సామెతలు 15 : 1 (TEV)
మృదువైన మాట క్రోధమును చల్లార్చును. నొప్పించు మాట కోపమును రేపును.
సామెతలు 15 : 2 (TEV)
జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలు కును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.
సామెతలు 15 : 3 (TEV)
యెహోవా కన్నులు ప్రతి స్థలముమీద నుండును చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును.
సామెతలు 15 : 4 (TEV)
సాత్వికమైన నాలుక జీవవృక్షము దానిలో కుటిలత యుండినయెడల ఆత్మకు భంగము కలుగును.
సామెతలు 15 : 5 (TEV)
మూఢుడు తన తండ్రిచేయు శిక్షను తిరస్కరించును గద్దింపునకు లోబడువాడు బుద్ధిమంతుడగును.
సామెతలు 15 : 6 (TEV)
నీతిమంతుని యిల్లు గొప్ప ధననిధి భక్తిహీనునికి కలుగు వచ్చుబడి శ్రమకు కారణము.
సామెతలు 15 : 7 (TEV)
జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు
సామెతలు 15 : 8 (TEV)
భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయ ములు యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము.
సామెతలు 15 : 9 (TEV)
భక్తిహీనుల మార్గము యెహోవాకు హేయము నీతి ననుసరించువానిని ఆయన ప్రేమించును.
సామెతలు 15 : 10 (TEV)
మార్గము విడిచినవానికి కఠినశిక్ష కలుగును గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు.
సామెతలు 15 : 11 (TEV)
పాతాళమును అగాధకూపమును యెహోవాకు కన బడుచున్నవి నరుల హృదయములు మరి తేటగా ఆయనకు కన బడును గదా?
సామెతలు 15 : 12 (TEV)
అపహాసకుడు తన్ను గద్దించువారిని ప్రేమించడు వాడు జ్ఞానులయొద్దకు వెళ్లడు.
సామెతలు 15 : 13 (TEV)
సంతోషహృదయము ముఖమునకు తేటనిచ్చును. మనోదుఃఖమువలన ఆత్మ నలిగిపోవును.
సామెతలు 15 : 14 (TEV)
బుద్ధిమంతుని మనస్సు జ్ఞానము వెదకును బుద్ధిహీనులు మూఢత్వము భుజించెదరు.
సామెతలు 15 : 15 (TEV)
బాధపడువాని దినములన్నియు శ్రమకరములు సంతోషహృదయునికి నిత్యము విందు కలుగును.
సామెతలు 15 : 16 (TEV)
నెమ్మదిలేకుండ విస్తారమైన ధనముండుటకంటె యెహోవాయందలి భయభక్తులతో కూడ కొంచెము కలిగియుండుట మేలు.
సామెతలు 15 : 17 (TEV)
పగవాని యింట క్రొవ్వినయెద్దు మాంసము తినుట కంటె ప్రేమగలచోట ఆకుకూరల భోజనము తినుట మేలు.
సామెతలు 15 : 18 (TEV)
కోపోద్రేకియగువాడు కలహము రేపును దీర్ఘశాంతుడు వివాదము నణచివేయును.
సామెతలు 15 : 19 (TEV)
సోమరి మార్గము ముళ్లకంచె యథార్థవంతుల త్రోవ రాజమార్గము.
సామెతలు 15 : 20 (TEV)
జ్ఞానముగల కుమారుడు తండ్రిని సంతోషపెట్టును బుద్ధిహీనుడు తన తల్లిని తిరస్కరించును.
సామెతలు 15 : 21 (TEV)
బుద్ధిలేనివానికి మూఢత సంతోషకరము వివేకముగలవాడు చక్కగా ప్రవర్తించును.
సామెతలు 15 : 22 (TEV)
ఆలోచన చెప్పువారు లేని చోట ఉద్దేశములు వ్యర్థ మగును ఆలోచన చెప్పువారు బహుమంది యున్నయెడల ఉద్దేశములు దృఢపడును.
సామెతలు 15 : 23 (TEV)
సరిగా ప్రత్యుత్తరమిచ్చినవానికి దానివలన సంతో షము పుట్టును సమయోచితమైన మాట యెంత మనోహరము!
సామెతలు 15 : 24 (TEV)
క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున నడచు కొనును
సామెతలు 15 : 25 (TEV)
గర్విష్ఠుల యిల్లు యెహోవా పెరికివేయును విధవరాలి పొలిమేరను ఆయన స్థాపించును.
సామెతలు 15 : 26 (TEV)
దురాలోచనలు యెహోవాకు హేయములు దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు.
సామెతలు 15 : 27 (TEV)
లోభి తన యింటివారిని బాధపెట్టును లంచము నసహ్యించుకొనువాడు బ్రదుకును.
సామెతలు 15 : 28 (TEV)
నీతిమంతుని మనస్సు యుక్తమైన ప్రత్యుత్తర మిచ్చు టకు ప్రయత్నించును భక్తిహీనుల నోరు చెడ్డమాటలు కుమ్మరించును
సామెతలు 15 : 29 (TEV)
భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును.
సామెతలు 15 : 30 (TEV)
కన్నుల ప్రకాశము చూచుట హృదయమునకు సంతోషకరము మంచి సమాచారము ఎముకలకు పుష్టి ఇచ్చును.
సామెతలు 15 : 31 (TEV)
జీవార్థమైన ఉపదేశమును అంగీకరించువానికి జ్ఞానుల సహవాసము లభించును.
సామెతలు 15 : 32 (TEV)
శిక్షనొంద నొల్లనివాడు తన ప్రాణమును తృణీక రించును గద్దింపును వినువాడు వివేకియగును.
సామెతలు 15 : 33 (TEV)
యెహోవాయందు భయభక్తులు కలిగియుండుట జ్ఞానాభ్యాసమునకు సాధనము ఘనతకు ముందు వినయముండును.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33

BG:

Opacity:

Color:


Size:


Font: