సామెతలు 9 : 1 (TEV)
జ్ఞానము నివాసమును కట్టుకొని దానికి ఏడు స్తంభములు చెక్కు కొనినది
సామెతలు 9 : 2 (TEV)
పశువులను వధించి ద్రాక్షారసమును కలిపియున్నది భోజనపదార్థములను సిద్ధపరచియున్నది
సామెతలు 9 : 3 (TEV)
తన పనికత్తెలచేత జనులను పిలువనంపినది పట్టణమందలి మెట్టలమీద అది నిలిచి
సామెతలు 9 : 4 (TEV)
జ్ఞానము లేనివాడా, ఇక్కడికి రమ్మని ప్రకటించు చున్నది. తెలివిలేనివారితో అది ఇట్లనుచున్నది
సామెతలు 9 : 5 (TEV)
వచ్చి నేను సిద్ధపరచిన ఆహారమును భుజించుడి నేను కలిపిన ద్రాక్షారసమును పానముచేయుడి
సామెతలు 9 : 6 (TEV)
ఇక జ్ఞానము లేనివారై యుండక బ్రదుకుడి తెలివి కలుగజేయు మార్గములో చక్కగా నడువుడి.
సామెతలు 9 : 7 (TEV)
అపహాసకులకు బుద్ధిచెప్పువాడు తనకే నింద తెచ్చు కొనును. భక్తిహీనులను గద్దించువానికి అవమానమే కలుగును.
సామెతలు 9 : 8 (TEV)
అపహాసకుని గద్దింపకుము గద్దించినయెడల వాడు నిన్ను ద్వేషించును. జ్ఞానముగలవానిని గద్దింపగా వాడు నిన్ను ప్రేమిం చును.
సామెతలు 9 : 9 (TEV)
జ్ఞానముగలవానికి ఉపదేశము చేయగా వాడు మరింత జ్ఞానము నొందును నీతిగలవానికి బోధచేయగా వాడు జ్ఞానాభివృద్ధి నొందును.
సామెతలు 9 : 10 (TEV)
యెహోవాయందు భయభక్తులు గలిగి యుండుటయే జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవునిగూర్చిన తెలివియే వివేచనకు ఆధా రము.
సామెతలు 9 : 11 (TEV)
నావలన నీకు దీర్ఘాయువు కలుగును నీవు జీవించు సంవత్సరములు అధికములగును.
సామెతలు 9 : 12 (TEV)
నీవు జ్ఞానివైనయెడల నీ జ్ఞానము నీకే లాభకరమగును నీవు అపహసించినయెడల దానిని నీవే భరింపవలెను.
సామెతలు 9 : 13 (TEV)
బుద్ధిహీనత అనునది బొబ్బలు పెట్టునది అది కాముకురాలు దానికేమియు తెలివిలేదు.
సామెతలు 9 : 14 (TEV)
అది తన ఇంటివాకిట కూర్చుండును ఊరి రాజవీధులలో పీఠము మీద కూర్చుండును.
సామెతలు 9 : 15 (TEV)
ఆ దారిని పోవువారిని చూచి తమ త్రోవను చక్కగా వెళ్లువారిని చూచి
సామెతలు 9 : 16 (TEV)
జ్ఞానములేనివాడా, ఇక్కడికి రమ్మని వారిని పిలు చును.
సామెతలు 9 : 17 (TEV)
అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచిదొంగి లించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును.
సామెతలు 9 : 18 (TEV)
అయితే అచ్చట ప్రేతలున్నారనియు దాని ఇంటికి వెళ్లువారు పాతాళకూపములో ఉన్నా రనియు వారికి ఎంతమాత్రమును తెలియలేదు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: