కీర్తనల గ్రంథము 102 : 1 (TEV)
యెహోవా, నా ప్రార్థన ఆలకింపుము నా మొఱ్ఱ నీయొద్దకు చేరనిమ్ము.
కీర్తనల గ్రంథము 102 : 2 (TEV)
నా కష్టదినమున నాకు విముఖుడవై యుండకుము నాకు చెవియొగ్గుము నేను మొరలిడునాడు త్వరపడి నాకుత్తర మిమ్ము.
కీర్తనల గ్రంథము 102 : 3 (TEV)
పొగ యెగిరిపోవునట్లుగా నా దినములు తరిగిపోవు చున్నవి పొయిలోనిది కాలిపోయినట్లు నా యెముకలు కాలి పోయి యున్నవి.
కీర్తనల గ్రంథము 102 : 4 (TEV)
ఎండదెబ్బకు వాడిన గడ్డివలె నా హృదయము వాడి పోయి యున్నది భోజనము చేయుటకే నేను మరచిపోవు చున్నాను.
కీర్తనల గ్రంథము 102 : 5 (TEV)
నా మూల్గుల శబ్దమువలన నా యెముకలు నా దేహ మునకు అంటుకొని పోయినవి.
కీర్తనల గ్రంథము 102 : 6 (TEV)
నేను అడవిలోని గూడబాతును పోలియున్నాను పాడైన స్థలములలోని పగిడికంటెవలె నున్నాను.
కీర్తనల గ్రంథము 102 : 7 (TEV)
రాత్రి మెలకువగా నుండి యింటిమీద ఒంటిగా నున్న పిచ్చుకవలె నున్నాను.
కీర్తనల గ్రంథము 102 : 8 (TEV)
దినమెల్ల నా శత్రువులు నన్ను నిందించుచున్నారు నామీద వెఱ్ఱికోపముగలవారు నా పేరు చెప్పి శపిం తురు.
కీర్తనల గ్రంథము 102 : 9 (TEV)
నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను.
కీర్తనల గ్రంథము 102 : 10 (TEV)
నా పానీయముతో కన్నీళ్లు కలుపుకొను చున్నాను. నీవు నన్ను పైకెత్తి పారవేసియున్నావు.
కీర్తనల గ్రంథము 102 : 11 (TEV)
నా దినములు సాగిపోయిన నీడను పోలియున్నవి గడ్డివలె నేను వాడియున్నాను.
కీర్తనల గ్రంథము 102 : 12 (TEV)
యెహోవా, నీవు నిత్యము సింహాసనాసీనుడవు నీ నామస్మరణ తరతరము లుండును.
కీర్తనల గ్రంథము 102 : 13 (TEV)
నీవు లేచి సీయోనును కరుణించెదవు. దానిమీద దయచూపుటకు కాలము వచ్చెను నిర్ణయకాలమే వచ్చెను.
కీర్తనల గ్రంథము 102 : 14 (TEV)
దాని రాళ్లు నీ సేవకులకు ప్రియములు వారు దాని మంటిని కనికరించుదురు
కీర్తనల గ్రంథము 102 : 15 (TEV)
అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరు నీ మహిమకును భయపడెదరు
కీర్తనల గ్రంథము 102 : 16 (TEV)
ఏలయనగా యెహోవా సీయోనును కట్టియున్నాడు ఆయన తన మహిమతో ప్రత్యక్షమాయెను
కీర్తనల గ్రంథము 102 : 17 (TEV)
ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనవైపు తిరిగియున్నాడు.
కీర్తనల గ్రంథము 102 : 18 (TEV)
యెహోవాను సేవించుటకై జనములును రాజ్యములును కూర్చబడునప్పుడు
కీర్తనల గ్రంథము 102 : 19 (TEV)
మనుష్యులు సీయోనులో యెహోవా నామఘనతను యెరూషలేములో ఆయన స్తోత్రమును ప్రకటించు నట్లు
కీర్తనల గ్రంథము 102 : 20 (TEV)
చెరసాలలో ఉన్నవారి మూల్గులను వినుటకును చావునకు విధింపబడినవారిని విడిపించుటకును
కీర్తనల గ్రంథము 102 : 21 (TEV)
ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయమునుండి వంగి చూచెననియు ఆకాశమునుండి భూమిని దృష్టించెననియు
కీర్తనల గ్రంథము 102 : 22 (TEV)
వచ్చుతరము తెలిసికొనునట్లుగా ఇది వ్రాయబడ వలెను సృజింపబడబోవు జనము యెహోవాను స్తుతించును
కీర్తనల గ్రంథము 102 : 23 (TEV)
నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నాబలము క్రుంగజేసెను నా దినములు కొద్దిపరచెను.
కీర్తనల గ్రంథము 102 : 24 (TEV)
నేనీలాగు మనవిచేసితిని నా దేవా, నాదినముల మధ్యను నన్ను కొనిపోకుము నీ సంవత్సరములు తరతరములుండును.
కీర్తనల గ్రంథము 102 : 25 (TEV)
ఆదియందు నీవు భూమికి పునాది వేసితివి ఆకాశములు కూడ నీ చేతిపనులే.
కీర్తనల గ్రంథము 102 : 26 (TEV)
అవి నశించును గాని నీవు నిలచియుందువు అవియన్నియు వస్త్రమువలె పాతగిలును ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేయుదువు అవి మార్చబడును.
కీర్తనల గ్రంథము 102 : 27 (TEV)
నీవు ఏకరీతిగా నుండువాడవు నీ సంవత్సరములకు అంతము లేదు.
కీర్తనల గ్రంథము 102 : 28 (TEV)
నీ సేవకుల కుమారులు నిలిచియుందురు వారి సంతానము నీ సన్నిధిని స్థిరపరచబడును.
❮
❯