కీర్తనల గ్రంథము 100 : 1 (TEV)
సమస్త్త దేశములారా, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి.
కీర్తనల గ్రంథము 100 : 2 (TEV)
సంతోషముతో యెహోవాను సేవించుడి ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి.
కీర్తనల గ్రంథము 100 : 3 (TEV)
యెహోవాయే దేవుడని తెలిసికొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొఱ్ఱలము.
కీర్తనల గ్రంథము 100 : 4 (TEV)
కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి కీర్తనలు పాడుచు ఆయన ఆవరణములలో ప్రవేశించుడి ఆయనను స్తుతించుడి ఆయన నామమును ఘనపరచుడి.
కీర్తనల గ్రంథము 100 : 5 (TEV)
యెహోవా దయాళుడు ఆయన కృప నిత్యముండును ఆయన సత్యము తరతరములుండును.

1 2 3 4 5

BG:

Opacity:

Color:


Size:


Font: