కీర్తనల గ్రంథము 1 : 1 (TEV)
దుష్టుల ఆలోచనచొప్పున నడువకపాపుల మార్గమున నిలువక అపహాసకులు కూర్చుండు చోటను కూర్చుండక
కీర్తనల గ్రంథము 1 : 2 (TEV)
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచుదివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు.
కీర్తనల గ్రంథము 1 : 3 (TEV)
అతడు నీటికాలువల యోరను నాటబడినదైఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టువలెనుండును అతడు చేయునదంతయు సఫలమగును.
కీర్తనల గ్రంథము 1 : 4 (TEV)
దుష్టులు ఆలాగున నుండకగాలి చెదరగొట్టు పొట్టువలె నుందురు.
కీర్తనల గ్రంథము 1 : 5 (TEV)
కాబట్టి న్యాయవిమర్శలో దుష్టులునునీతిమంతుల సభలో పాపులును నిలువరు.
కీర్తనల గ్రంథము 1 : 6 (TEV)
నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియునుదుష్టుల మార్గము నాశనమునకు నడుపును.

1 2 3 4 5 6

BG:

Opacity:

Color:


Size:


Font: