సంఖ్యాకాండము 13 : 1 (TEV)
యెహోవా మోషేకు ఈలాగున సెలవిచ్చెను
సంఖ్యాకాండము 13 : 2 (TEV)
నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చుచున్న కనానుదేశమును సంచరించి చూచుటకు నీవు మనుష్యులను పంపుము. వారి పితరుల గోత్రములలో ఒక్కొక్క దాని నుండి ఒక్కొక్క మనుష్యుని మీరు పంపవలెను; వారిలో ప్రతివాడు ప్రధానుడై యుండవలెను.
సంఖ్యాకాండము 13 : 3 (TEV)
మోషే యెహోవా మాట విని, పారాను అరణ్యమునుండి వారిని పంపెను. వారందరు ఇశ్రాయేలీయులలో ముఖ్యులు.
సంఖ్యాకాండము 13 : 4 (TEV)
వారి పేళ్లు ఏవనగారూబేను గోత్ర మునకు
సంఖ్యాకాండము 13 : 5 (TEV)
జక్కూరు కుమారుడైన షమ్మూయ; షిమ్యోను గోత్రమునకు హోరీ కుమారుడైన షాపాతు;
సంఖ్యాకాండము 13 : 6 (TEV)
యూదా గోత్రమునకు యెఫున్నె కుమారు డైన కాలేబు;
సంఖ్యాకాండము 13 : 7 (TEV)
ఇశ్శాఖారు గోత్రమునకు యోసేపు కుమారుడైన ఇగాలు;
సంఖ్యాకాండము 13 : 8 (TEV)
ఎఫ్రాయిము గోత్రమునకు నూను కుమారుడైన హోషేయ;
సంఖ్యాకాండము 13 : 9 (TEV)
బెన్యామీను గోత్రమునకు రాఫు కుమారుడైన పల్తీ;
సంఖ్యాకాండము 13 : 10 (TEV)
జెబూలూను గోత్రమునకు సోరీ కుమారుడైన గదీయేలు;
సంఖ్యాకాండము 13 : 11 (TEV)
యోసేపు గోత్రమునకు, అనగా మనష్షే గోత్రమునకు సూసీ కుమారుడైన గదీ;
సంఖ్యాకాండము 13 : 12 (TEV)
దాను గోత్రమునకు గెమలి కుమారుడైన అమీ్మయేలు;
సంఖ్యాకాండము 13 : 13 (TEV)
ఆషేరు గోత్రమునకు మిఖాయేలు కుమారుడైన సెతూరు;
సంఖ్యాకాండము 13 : 14 (TEV)
నఫ్తాలి గోత్రమునకు వాపెసీ కుమారుడైన నహబీ;
సంఖ్యాకాండము 13 : 15 (TEV)
గాదు గోత్రమునకు మాకీ కుమారుడైన గెయువేలు అనునవి.
సంఖ్యాకాండము 13 : 16 (TEV)
దేశమును సంచరించి చూచుటకు మోషే పంపిన మనుష్యుల పేళ్లు ఇవి. మోషే నూను కుమారుడైన హోషేయకు యెహోషువ అను పేరు పెట్టెను.
సంఖ్యాకాండము 13 : 17 (TEV)
మోషే కనానుదేశమును సంచరించి చూచుటకు వారిని పంపి నప్పుడు వారితో ఇట్లనెనుమీరు ధైర్యము తెచ్చుకొని దాని దక్షిణదిక్కున ప్రవేశించి ఆ కొండ యెక్కి ఆ దేశము ఎట్టిదో
సంఖ్యాకాండము 13 : 18 (TEV)
దానిలో నివసించు జనము బలముగలదో బలములేనిదో, కొంచెమైనదో విస్తారమైనదో
సంఖ్యాకాండము 13 : 19 (TEV)
వారు నివసించు భూమి యెట్టిదో అది మంచిదో చెడ్డదో, వారు నివసించు పట్టణములు ఎట్టివో, వారు గుడారము లలో నివసించుదురో, కోటలలో నివసించుదురో, ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో,
సంఖ్యాకాండము 13 : 20 (TEV)
దానిలో చెట్లు న్నవో లేవో కనిపెట్టవలెను. మరియు మీరు ఆ దేశపు పండ్లలో కొన్ని తీసికొనిరండని చెప్పెను. అది ద్రాక్షల ప్రథమ పక్వకాలము
సంఖ్యాకాండము 13 : 21 (TEV)
కాబట్టి వారు వెళ్లి సీను అరణ్యము మొదలుకొని హమాతుకు పోవు మార్గముగా రెహోబువరకు దేశసంచారముచేసి చూచిరి.
సంఖ్యాకాండము 13 : 22 (TEV)
వారు దక్షిణదిక్కున ప్రయాణముచేసి హెబ్రోనుకు వచ్చిరి. అక్కడ అనాకీయులు అహీమాను షేషయి తల్మయి అను వారుండిరి. ఆ హెబ్రోను ఐగుప్తులోని సోయనుకంటె ఏడేండ్లు ముందుగా కట్టబడెను.
సంఖ్యాకాండము 13 : 23 (TEV)
వారు ఎష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక్క గెలగల ద్రాక్షచెట్టు యొక్క కొమ్మనుకోసి దండెతో ఇద్దరు మోసిరి. మరియు వారు కొన్ని దానిమ్మపండ్లను కొన్ని అంజూ రపు పండ్లను తెచ్చిరి.
సంఖ్యాకాండము 13 : 24 (TEV)
ఇశ్రాయేలీయులు అక్కడకోసిన ద్రాక్ష గెలనుబట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడెను.
సంఖ్యాకాండము 13 : 25 (TEV)
వారు నలుబది దినములు ఆ దేశమును సంచరించి చూచి తిరిగి వచ్చిరి.
సంఖ్యాకాండము 13 : 26 (TEV)
అట్లు వారు వెళ్లి పారాను అరణ్యమందలి కాదేషులోనున్న మోషే అహ రోనులయొద్దకును ఇశ్రాయేలీయుల సర్వసమాజమునొద్ద కును వచ్చి, వారికిని ఆ సర్వ సమాజమునకును సమాచారము తెలియచెప్పి ఆ దేశపు పండ్లను వారికి చూపించిరి.
సంఖ్యాకాండము 13 : 27 (TEV)
వారు అతనికి తెలియపరచినదేమనగానీవు మమ్మును పంపిన దేశమునకు వెళ్లితివిు; అది పాలు తేనెలు ప్రవ హించు దేశమే; దాని పండ్లు ఇవి.
సంఖ్యాకాండము 13 : 28 (TEV)
అయితే ఆ దేశ ములో నివసించు జనులు బలవంతులు; వారి పట్టణములు ప్రాకారముగలవి అవి మిక్కిలి గొప్పవి; మరియు అక్కడ అనాకీయులను చూచితివిు.
సంఖ్యాకాండము 13 : 29 (TEV)
అమాలేకీయులు దక్షిణదేశ ములో నివసించుచున్నారు; హిత్తీయులు యెబూసీయులు అమోరీయులు కొండ దేశములో నివసించుచున్నారు; కనానీయులు సముద్రమునొద్దను యొర్దాను నదీప్రాంత ములలోను నివసించుచున్నారని చెప్పిరి.
సంఖ్యాకాండము 13 : 30 (TEV)
కాలేబు మోషే యెదుట జనులను నిమ్మళ పరచిమనము నిశ్చయముగా వెళ్లుదుము; దాని స్వాధీనపరచుకొందుము; దాని జయించుటకు మన శక్తి చాలుననెను.
సంఖ్యాకాండము 13 : 31 (TEV)
అయితే అతనితో కూడ పోయిన ఆ మనుష్యులుఆ జనులు మనకంటె బల వంతులు; మనము వారి మీదికి పోజాలమనిరి.
సంఖ్యాకాండము 13 : 32 (TEV)
మరియు వారు తాము సంచరించి చూచిన దేశమునుగూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారము చెప్పిమేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము; దానిలో మాకు కనబడిన జనులందరు ఉన్నత దేహులు.
సంఖ్యాకాండము 13 : 33 (TEV)
అక్కడ నెఫీలీయుల సంబంధులైన అనాకు వంశపు నెఫీలీ యులను చూచితివిు; మా దృష్ఠికి మేము మిడతలవలె ఉంటిమి, వారి దృష్ఠికిని అట్లే ఉంటిమనిరి.
❮
❯