సంఖ్యాకాండము 26 : 1 (TEV)
ఆ తెగులు పోయిన తర్వాత యెహోవా మోషే కును యాజకుడగు అహరోను కుమారుడైన ఎలియాజరు కును ఈలాగు సెలవిచ్చెను
సంఖ్యాకాండము 26 : 2 (TEV)
మీరు ఇశ్రాయేలీయుల సర్వసమాజములోను ఇరువది ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగి ఇశ్రాయేలీయులలో సేనగా బయలు వెళ్లువారందరి సంఖ్యను వారి వారి పితరుల కుటుంబములను బట్టి వ్రాయించుడి.
సంఖ్యాకాండము 26 : 3 (TEV)
కాబట్టి యిరువది ఏండ్లు మొదలుకొని పైప్రాయముగల వారిని లెక్కింపుడని యెహోవా మోషేకును ఐగుప్తుదేశమునుండి వచ్చిన ఇశ్రా యేలీయులకును ఆజ్ఞాపించినట్లు మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయులు
సంఖ్యాకాండము 26 : 4 (TEV)
మోయాబు మైదానము లలో యెరికోయొద్దనున్న యొర్దాను దగ్గర నుండగా జన సంఖ్యను చేయుడని వారితో చెప్పిరి.
సంఖ్యాకాండము 26 : 5 (TEV)
ఇశ్రాయేలు తొలిచూలు రూబేను. రూబేను పుత్రులలో హనోకీయులు హనోకు వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 6 (TEV)
పల్లువీయులు పల్లువంశస్థులు; హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు; కర్మీయులు కర్మీ వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 7 (TEV)
వీరు రూబేనీయుల వంశస్థులు, వారిలో లెక్కింపబడినవారు నలుబది మూడువేల ఏడువందల ముప్పదిమంది.
సంఖ్యాకాండము 26 : 8 (TEV)
పల్లు కుమారుడు ఏలీయాబు. ఏలీయాబు కుమారులు నెమూయేలు దాతాను అబీరాము.
సంఖ్యాకాండము 26 : 9 (TEV)
కోరహు తన సమూహములో పేరు పొందినవాడు; అతని సమాజము యెహోవాకు విరోధముగా వాదించినప్పుడు సమాజములో మోషే అహరోనులకు విరోధముగా వాదించిన దాతాను అబీరాములు వీరు.
సంఖ్యాకాండము 26 : 10 (TEV)
ఆ సమూహపువారు మృతిబొంది నప్పుడు అగ్ని రెండువందల ఏబది మందిని భక్షించినందు నను, భూమి తన నోరు తెరచి వారిని కోరహును మింగి వేసినందునను, వారు దృష్టాంతములైరి.
సంఖ్యాకాండము 26 : 11 (TEV)
అయితే కోరహు కుమారులు చావలేదు.
సంఖ్యాకాండము 26 : 12 (TEV)
షిమ్యోను పుత్రుల వంశములలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు; యామీనీ యులు యామీను వంశస్థులు; యాకీనీయులు యాకీను వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 13 (TEV)
జెరహీయులు జెరహు వంశస్థులు; షావూలీ యులు షావూలు వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 14 (TEV)
ఇవి షిమ్యోనీయుల వంశ ములు. వారు ఇరువదిరెండువేల రెండువందల మంది.
సంఖ్యాకాండము 26 : 15 (TEV)
గాదు పుత్రుల వంశములలో సెపోనీయులు సెపోను వంశస్థులు; హగ్గీయులు హగ్గీ వంశస్థులు; షూనీయులు షూనీ వంశస్థులు,
సంఖ్యాకాండము 26 : 16 (TEV)
ఓజనీయులు ఓజని వంశస్థులు; ఏరీ యులు ఏరీ వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 17 (TEV)
ఆరోదీయులు ఆరోదు వంశ స్థులు; అరేలీయులు అరేలీ వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 18 (TEV)
వీరు గాదీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు నలు బది వేల ఐదువందలమంది.
సంఖ్యాకాండము 26 : 19 (TEV)
యూదా కుమారులు ఏరు ఓనాను; ఏరును ఓనానును కనాను దేశములో మృతి బొందిరి.
సంఖ్యాకాండము 26 : 20 (TEV)
యూదావారి వంశములలో షేలాహీయులు షేలా వంశస్థులు; పెరెసీయులు పెరెసు వంశస్థులు జెరహీ యులు జెరహు వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 21 (TEV)
పెరెసీయులలో హెస్రోనీ యులు హెస్రోను వంశస్థులు హామూలీయులు హామూలు వంశస్థులు
సంఖ్యాకాండము 26 : 22 (TEV)
వీరు యూదీయుల వంశస్థులు; వ్రాయ బడినవారి సంఖ్యచొప్పున వీరు డెబ్బదియారువేల ఐదు వందలమంది.
సంఖ్యాకాండము 26 : 23 (TEV)
ఇశ్శాఖారు పుత్రుల వంశస్థులలో తోలా హీయులు తోలావంశస్థులు; పువీ్వయులు పువ్వా వంశ స్థులు; యాషూబీయులు యాషూబు వంశస్థులు; షిమ్రో నీయులు షిమ్రోను వంశస్థులు; వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 24 (TEV)
వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల మూడువందలమంది.
సంఖ్యాకాండము 26 : 25 (TEV)
జెబూలూను పుత్రుల వంశస్థులలో సెరెదీయులు సెరెదు వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 26 (TEV)
ఏలోనీయులు ఏలోను వంశస్థులు; యహలేలీయులు యహలేలు వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 27 (TEV)
వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువదివేల ఐదువందలమంది.
సంఖ్యాకాండము 26 : 28 (TEV)
యోసేపు పుత్రుల వంశస్థులు అతని కుమారులు మనష్షే ఎఫ్రాయిము.
సంఖ్యాకాండము 26 : 29 (TEV)
మనష్షే కుమారులలో మాకీరీయులు మాకీరు వంశస్థులు; మాకీరు గిలాదును కనెను; గిలాదీయులు గిలాదు వంశస్థులు; వీరు గిలాదుపుత్రులు.
సంఖ్యాకాండము 26 : 30 (TEV)
ఈజరీయులు ఈజరు వంశస్థులు; హెలకీయులు హెలకు వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 31 (TEV)
అశ్రీయేలీ యులు అశ్రీయేలు వంశస్థులు; షెకెమీయులు షెకెము వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 32 (TEV)
షెమీదాయీయులు షెమీదా వంశస్థులు; హెపెరీయులు హెపెరు వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 33 (TEV)
హెపెరు కుమా రుడైన సెలోపెహాదుకు కుమార్తెలేగాని కుమారులు పుట్టలేదు. సెలోపెహాదు కుమార్తెల పేరులు మహలా నోయా హొగ్లా మిల్కా తిర్సా.
సంఖ్యాకాండము 26 : 34 (TEV)
వీరు మనష్షీయుల వంశస్థులు; వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ఏబది రెండువేల ఏడు వందలమంది.
సంఖ్యాకాండము 26 : 35 (TEV)
ఎఫ్రాయిము పుత్రుల వంశములు ఇవి; షూతలహీయులు షూతలహు వంశస్థులు; బేకరీయులు బేకరు వంశస్థులు; తహనీయులు తహను వంశస్థులు,
సంఖ్యాకాండము 26 : 36 (TEV)
వీరు షూతలహు కుమారులు; ఏరానీయులు ఏరాను వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 37 (TEV)
వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు ముప్పదిరెండువేల ఐదువందలమంది; వీరు యోసేపుపుత్రుల వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 38 (TEV)
బెన్యామీను పుత్రుల వంశములలో బెలీయులు బెల వంశస్థులు; అష్బేలీయులు అష్బేల వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 39 (TEV)
అహీరామీయులు అహీరాము వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 40 (TEV)
షూపామీయులు షూపాము వంశస్థులు; బెల కుమారులు ఆర్దు నయమాను; ఆర్దీయులు ఆర్దు వంశ స్థులు; నయమానీయులు నయమాను వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 41 (TEV)
వీరు బెన్యామీనీయుల వంశస్థులు; వారిలో వ్రాయబడిన లెక్కచొప్పున నలుబదియయిదువేల ఆరువందల మంది.
సంఖ్యాకాండము 26 : 42 (TEV)
దాను పుత్రుల వంశములలో షూషామీయులు షూషాము వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 43 (TEV)
వీరు తమ వంశములలో దానీయుల వంశ స్థులు. వ్రాయబడినవారి సంఖ్యచొప్పున వీరు అరువది నాలుగువేల నాలుగువందల మంది.
సంఖ్యాకాండము 26 : 44 (TEV)
ఆషేరు పుత్రుల వంశములలో యిమీ్నయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీ యులు ఇష్వీ వంశస్థులు; బెరీయులు బెరీయా వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 45 (TEV)
బెరీయానీయులలో హెబెరీయులు హెబెరు వంశస్థులు; మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 46 (TEV)
ఆషేరు కుమార్తె పేరు శెరహు.
సంఖ్యాకాండము 26 : 47 (TEV)
వ్రాయబడినవారి సంఖ్య చొప్పున వీరు ఆషేరీయుల వంశస్థులు; వీరు ఏబదిమూడువేల నాలుగువందలమంది.
సంఖ్యాకాండము 26 : 48 (TEV)
నఫ్తాలీ పుత్రుల వంశములలో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు; గూనీ యులు గూనీ వంశస్థులు;
సంఖ్యాకాండము 26 : 49 (TEV)
యేసెరీయులు యేసెరు వంశ స్థులు; షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 50 (TEV)
వీరు నఫ్తాలీ యుల వంశస్థులు; వ్రాయబడిన వారి సంఖ్యచొప్పున వీరు నలుబదియయిదువేల నాలుగువందలమంది
సంఖ్యాకాండము 26 : 51 (TEV)
ఇశ్రాయేలీ యులలో లెక్కింపబడిన వీరు ఆరులక్షల వెయ్యిన్ని ఏడు వందల ముప్పదిమంది.
సంఖ్యాకాండము 26 : 52 (TEV)
యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను వీరి పేళ్ల లెక్క చొప్పున ఆ దేశమును వీరికి స్వాస్థ్యముగా పంచిపెట్టవలెను.
సంఖ్యాకాండము 26 : 53 (TEV)
ఎక్కువమందికి ఎక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను;
సంఖ్యాకాండము 26 : 54 (TEV)
తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్య వలెను. దాని దాని జనసంఖ్యనుబట్టి ఆయా గోత్రము లకు స్వాస్థ్యము ఇయ్యవలెను.
సంఖ్యాకాండము 26 : 55 (TEV)
చీట్లువేసి ఆ భూమిని పంచిపెట్టవలెను. వారు తమ తమ పితరుల గోత్రముల జనసంఖ్యచొప్పున స్వాస్థ్యమును పొందవలెను.
సంఖ్యాకాండము 26 : 56 (TEV)
ఎక్కువ మందికేమి తక్కువమందికేమి చీట్లు వేసి యెవరి స్వాస్థ్య మును వారికి పంచిపెట్టవలెను.
సంఖ్యాకాండము 26 : 57 (TEV)
వారివారి వంశములలో లెక్కింపబడిన లేవీయులు వీరు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు; కహాతీయులు కహాతు వంశస్థులు; మెరారీయులు మెరారి వంశస్థులు.
సంఖ్యాకాండము 26 : 58 (TEV)
లేవీయుల వంశములు ఏవనగా, లిబ్నీయుల వంశము హెబ్రోనీయుల వంశము మహలీయుల వంశము మూషీ యుల వంశము కోరహీయుల వంశము.
సంఖ్యాకాండము 26 : 59 (TEV)
కహాతు అమ్రా మును కనెను; అమ్రాము భార్యపేరు యోకెబెదు. ఆమె లేవీ కుమార్తె; ఐగుప్తులో ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రామువలన అహరోనును మోషేను వీరి సహోదరియగు మిర్యామును కనెను.
సంఖ్యాకాండము 26 : 60 (TEV)
అహరోనువలన నాదాబు అబీహు ఎలియాజరు ఈతామారు పుట్టిరి.
సంఖ్యాకాండము 26 : 61 (TEV)
నాదాబు అబీహులు యెహోవా సన్నిధికి అన్యాగ్ని తెచ్చినప్పుడు చనిపోయిరి.
సంఖ్యాకాండము 26 : 62 (TEV)
వారిలో నెల మొదలుకొని పైప్రాయము కలిగి లెక్కింపబడినవారందరు ఇరువదిమూడువేలమంది. వారు ఇశ్రాయేలీయులలో లెక్కింపబడినవారు కారుగనుక ఇశ్రాయేలీయులలో వారికి స్వాస్థ్యమియ్య బడలేదు.
సంఖ్యాకాండము 26 : 63 (TEV)
యెరికో ప్రాంతములయందలి యొర్దానునొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడగు ఎలియాజరును ఇశ్రాయేలీయుల జనసంఖ్య చేసినప్పుడు లెక్కింపబడినవారు వీరు.
సంఖ్యాకాండము 26 : 64 (TEV)
మోషే అహరోనులు సీనాయి అరణ్యములో ఇశ్రాయేలీయుల సంఖ్యను చేసి నప్పుడు లెక్కింపబడినవారిలో ఒక్కడైనను వీరిలో ఉండ లేదు.
సంఖ్యాకాండము 26 : 65 (TEV)
ఏలయనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోవుదురని యెహోవా వారినిగూర్చి సెలవిచ్చెను. యెపున్నె కుమారుడైన కాలేబును నూను కుమారుడైన యెహోషువయు తప్ప వారిలో ఒక్కడైనను మిగిలి యుండలేదు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65

BG:

Opacity:

Color:


Size:


Font: