కీర్తనల గ్రంథము 105 : 1 (TEV)
యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన నామమును ప్రకటన చేయుడి జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి.
కీర్తనల గ్రంథము 105 : 2 (TEV)
ఆయననుగూర్చి పాడుడి ఆయనను కీర్తించుడి ఆయన ఆశ్చర్య కార్యములన్నిటినిగూర్చి సంభాషణ చేయుడి
కీర్తనల గ్రంథము 105 : 3 (TEV)
ఆయన పరిశుద్ధ నామమునుబట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతో షించుదురుగాక.
కీర్తనల గ్రంథము 105 : 4 (TEV)
యెహోవాను వెదకుడి ఆయన బలమును వెదకుడి ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి
కీర్తనల గ్రంథము 105 : 5 (TEV)
ఆయన దాసుడైన అబ్రాహాము వంశస్థులారా ఆయన యేర్పరచుకొనిన యాకోబు సంతతివారలారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసి కొనుడి
కీర్తనల గ్రంథము 105 : 6 (TEV)
ఆయన చేసిన సూచక క్రియలను ఆయననోటి తీర్పు లను జ్ఞాపకముచేసికొనుడి
కీర్తనల గ్రంథము 105 : 7 (TEV)
ఆయన మన దేవుడైన యెహోవా ఆయన తీర్పులు భూమియందంతట జరుగుచున్నవి.
కీర్తనల గ్రంథము 105 : 8 (TEV)
తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరములవరకు అబ్రాహాముతో తాను చేసిన నింబధనను
కీర్తనల గ్రంథము 105 : 9 (TEV)
ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును.
కీర్తనల గ్రంథము 105 : 10 (TEV)
వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై యుండగను
కీర్తనల గ్రంథము 105 : 11 (TEV)
కొలవబడిన స్వాస్థ్యముగా కనానుదేశమును మీకిచ్చెదనని ఆయన సెలవిచ్చెను
కీర్తనల గ్రంథము 105 : 12 (TEV)
ఆ మాట యాకోబునకు కట్టడగాను ఇశ్రాయేలునకు నిత్య నిబంధనగాను స్థిరపరచి యున్నాడు.
కీర్తనల గ్రంథము 105 : 13 (TEV)
వారు జనమునుండి జనమునకును ఒక రాజ్యమునుండి మరియొక రాజ్యమునకు తిరుగు లాడు చుండగా
కీర్తనల గ్రంథము 105 : 14 (TEV)
నేనభిషేకించినవారిని ముట్టకూడదనియు నా ప్రవక్తలకు కీడుచేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి
కీర్తనల గ్రంథము 105 : 15 (TEV)
ఆయన ఎవరినైనను వారికి హింసచేయనియ్య లేదు ఆయన వారికొరకు రాజులను గద్దించెను.
కీర్తనల గ్రంథము 105 : 16 (TEV)
దేశముమీదికి ఆయన కరవు రప్పించెను జీవనాధారమైన ధాన్యమంతయు కొట్టివేసెను.
కీర్తనల గ్రంథము 105 : 17 (TEV)
వారికంటె ముందుగా ఆయన యొకని పంపెను. యోసేపు దాసుడుగా అమ్మబడెను.
కీర్తనల గ్రంథము 105 : 18 (TEV)
వారు సంకెళ్లచేత అతని కాళ్లు నొప్పించిరి ఇనుము అతని ప్రాణమును బాధించెను.
కీర్తనల గ్రంథము 105 : 19 (TEV)
అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను.
కీర్తనల గ్రంథము 105 : 20 (TEV)
రాజు వర్తమానము పంపి అతని విడిపించెను. ప్రజల నేలినవాడు అతని విడుదలచేసెను.
కీర్తనల గ్రంథము 105 : 21 (TEV)
ఇష్టప్రకారము అతడు తన అధిపతుల నేలుటకును తన పెద్దలకు బుద్ధి చెప్పుటకును
కీర్తనల గ్రంథము 105 : 22 (TEV)
తన యింటికి యజమానునిగాను తన యావదాస్తిమీద అధికారిగాను అతని నియ మించెను.
కీర్తనల గ్రంథము 105 : 23 (TEV)
ఇశ్రాయేలు ఐగుప్తులోనికి వచ్చెను యాకోబు హాముదేశమందు పరదేశిగా నుండెను.
కీర్తనల గ్రంథము 105 : 24 (TEV)
ఆయన తన ప్రజలకు బహు సంతానవృద్ధి కలుగ జేసెను వారి విరోధులకంటె వారికి అధికబలము దయచేసెను.
కీర్తనల గ్రంథము 105 : 25 (TEV)
తన ప్రజలను పగజేయునట్లును తన సేవకులయెడల కుయుక్తిగా నడచునట్లును ఆయన వారి హృదయములను త్రిప్పెను.
కీర్తనల గ్రంథము 105 : 26 (TEV)
ఆయన తన సేవకుడైన మోషేను తాను ఏర్పరచుకొనిన అహరోనును పంపెను.
కీర్తనల గ్రంథము 105 : 27 (TEV)
వారు ఐగుప్తీయుల మధ్యను ఆయన సూచక క్రియలను హాముదేశములో మహత్కార్యములను జరిగించిరి
కీర్తనల గ్రంథము 105 : 28 (TEV)
ఆయన అంధకారము పంపి చీకటి కమ్మజేసెను వారు ఆయన మాటను ఎదిరింపలేదు.
కీర్తనల గ్రంథము 105 : 29 (TEV)
ఆయన వారి జలములను రక్తముగా మార్చెను వారి చేపలను చంపెను.
కీర్తనల గ్రంథము 105 : 30 (TEV)
వారి దేశములో కప్పలు నిండెను అవి వారి రాజుల గదులలోనికి వచ్చెను.
కీర్తనల గ్రంథము 105 : 31 (TEV)
ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టెను వారి ప్రాంతములన్నిటిలోనికి దోమలు వచ్చెను.
కీర్తనల గ్రంథము 105 : 32 (TEV)
ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించెను. వారి దేశములో అగ్నిజ్వాలలు పుట్టించెను.
కీర్తనల గ్రంథము 105 : 33 (TEV)
వారి ద్రాక్షతీగెలను వారి అంజూరపు చెట్లను పడ గొట్టెను వారి ప్రాంతములయందలి వృక్షములను విరుగకొట్టెను.
కీర్తనల గ్రంథము 105 : 34 (TEV)
ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలును లెక్కలేని చీడపురుగులును వచ్చెను,
కీర్తనల గ్రంథము 105 : 35 (TEV)
అవి వారిదేశపు కూరచెట్లన్నిటిని వారి భూమి పంటలను తినివేసెను.
కీర్తనల గ్రంథము 105 : 36 (TEV)
వారి దేశమందలి సమస్త జ్యేష్ఠులను వారి ప్రథమసంతానమును ఆయన హతముచేసెను.
కీర్తనల గ్రంథము 105 : 37 (TEV)
అక్కడనుండి తన జనులను వెండి బంగారములతో ఆయన రప్పించెను వారి గోత్రములలో నిస్సత్తువచేత తొట్రిల్లు వాడొక్క డైనను లేకపోయెను.
కీర్తనల గ్రంథము 105 : 38 (TEV)
వారివలన ఐగుప్తీయులకు భయము పుట్టెను వారు బయలు వెళ్లినప్పుడు ఐగుప్తీయులు సంతోషించిరి
కీర్తనల గ్రంథము 105 : 39 (TEV)
వారికి చాటుగా నుండుటకై ఆయన మేఘమును కల్పించెను రాత్రి వెలుగిచ్చుటకై అగ్నిని కలుగజేసెను.
కీర్తనల గ్రంథము 105 : 40 (TEV)
వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించెను. ఆకాశములోనుండి ఆహారమునిచ్చి వారిని తృప్తి పరచెను.
కీర్తనల గ్రంథము 105 : 41 (TEV)
బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చెను ఎడారులలో అవి యేరులై పారెను.
కీర్తనల గ్రంథము 105 : 42 (TEV)
ఏలయనగా ఆయన తన పరిశుద్ధ వాగ్దానమును తనసేవకుడైన అబ్రాహామును జ్ఞాపకము చేసికొని
కీర్తనల గ్రంథము 105 : 43 (TEV)
ఆయన తన ప్రజలను సంతోషముతోను తాను ఏర్పరచుకొనినవారిని ఉత్సాహధ్వనితోను వెలు పలికి రప్పించెను.
కీర్తనల గ్రంథము 105 : 44 (TEV)
వారు తన కట్టడలను గైకొనునట్లును
కీర్తనల గ్రంథము 105 : 45 (TEV)
తన ధర్మశాస్త్రవిధులను ఆచరించునట్లును అన్యజనుల భూములను ఆయన వారికప్పగించెను జనముల కష్టార్జితమును వారు స్వాధీనపరచుకొనిరి.యెహోవాను స్తుతించుడి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45

BG:

Opacity:

Color:


Size:


Font: