కీర్తనల గ్రంథము 106 : 1 (TEV)
యెహోవాను స్తుతించుడి యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
కీర్తనల గ్రంథము 106 : 2 (TEV)
యెహోవా పరాక్రమకార్యములను ఎవడు వర్ణింప గలడు? ఆయన కీర్తి యంతటిని ఎవడు ప్రకటింపగలడు?
కీర్తనల గ్రంథము 106 : 3 (TEV)
న్యాయము ననుసరించువారు ఎల్లవేళల నీతి ననుసరించి నడుచుకొనువారు ధన్యులు.
కీర్తనల గ్రంథము 106 : 4 (TEV)
యెహోవా, నీవు ఏర్పరచుకొనినవారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమునుబట్టి నేను సంతో షించుచు
కీర్తనల గ్రంథము 106 : 5 (TEV)
నీ స్వాస్థ్యమైనవారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలయందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపక మునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము.
కీర్తనల గ్రంథము 106 : 6 (TEV)
మా పితరులవలెనే మేము పాపము చేసితివిు దోషములు కట్టుకొని భక్తిహీనులమైతివిు
కీర్తనల గ్రంథము 106 : 7 (TEV)
ఐగుప్తులో మా పితరులు నీ అద్భుతములను గ్రహింపక యుండిరి నీ కృపాబాహుళ్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనక యుండిరి సముద్రమునొద్ద ఎఱ్ఱసముద్రమునొద్ద వారు తిరుగు బాటు చేసిరి.
కీర్తనల గ్రంథము 106 : 8 (TEV)
అయినను తన మహా పరాక్రమమును ప్రసిద్ధి చేయు టకై ఆయన తన నామమునుబట్టి వారిని రక్షించెను.
కీర్తనల గ్రంథము 106 : 9 (TEV)
ఆయన ఎఱ్ఱసముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను మైదానముమీద నడుచునట్లు వారిని అగాధజలము లలో నడిపించెను.
కీర్తనల గ్రంథము 106 : 10 (TEV)
వారి పగవారి చేతిలోనుండి వారిని రక్షించెను శత్రువుల చేతిలోనుండి వారిని విమోచించెను.
కీర్తనల గ్రంథము 106 : 11 (TEV)
నీళ్లు వారి శత్రువులను ముంచివేసెను వారిలో ఒక్కడైనను మిగిలియుండలేదు.
కీర్తనల గ్రంథము 106 : 12 (TEV)
అప్పుడు వారు ఆయన మాటలు నమి్మరి ఆయన కీర్తి గానము చేసిరి.
కీర్తనల గ్రంథము 106 : 13 (TEV)
అయినను వారు ఆయన కార్యములను వెంటనే మరచి పోయిరి ఆయన ఆలోచనకొరకు కనిపెట్టుకొనకపోయిరి.
కీర్తనల గ్రంథము 106 : 14 (TEV)
అరణ్యములో వారు బహుగా ఆశించిరి ఎడారిలో దేవుని శోధించిరి
కీర్తనల గ్రంథము 106 : 15 (TEV)
వారు కోరినది ఆయన వారికిచ్చెను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగ జేసెను.
కీర్తనల గ్రంథము 106 : 16 (TEV)
వారు తమ దండు పాళెములో మోషేయందును యెహోవాకు ప్రతిష్ఠితుడైన అహరోనునందును అసూయపడిరి.
కీర్తనల గ్రంథము 106 : 17 (TEV)
భూమి నెరవిడిచి దాతానును మింగెను అది అబీరాము గుంపును కప్పివేసెను.
కీర్తనల గ్రంథము 106 : 18 (TEV)
వారి సంఘములో అగ్ని రగిలెను దాని మంట భక్తిహీనులను కాల్చివేసెను.
కీర్తనల గ్రంథము 106 : 19 (TEV)
హోరేబులో వారు దూడను చేయించుకొనిరి. పోతపోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి
కీర్తనల గ్రంథము 106 : 20 (TEV)
తమ మహిమాస్పదమును గడ్డిమేయు ఎద్దు రూపము నకు మార్చిరి.
కీర్తనల గ్రంథము 106 : 21 (TEV)
ఐగుప్తులో గొప్ప కార్యములను హాముదేశములో ఆశ్చర్యకార్యములను
కీర్తనల గ్రంథము 106 : 22 (TEV)
ఎఱ్ఱసముద్రమునొద్ద భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మరచిపోయిరి.
కీర్తనల గ్రంథము 106 : 23 (TEV)
అప్పుడు ఆయననేను వారిని నశింపజేసెదననెను. అయితే ఆయన వారిని నశింపజేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకొనిన మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను
కీర్తనల గ్రంథము 106 : 24 (TEV)
వారు రమ్యమైన దేశమును నిరాకరించిరి ఆయన మాట నమ్మకపోయిరి
కీర్తనల గ్రంథము 106 : 25 (TEV)
యెహోవా మాట ఆలకింపక వారు తమ గుడారములో సణుగుకొనిరి.
కీర్తనల గ్రంథము 106 : 26 (TEV)
అప్పుడు అరణ్యములో వారిని కూలచేయుటకును
కీర్తనల గ్రంథము 106 : 27 (TEV)
అన్యజనులలో వారి సంతానమును కూల్చుటకును దేశములో వారిని చెదరగొట్టుటకునుఆయన వారిమీద చెయ్యి యెత్తెను.
కీర్తనల గ్రంథము 106 : 28 (TEV)
మరియు వారు బయల్పెయోరును హత్తుకొని, చచ్చిన వారికి అర్పించిన బలిమాంసమును భుజించిరి.
కీర్తనల గ్రంథము 106 : 29 (TEV)
వారు తమ క్రియలచేత ఆయనకు కోపము పుట్టించగా వారిలో తెగులు రేగెను.
కీర్తనల గ్రంథము 106 : 30 (TEV)
ఫీనెహాసు లేచి పరిహారముచేయగా ఆ తెగులు ఆగిపోయెను.
కీర్తనల గ్రంథము 106 : 31 (TEV)
నిత్యము తరములన్నిటను అతనికి ఆ పని నీతిగా ఎంచ బడెను.
కీర్తనల గ్రంథము 106 : 32 (TEV)
మెరీబా జలములయొద్ద వారు ఆయనకు కోపము పుట్టించిరి కావున వారి మూలముగా మోషేకు బాధ కలిగెను.
కీర్తనల గ్రంథము 106 : 33 (TEV)
ఎట్లనగా వారు అతని ఆత్మమీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కానిమాట పలికెను.
కీర్తనల గ్రంథము 106 : 34 (TEV)
యెహోవా వారికి ఆజ్ఞాపించినట్లు వారు అన్యజనులను నాశనము చేయకపోయిరి.
కీర్తనల గ్రంథము 106 : 35 (TEV)
అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకొనిరి.
కీర్తనల గ్రంథము 106 : 36 (TEV)
వారి విగ్రహములకు పూజచేసిరి అవి వారికి ఉరి ఆయెను.
కీర్తనల గ్రంథము 106 : 37 (TEV)
మరియు వారు తమ కూమారులను తమ కుమార్తెలను దయ్యములకు బలిగా అర్పించిరి.
కీర్తనల గ్రంథము 106 : 38 (TEV)
నిరపరాధ రక్తము, అనగా తమ కుమారుల రక్తము తమ కుమార్తెల రక్తము ఒలికించిరి కనానుదేశపువారి బొమ్మలకు వారిని బలిగా అర్పించిరి ఆ రక్తమువలన దేశము అపవిత్రమాయెను
కీర్తనల గ్రంథము 106 : 39 (TEV)
తమ క్రియలవలన వారు అపవిత్రులైరి తమ నడవడిలో వ్యభిచరించినవారైరి.
కీర్తనల గ్రంథము 106 : 40 (TEV)
కావున యెహోవా కోపము ఆయన ప్రజలమీద రగులుకొనెను ఆయన తనస్వాస్థ్యమందు అసహ్యపడెను.
కీర్తనల గ్రంథము 106 : 41 (TEV)
ఆయన వారిని అన్యజనులచేతికి అప్పగించెను వారి పగవారు వారిని ఏలుచుండిరి.
కీర్తనల గ్రంథము 106 : 42 (TEV)
వారి శత్రువులు వారిని బాధపెట్టిరి వారు శత్రువులచేతి క్రింద అణపబడిరి.
కీర్తనల గ్రంథము 106 : 43 (TEV)
అనేక పర్యాయములు ఆయన వారిని విడిపించెను అయినను వారు తమ ఆలోచనను అనుసరించి తిరుగు బాటు చేయుచువచ్చిరి. తమ దోషముచేత హీనదశనొందిరి.
కీర్తనల గ్రంథము 106 : 44 (TEV)
అయినను వారిరోదనము తనకు వినబడగా వారికి కలిగిన శ్రమను ఆయన చూచెను.
కీర్తనల గ్రంథము 106 : 45 (TEV)
వారిని తలంచుకొని ఆయన తన నిబంధనను జ్ఞాపకము చేసికొనెను తన కృపాబాహుళ్యమునుబట్టి వారిని కరుణించెను.
కీర్తనల గ్రంథము 106 : 46 (TEV)
వారిని చెరగొనిపోయిన వారికందరికి వారియెడల కనికరము పుట్టించెను.
కీర్తనల గ్రంథము 106 : 47 (TEV)
యెహోవా మాదేవా, మమ్మును రక్షింపుము మేము నీ పరిశుద్ధనామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించునట్లును నిన్నుస్తుతించుచు మేమతిశయించునట్లును అన్యజనులలోనుండి మమ్మును పోగుచేయుము.
కీర్తనల గ్రంథము 106 : 48 (TEV)
ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా యుగము లన్నిటను స్తుతినొందును గాక ప్రజలందరుఆమేన్‌ అందురుగాక. యెహోవానుస్తుతించుడి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48

BG:

Opacity:

Color:


Size:


Font: