సామెతలు 12 : 1 (TEV)
శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించు వాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు
సామెతలు 12 : 2 (TEV)
సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును దురాలోచనలుగలవాడు నేరస్థుడని ఆయన తీర్పు తీర్చును.
సామెతలు 12 : 3 (TEV)
భక్తిహీనతవలన ఎవరును స్థిరపరచబడరు నీతిమంతుల వేరు కదలదు
సామెతలు 12 : 4 (TEV)
యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.
సామెతలు 12 : 5 (TEV)
నీతిమంతుల తలంపులు న్యాయయుక్తములు భక్తిహీనులు చెప్పు ఆలోచనలు మోసకరములు.
సామెతలు 12 : 6 (TEV)
భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి యథార్థవంతుల నోరు వారిని విడిపించును.
సామెతలు 12 : 7 (TEV)
భక్తిహీనులు పాడై లేకపోవుదురు నీతిమంతుల యిల్లు నిలుచును.
సామెతలు 12 : 8 (TEV)
ఒక్కొక్క మనుష్యుడు తన వివేకముకొలది పొగడ బడును కుటిలచిత్తుడు తృణీకరింపబడును.
సామెతలు 12 : 9 (TEV)
ఆహారము లేకయున్నను తనను తాను పొగడుకొను వానికంటె దాసుడుగల అల్పుడు గొప్పవాడు.
సామెతలు 12 : 10 (TEV)
నీతిమంతుడు తన పశువుల ప్రాణమును దయతో చూచును భక్తిహీనుల వాత్సల్యము క్రూరత్వమే.
సామెతలు 12 : 11 (TEV)
తన భూమిని సేద్యపరచుకొనువానికి ఆహారము సమృ ద్ధిగా కలుగును వ్యర్థమైనవాటిని అనుసరించువాడు బుద్ధిలేనివాడు.
సామెతలు 12 : 12 (TEV)
భక్తిహీనులు చెడ్డవారికి దొరుకు దోపుడుసొమ్మును అపే క్షించుదురు నీతిమంతుల వేరు చిగుర్చును.
సామెతలు 12 : 13 (TEV)
పెదవులవలని దోషము అపాయకరమైన ఉరి నీతిమంతుడు ఆపదను తప్పించుకొనును.
సామెతలు 12 : 14 (TEV)
ఒకడు తన నోటి ఫలము చేత తృప్తిగా మేలుపొందును ఎవని క్రియల ఫలము వానికి వచ్చును.
సామెతలు 12 : 15 (TEV)
మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును.
సామెతలు 12 : 16 (TEV)
మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.
సామెతలు 12 : 17 (TEV)
సత్యవాద ప్రియుడు నీతిగల మాటలు పలుకును కూటసాక్షి మోసపు మాటలు చెప్పును.
సామెతలు 12 : 18 (TEV)
కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.
సామెతలు 12 : 19 (TEV)
నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.
సామెతలు 12 : 20 (TEV)
కీడు కల్పించువారి హృదయములో మోసముకలదు సమాధానపరచుటకై ఆలోచన చెప్పువారు సంతోష భరితులగుదురు.
సామెతలు 12 : 21 (TEV)
నీతిమంతునికి ఏ ఆపదయు సంభవింపదు. భక్తిహీనులు కీడుతో నిండియుందురు.
సామెతలు 12 : 22 (TEV)
అబద్దమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.
సామెతలు 12 : 23 (TEV)
వివేకియైనవాడు తన విద్యను దాచి పెట్టును అవివేక హృదయులు తమ మూఢత్వము వెల్లడి చేయుదురు.
సామెతలు 12 : 24 (TEV)
శ్రద్ధగా పని చేయువారు ఏలుబడి చేయుదురు సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును.
సామెతలు 12 : 25 (TEV)
ఒకని హృదయములోని విచారము దాని క్రుంగ జేయును దయగల మాట దాని సంతోషపెట్టును.
సామెతలు 12 : 26 (TEV)
నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును.
సామెతలు 12 : 27 (TEV)
సోమరి వేటాడినను పట్టుకొనడు చురుకుగా నుండుట గొప్ప భాగ్యము.
సామెతలు 12 : 28 (TEV)
నీతిమార్గమునందు జీవము కలదు దాని త్రోవలో మరణమే లేదు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28

BG:

Opacity:

Color:


Size:


Font: