సంఖ్యాకాండము 28 : 1 (TEV)
యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను
సంఖ్యాకాండము 28 : 2 (TEV)
నీవు ఇశ్రాయేలీయులకు ఈలాగు ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారమును నియామక కాలమున నాయొద్దకు తెచ్చుటకు జాగ్రత్తపడవలెను.
సంఖ్యాకాండము 28 : 3 (TEV)
మరియు నీవు వారికీలాగు ఆజ్ఞాపించుముమీరు యెహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతి దినము నిర్దోష మైన యేడాదివగు రెండు మగ గొఱ్ఱ పిల్లలను అర్పింప వలెను.
సంఖ్యాకాండము 28 : 4 (TEV)
వాటిలో ఒక గొఱ్ఱపిల్లను ఉదయమందు అర్పించి సాయంకాలమందు రెండవదానిని అర్పింపవలెను.
సంఖ్యాకాండము 28 : 5 (TEV)
దంచితీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలుప బడిన తూమెడు పిండిలో పదియవవంతు నైవేద్యము చేయవలెను.
సంఖ్యాకాండము 28 : 6 (TEV)
అది యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా సీనాయికొండమీద నియమింపబడిన నిత్య మైన దహనబలి.
సంఖ్యాకాండము 28 : 7 (TEV)
ఆ మొదటి గొఱ్ఱపిల్లతో అర్పింపవల సిన పానార్పణము ముప్పావు; పరిశుద్ధస్థలములో మద్య మును యెహోవాకు పానార్పణముగా పోయింపవలెను.
సంఖ్యాకాండము 28 : 8 (TEV)
ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించి నట్లు యెహోవాకు ఇంపైన సువాసనగల హోమముగా ఆ రెండవ గొఱ్ఱపిల్లను సాయంకాలమందు అర్పింపవలెను.
సంఖ్యాకాండము 28 : 9 (TEV)
విశ్రాంతిదినమున నిర్దోషమైన యేడాదివగు రెండు గొఱ్ఱపిల్లలను నైవేద్యరూపముగాను, దాని పానార్పణము గాను నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు పదియవవంతులను అర్పింవవలెను.
సంఖ్యాకాండము 28 : 10 (TEV)
నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును గాక యిది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహనబలి.
సంఖ్యాకాండము 28 : 11 (TEV)
నెలనెలకు మొదటిదినమున యెహోవాకు దహన బలి అర్పించవలెను. రెండు కోడెదూడలను ఒక పొట్టేలును నిర్దోషమైన యేడాదివగు ఏడు గొఱ్ఱపిల్లలను వాటిలో ప్రతి కోడెదూడతోను,
సంఖ్యాకాండము 28 : 12 (TEV)
నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవవంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోను, నూనెతో కలపబడి తూమెడు పిండిలో రెండు పదియవ వంతులను నైవేద్యముగాను, ఒక్కొక్క గొఱ్ఱపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో నొక పదియవవంతును నైవేద్యముగాను చేయ వలెను.
సంఖ్యాకాండము 28 : 13 (TEV)
అది యెహోవాకు ఇంపైన సువాసనగల దహన బలి.
సంఖ్యాకాండము 28 : 14 (TEV)
వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసమును పొట్టేలుతో పడియు గొఱ్ఱ పిల్లతో ముప్పావును ఉండవలెను. ఇది సంవత్సరములో మాస మాసమునకు జరుగవలసిన దహనబలి.
సంఖ్యాకాండము 28 : 15 (TEV)
నిత్యమైన దహనబలియు దాని పానార్పణమును గాక యొక మేక పిల్లను పాపపరిహారార్థబలిగా యెహోవాకు అర్పింప వలెను.
సంఖ్యాకాండము 28 : 16 (TEV)
మొదటి నెల పదునాలుగవ దినము యెహోవాకు పస్కాపండుగ.
సంఖ్యాకాండము 28 : 17 (TEV)
ఆ నెల పదునయిదవ దినము పండుగ జరుగును. ఏడు దినములు పొంగని భక్ష్యములనే తిన వలెను.
సంఖ్యాకాండము 28 : 18 (TEV)
మొదటి దినమున పరిశుద్ధ సంఘము కూడవలెను. అందులో మీరు జీవనోపాధియైన పనులేమియు చేయ కూడదు
సంఖ్యాకాండము 28 : 19 (TEV)
అయితే యెహోవాకు దహనబలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివగు ఏడు మగ గొఱ్ఱపిల్లలను అర్పింపవలెను. అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై యుండవలెను
సంఖ్యాకాండము 28 : 20 (TEV)
వాటి నైవే ద్యము నూనెతో కలపబడిన గోధుమల పిండి.
సంఖ్యాకాండము 28 : 21 (TEV)
ఒక్కొక్క కోడెతో తూములో మూడు పదియవవంతులను, పొట్టే లుతో రెండు పదియవ వంతులను ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క గొఱ్ఱ పిల్లతో ఒక్కొక్క పదియవవంతును
సంఖ్యాకాండము 28 : 22 (TEV)
మీకు ప్రాయశ్చిత్తము కలుగుటకై పాపపరిహారార్థబలిగా ఒక మేకను అర్పింపవలెను.
సంఖ్యాకాండము 28 : 23 (TEV)
ఉదయమున మీరు అర్పించు నిత్య మైన దహనబలి గాక వీటిని మీరు అర్పింపవలెను.
సంఖ్యాకాండము 28 : 24 (TEV)
అట్లే ఆ యేడు దినములలో ప్రతిదినము యెహోవాకు ఇంపైన సువాసనగల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను. నిత్యమైన దహనబలియు దాని పానార్ప ణమును గాక దానిని అర్పించవలెను.
సంఖ్యాకాండము 28 : 25 (TEV)
ఏడవ దినమున పరిశుద్ధసంఘము కూడవలెను. ఆ దినమున మీరు జీవనో పాధియైన పనులేమియు చేయకూడదు.
సంఖ్యాకాండము 28 : 26 (TEV)
మరియు ప్రథమ ఫలములను అర్పించుదినమున, అనగా వారముల పండుగదినమున మీరు యెహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడవలెను. నాడు మీరు జీవనోపాధియైన పనులేమియు చేయకూడదు.
సంఖ్యాకాండము 28 : 27 (TEV)
యెహోవాకు ఇంపైన సువాసనగల దహనబలిగా మీరు రెండు కోడె దూడలను ఒక పొట్టేలును ఏడాదివైన యేడు మగ గొఱ్ఱ పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదూడతోను
సంఖ్యాకాండము 28 : 28 (TEV)
నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవ వంతులను, ప్రతి పొట్టేలుతో రెండు పదియవవంతులను
సంఖ్యాకాండము 28 : 29 (TEV)
ఆ యేడు గొఱ్ఱపిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క పదియవవంతును
సంఖ్యాకాండము 28 : 30 (TEV)
మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయ బడుటకై యొక మేకపిల్లను అర్పింపవలెను.
సంఖ్యాకాండము 28 : 31 (TEV)
నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును గాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను. అవి నిర్దోషములుగా నుండవలెను.
❮
❯