సంఖ్యాకాండము 33 : 1 (TEV)
మోషే అహరోనులవలన తమ తమ సేనలచొప్పున ఐగుప్తుదేశములోనుండి బయలుదేరివచ్చిన ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణములు ఇవి.
సంఖ్యాకాండము 33 : 2 (TEV)
మోషే యెహోవా సెలవిచ్చిన ప్రకారము, వారి ప్రయాణములనుబట్టి వారి సంచారక్రమములను వ్రాసెను. వారి సంచారక్రమ ముల ప్రకారము వారి ప్రయాణములు ఇవి.
సంఖ్యాకాండము 33 : 3 (TEV)
మొదటి నెల పదునయిదవ దినమున వారు రామెసేసులో నుండి ప్రయాణమై పస్కాపండుగకు మరునాడు వారి మధ్యను యెహోవా హతము చేసిన తొలిచూలుల నందరిని ఐగుప్తీయులు పాతిపెట్టుచుండగా ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులందరి కన్నులయెదుట జయోత్సాహముతో బయలుదేరి వచ్చిరి.
సంఖ్యాకాండము 33 : 4 (TEV)
అప్పుడు ఐగుప్తీయుల దేవతలకు యెహోవా తీర్పు తీర్చెను.
సంఖ్యాకాండము 33 : 5 (TEV)
ఇశ్రాయేలీయులు రామె సేసులోనుండి బయలుదేరి సుక్కోతులో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 6 (TEV)
సుక్కో తులోనుండి వారు బయలుదేరి అరణ్యపు కడనున్న ఏతా ములోదిగిరి.
సంఖ్యాకాండము 33 : 7 (TEV)
ఏతాములోనుండి బయలుదేరి బయల్సెఫోను ఎదుటనున్న పీహహీరోతుతట్టు తిరిగి మిగ్దోలు ఎదుట దిగిరి.
సంఖ్యాకాండము 33 : 8 (TEV)
పీహహీరోతులోనుండి బయలుదేరి సముద్రము మధ్యనుండి అరణ్యములోనికి చేరి ఏతాము అరణ్యమందు మూడుదినముల ప్రయాణము చేసి మారాలో దిగిరి. మారాలోనుండి బయలుదేరి ఏలీముకు వచ్చిరి.
సంఖ్యాకాండము 33 : 9 (TEV)
ఏలీములో పండ్రెండు నీటిబుగ్గ లును డెబ్బది యీతచెట్లును ఉండెను; అక్కడ దిగిరి.
సంఖ్యాకాండము 33 : 10 (TEV)
ఏలీములోనుండి వారు బయలుదేరి ఎఱ్ఱ సముద్రము నొద్ద దిగిరి.
సంఖ్యాకాండము 33 : 11 (TEV)
ఎఱ్ఱసముద్రము నొద్దనుండి బయలుదేరి సీను అరణ్యమందు దిగిరి.
సంఖ్యాకాండము 33 : 12 (TEV)
సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి
సంఖ్యాకాండము 33 : 13 (TEV)
దోపకాలోనుండి బయలుదేరి ఆలూషులో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 14 (TEV)
ఆలూషులోనుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి. అక్కడ జనులు త్రాగుటకై నీళ్లు లేకపోయెను.
సంఖ్యాకాండము 33 : 15 (TEV)
రెఫీదీములోనుండి బయలుదేరి సీనాయి అరణ్యమందు దిగిరి.
సంఖ్యాకాండము 33 : 16 (TEV)
సీనాయి అరణ్యమునుండి బయలుదేరి కిబ్రోతుహత్తావాలో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 17 (TEV)
కిబ్రోతుహతా వాలోనుండి బయలుదేరి హజేరోతులో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 18 (TEV)
హజే రోతులోనుండి బయలుదేరి రిత్మాలో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 19 (TEV)
రిత్మాలోనుండి బయలుదేరి రిమ్మోను పారెసులో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 20 (TEV)
రిమ్మోను పారె సులోనుండి బయలు దేరి లిబ్నాలో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 21 (TEV)
లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 22 (TEV)
రీసాలోనుండి బయలు దేరి కెహేలా తాలో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 23 (TEV)
కెహేలాతాలోనుండి బయలుదేరి షాపెరు కొండనొద్ద దిగిరి.
సంఖ్యాకాండము 33 : 24 (TEV)
షాపెరు కొండ నొద్దనుండి బయలుదేరి హరాదాలో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 25 (TEV)
హరాదాలో నుండి బయలుదేరి మకెలోతులో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 26 (TEV)
మకెలోతులో నుండి బయలుదేరి తాహతులో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 27 (TEV)
తాహతులోనుండి బయలుదేరి తారహులో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 28 (TEV)
తారహులోనుండి బయలుదేరి మిత్కాలో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 29 (TEV)
మిత్కాలోనుండి బయలు దేరి హష్మోనాలో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 30 (TEV)
హష్మోనాలోనుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 31 (TEV)
మొసేరోతులో నుండి బయలుదేరి బెనేయాకానులో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 32 (TEV)
బెనేయాకానులోనుండి బయలుదేరి హోర్‌హగ్గిద్గాదులో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 33 (TEV)
హోర్‌హగ్గిద్గా దులోనుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 34 (TEV)
యొత్బా తాలోనుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 35 (TEV)
ఎబ్రో నాలోనుండి బయలుదేరి ఎసోన్గెబెరులో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 36 (TEV)
ఎసోన్గె బెరులోనుండి బయలుదేరి కాదేషు అనబడిన సీను అరణ్య ములో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 37 (TEV)
కాదేషులోనుండి బయలుదేరి ఎదోము దేశముకడనున్న హోరుకొండ దగ్గర దిగిరి.
సంఖ్యాకాండము 33 : 38 (TEV)
యెహోవా సెలవిచ్చిన ప్రకారము యాజకుడైన అహరోను హోరు కొండనెక్కి, ఇశ్రాయేలీయులు ఐగుప్తుదేశములోనుండి బయలుదేరి వచ్చిన నలువదియవ సంవత్సరమున అయిదవ నెల మొదటి దినమున అక్కడ మృతినొందెను.
సంఖ్యాకాండము 33 : 39 (TEV)
అహ రోను నూట ఇరువది మూడేండ్ల యీడుగలవాడై హోరు కొండమీద మృతినొందెను.
సంఖ్యాకాండము 33 : 40 (TEV)
అప్పుడు దక్షిణదిక్కున కనాను దేశమందు నివసించిన అరాదురాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి వినెను.
సంఖ్యాకాండము 33 : 41 (TEV)
వారు హోరు కొండనుండి బయలుదేరి సల్మానాలో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 42 (TEV)
సల్మానాలో నుండి బయలుదేరి పూనొనులో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 43 (TEV)
పూనొనులో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 44 (TEV)
ఓబోతులోనుండి బయలుదేరి మోయాబు పొలిమేర యొద్దనున్న ఈయ్యె అబారీములో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 45 (TEV)
ఈయ్యె అబారీములోనుండి బయలు దేరి దీబోనుగాదులో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 46 (TEV)
దీబోనుగాదులోనుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయిములో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 47 (TEV)
అల్మోను దిబ్లా తాయిములోనుండి బయలుదేరి నెబోయెదుటి అబా రీము కొండలలో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 48 (TEV)
అబారీము కొండలలోనుండి బయలుదేరి యెరికో దగ్గర యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో దిగిరి.
సంఖ్యాకాండము 33 : 49 (TEV)
వారు మోయాబు మైదానములలో బెత్యేషిమోతు మొదలుకొని ఆబేలు షిత్తీమువరకు యొర్దానుదగ్గర దిగిరి.
సంఖ్యాకాండము 33 : 50 (TEV)
యెరికోయొద్ద, అనగా యొర్దానుకు సమీపమైన మోయాబు మైదానములలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను.
సంఖ్యాకాండము 33 : 51 (TEV)
నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుముమీరు యొర్దానును దాటి కనానుదేశమును చేరిన తరువాత
సంఖ్యాకాండము 33 : 52 (TEV)
ఆ దేశనివాసులందరిని మీ యెదుట నుండి వెళ్లగొట్టి, వారి సమస్త ప్రతిమలను నాశనముచేసి వారి పోతవిగ్రహములనన్నిటిని నశింపచేసి వారి ఉన్నత స్థలములనన్నిటిని పాడుచేసి
సంఖ్యాకాండము 33 : 53 (TEV)
ఆ దేశమును స్వాధీనపరచుకొని దానిలో నివసింపవలెను; ఏలయనగా దాని స్వాధీనపరచుకొనునట్లు ఆ దేశమును మీకిచ్చితిని.
సంఖ్యాకాండము 33 : 54 (TEV)
మీరు మీ వంశములచొప్పున చీట్లువేసి ఆ దేశమును స్వాస్థ్యములుగా పంచుకొనవలెను. ఎక్కువ మందికి ఎక్కువ స్వాస్థ్యమును తక్కువమందికి తక్కువ స్వాస్థ్యము ఇయ్యవలెను. ఎవని చీటి యే స్థలమున పడునో వానికి ఆ స్థలమే కలుగును. మీ తండ్రుల గోత్రముల చొప్పున మీరు స్వాస్థ్యములు పొందవలెను.
సంఖ్యాకాండము 33 : 55 (TEV)
అయితే మీరు మీ యెదుటనుండి ఆ దేశనివాసులను వెళ్లగొట్టనియెడల, మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరో వారు మీ కన్నులలో ముండ్లు గాను మీ ప్రక్కలలో శూలములుగాను ఉండి, మీరు నివసించు ఆ దేశములో మిమ్మును బాధపెట్టెదరు.
సంఖ్యాకాండము 33 : 56 (TEV)
మరియు నేను వారికి చేయ తలంచినట్లు మీకు చేసెదనని వారితో చెప్పుము.
❮
❯