప్రభువా, వారిని నిషేధింపుమని చెప్పెను.
సంఖ్యాకాండము 11 : 29 (TEV)
అందుకు మోషేనా నిమి త్తము నీకు రోషము వచ్చెనా? యెహోవా ప్రజలందరును ప్రవక్తలగునట్లు యెహోవా తన ఆత్మను వారిమీద ఉంచును గాక అని అతనితో అనెను.
సంఖ్యాకాండము 11 : 30 (TEV)
అప్పుడు మోషేయు ఇశ్రాయేలీయుల పెద్దలును పాళె ములోనికి వెళ్లిరి.
సంఖ్యాకాండము 11 : 31 (TEV)
తరు వాత యెహోవా సన్నిధినుండి ఒక గాలి బయలుదేరి సముద్రమునుండి పూరేళ్లను రప్పించి పాళెముచుట్టు ఈ ప్రక్కను ఆ ప్రక్కను దిన ప్రయాణమంత దూరమువరకు భూమిమీద రెండు మూరల యెత్తున వాటిని పడజేసెను.
సంఖ్యాకాండము 11 : 32 (TEV)
కావున జనులు ఆ దినమంతయు ఆ రాత్రి అంతయు మరుసటి దినమంతయు లేచి ఆ పూరేళ్లను కూర్చుకొను చుండిరి; తక్కువ కూర్చుకొనినవాడు నూరు తూములను కూర్చుకొనెను. తరువాత వారు తమకొరకు పాళెము చుట్టు వాటిని పరచిరి.
సంఖ్యాకాండము 11 : 33 (TEV)
ఆ మాంసము ఇంక వారి పండ్ల సందున నుండగానే, అది నమలకమునుపే, యెహోవా కోపము జనులమీద రగులుకొనెను; యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను.
సంఖ్యాకాండము 11 : 34 (TEV)
మాంసాపేక్షగల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను.
సంఖ్యాకాండము 11 : 35 (TEV)
జనులు కిబ్రోతు హత్తావానుండి హజేరోతుకు ప్రయాణమై పోయి హజేరోతులో దిగిరి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35

BG:

Opacity:

Color:


Size:


Font: