సంఖ్యాకాండము 9 : 1 (TEV)
ఐగుప్తుదేశములోనుండి వారు వచ్చిన తరువాత రెండవ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకు ఈలాగు సెలవిచ్చెను
సంఖ్యాకాండము 9 : 2 (TEV)
ఇశ్రా యేలీయులు పస్కాపండుగను దాని నియామకకాలమందు ఆచరింపవలెను.
సంఖ్యాకాండము 9 : 3 (TEV)
దాని నియామక కాలమున, అనగా ఈ నెల పదునాలుగవ దినమున సాయంకాలమందు దానిని ఆచరింపవలెను; దాని కట్టడలన్నిటినిబట్టి దాని విధులన్నిటినిబట్టి మీరు దానిని ఆచరింపవలెను.
సంఖ్యాకాండము 9 : 4 (TEV)
కాబట్టి మోషే పస్కాపండుగను ఆచరింపవలెనని ఇశ్రాయేలీయులతో చెప్పగా వారు సీనాయి అరణ్యమందు మొదటి నెల పదు నాలుగవ దినమున సాయంకాలమందు పస్కాపండుగ సామగ్రిని సిద్ధపరచుకొనిరి.
సంఖ్యాకాండము 9 : 5 (TEV)
యెహోవా మోషేకు ఆజ్ఞా పించిన సమస్తమును ఇశ్రాయేలీయులు అతడు చెప్పినట్లే చేసిరి.
సంఖ్యాకాండము 9 : 6 (TEV)
కొందరు నరశవమును ముట్టుటవలన అపవిత్రులై ఆ దినమున పస్కాపండుగను ఆచరింప లేకపోయిరి.
సంఖ్యాకాండము 9 : 7 (TEV)
వారు ఆ దినమున మోషే అహరోనుల ఎదుటికి వచ్చి మోషేతో నరశవమును ముట్టుటవలన అపవిత్రులమై తివిు; యెహోవా అర్పణమును దాని నియామక కాలమున ఇశ్రాయేలీయుల మధ్యను అర్పింపకుండునట్లు ఏల అడ్డ గింపబడితిమని అడుగగా
సంఖ్యాకాండము 9 : 8 (TEV)
మోషేనిలువుడి; మీ విషయ ములో యెహోవా యేమిసెలవిచ్చునో నేను తెలిసి కొందునని వారితో అనెను.
సంఖ్యాకాండము 9 : 9 (TEV)
అప్పుడు యెహోవా మోషేకు ఈలాగు సెలవి చ్చెను నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము
సంఖ్యాకాండము 9 : 10 (TEV)
మీలోగాని మీ వంశములలోగాని ఒకడు శవమును ముట్టుటవలన అప విత్రుడైనను, దూరప్రయాణము చేయు చుండినను, అతడు యెహోవా పస్కాపండుగను ఆచరింపవలెను.
సంఖ్యాకాండము 9 : 11 (TEV)
వారు రెండవనెల పదునాలుగవ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగనివాటితోను చేదు ఆకుకూరలతోను దానిని తినవలెను.
సంఖ్యాకాండము 9 : 12 (TEV)
వారు మరునాటివరకు దానిలో కొంచె మైనను మిగలనీయవలదు; దానిలోనిది ఒక్క యెముక నైనను విరువవలదు; పస్కాపండుగ విషయమైన కట్టడ లన్నిటినిబట్టి వారు దానిని ఆచరింపవలెను.
సంఖ్యాకాండము 9 : 13 (TEV)
ప్రయాణ ములో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిన యెడల ఆ మనుష్యుడు తన జనులలోనుండి కొట్టివేయ బడును. అతడు యెహోవా అర్పణమును దాని నియామక కాలమున అర్పింపలేదు గనుక ఆ మనుష్యుడు తన పాప మును తానే భరింపవలెను.
సంఖ్యాకాండము 9 : 14 (TEV)
మీలో నివసించు పరదేశి యెహోవా పస్కాను ఆచరింప గోరునప్పుడు అతడు పస్కా కట్టడచొప్పున దాని విధినిబట్టియే దానిని చేయ వలెను. పరదేశికిని మీ దేశములో పుట్టినవానికిని మీకును ఒకటే కట్టడ ఉండవలెను.
సంఖ్యాకాండము 9 : 15 (TEV)
వారు మందిరమును నిలువబెట్టిన దినమున మేఘము సాక్ష్యపు గుడారములోని మందిరమును కమ్మెను; సాయం కాలము మొదలుకొని ఉదయమువరకు అగ్నివంటి ఆకా రము మందిరముమీద నుండెను.
సంఖ్యాకాండము 9 : 16 (TEV)
నిత్యమును ఆలాగే జరిగెను. మేఘము మందిరమును కమ్మెను; రాత్రియందు అగ్నివంటి ఆకారము కనబడెను.
సంఖ్యాకాండము 9 : 17 (TEV)
ఆ మేఘము గుడారము మీదనుండి పైకెత్తబడునప్పుడు ఇశ్రాయేలీయులు ప్రయా ణమైసాగిరి; ఆ మేఘము ఎక్కడ నిలిచెనో అక్కడనే ఇశ్రాయేలీయులు తమ గుడారములను వేసికొనిరి.
సంఖ్యాకాండము 9 : 18 (TEV)
యెహోవానోటిమాటచొప్పున ఇశ్రాయేలీయులు ప్రయా ణమైసాగిరి. యెహోవా నోటిమాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి. ఆ మేఘము మందిరముమీద నిలిచియుండిన దినములన్నియు వారు నిలిచిరి.
సంఖ్యాకాండము 9 : 19 (TEV)
ఆ మేఘము బహుదినములు మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు యెహోవా విధిననుసరించి ప్రయా ణము చేయకుండిరి.
సంఖ్యాకాండము 9 : 20 (TEV)
మేఘము కొన్ని దినములు మంది రము మీద నిలిచినయెడల వారును నిలిచిరి; యెహోవా నోటిమాట చొప్పుననే నిలిచిరి, యెహోవా నోటిమాట చొప్పుననే ప్రయాణము చేసిరి.
సంఖ్యాకాండము 9 : 21 (TEV)
ఆలాగే మేఘము సాయంకాలము మొదలుకొని ఉదయమువరకు నిలిచిన యెడల ఉదయమందు ఆ మేఘము పైకెత్తబడ గానే వారు ప్రయాణము చేసిరి. పగలేమి రాత్రియేమి ఆ మేఘము పైకెత్తబడినప్పుడే వారు ప్రయాణము చేసిరి.
సంఖ్యాకాండము 9 : 22 (TEV)
ఆ మేఘము రెండుదినములుగాని, ఒక నెలగాని, యేడాదిగాని తడవు చేసి మందిరముమీద నిలిచినయెడల ఇశ్రాయేలీయులు ప్రయాణము చేయక తమ గుడారములలో నిలిచిరి. అది ఎత్తబడినప్పుడు వారు ప్రయాణము చేసిరి.
సంఖ్యాకాండము 9 : 23 (TEV)
యెహోవా మాటచొప్పున వారు తమ గుడారములను వేసికొనిరి; యెహోవా మాటచొప్పున వారు ప్రయాణముచేసిరి; మోషేద్వారా యెహోవా చెప్పిన మాటనుబట్టి యెహోవా ఆజ్ఞ ననుసరించి నడిచిరి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23

BG:

Opacity:

Color:


Size:


Font: