కీర్తనల గ్రంథము 107 : 1 (TEV)
యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిత్యముండును.
కీర్తనల గ్రంథము 107 : 2 (TEV)
యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుదురు గాక విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించినవారును
కీర్తనల గ్రంథము 107 : 3 (TEV)
తూర్పునుండి పడమటినుండి ఉత్తరమునుండి దక్షిణము నుండియు నానాదేశములనుండియు ఆయన పోగుచేసినవారును ఆమాట పలుకుదురుగాక.
కీర్తనల గ్రంథము 107 : 4 (TEV)
వారు అరణ్యమందలి యెడారిత్రోవను తిరుగులాడు చుండిరి. నివాస పురమేదియు వారికి దొరుకకపోయెను.
కీర్తనల గ్రంథము 107 : 5 (TEV)
ఆకలి దప్పులచేత వారి ప్రాణము వారిలో సొమ్మసిల్లెను.
కీర్తనల గ్రంథము 107 : 6 (TEV)
వారు కష్టకాలమందు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను
కీర్తనల గ్రంథము 107 : 7 (TEV)
వారొక నివాస పురము చేరునట్లు చక్కనిత్రోవను ఆయన వారిని నడిపించెను.
కీర్తనల గ్రంథము 107 : 8 (TEV)
ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక
కీర్తనల గ్రంథము 107 : 9 (TEV)
ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచి యున్నాడు. ఆకలి గొనినవారి ప్రాణమును మేలుతో నింపి యున్నాడు.
కీర్తనల గ్రంథము 107 : 10 (TEV)
దేవుని ఆజ్ఞలకు లోబడక మహోన్నతుని తీర్మానమును తృణీకరించినందున
కీర్తనల గ్రంథము 107 : 11 (TEV)
బాధ చేతను ఇనుప కట్లచేతను బంధింప బడినవారై చీకటిలోను మరణాంధకారములోను నివాసముచేయువారి హృదయమును
కీర్తనల గ్రంథము 107 : 12 (TEV)
ఆయన ఆయాసముచేత క్రుంగజేసెను. వారు కూలియుండగా సహాయుడు లేకపోయెను.
కీర్తనల గ్రంథము 107 : 13 (TEV)
కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించెను
కీర్తనల గ్రంథము 107 : 14 (TEV)
వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండియు మరణాంధకారములో నుండియు వారిని రప్పించెను.
కీర్తనల గ్రంథము 107 : 15 (TEV)
ఆయన కృపనుబట్టియు నరులకు ఆయన చేయు ఆశ్చర్యకార్యములను బట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
కీర్తనల గ్రంథము 107 : 16 (TEV)
ఏలయనగా ఆయన యిత్తడి తలుపులను పగులగొట్టి యున్నాడు ఇనుపగడియలను విరుగగొట్టియున్నాడు.
కీర్తనల గ్రంథము 107 : 17 (TEV)
బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తనచేతను తమ దోషము చేతను బాధతెచ్చుకొందురు.
కీర్తనల గ్రంథము 107 : 18 (TEV)
భోజనపదార్థములన్నియు వారి ప్రాణమునకు అసహ్య మగును వారు మరణద్వారములను సమీపించుదురు.
కీర్తనల గ్రంథము 107 : 19 (TEV)
కష్టకాలమందు వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.
కీర్తనల గ్రంథము 107 : 20 (TEV)
ఆయన తన వాక్కును పంపి వారిని బాగుచేసెను ఆయన వారు పడిన గుంటలలోనుండి వారిని విడిపిం చెను.
కీర్తనల గ్రంథము 107 : 21 (TEV)
ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయుఆశ్చర్య కార్యములనుబట్టియు వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
కీర్తనల గ్రంథము 107 : 22 (TEV)
వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురుగాక ఉత్సాహధ్వనితో ఆయన కార్యములను ప్రకటించు దురుగాక.
కీర్తనల గ్రంథము 107 : 23 (TEV)
ఓడలెక్కి సముద్రప్రయాణము చేయువారు మహాజలములమీద సంచరించుచు వ్యాపారముచేయు వారు
కీర్తనల గ్రంథము 107 : 24 (TEV)
యెహోవా కార్యములను సముద్రములో ఆయన చేయు అద్భుతములను చూచిరి.
కీర్తనల గ్రంథము 107 : 25 (TEV)
ఆయన సెలవియ్యగా తుపాను పుట్టెను అది దాని తరంగములను పైకెత్తెను
కీర్తనల గ్రంథము 107 : 26 (TEV)
వారు ఆకాశమువరకు ఎక్కుచు అగాధమునకు దిగుచు నుండిరి శ్రమచేత వారి ప్రాణము కరిగిపోయెను.
కీర్తనల గ్రంథము 107 : 27 (TEV)
మత్తులైనవారివలె వారు ముందుకు వెనుకకు దొర్లుచు ఇటు అటు తూలుచుండిరి వారు ఎటుతోచక యుండిరి.
కీర్తనల గ్రంథము 107 : 28 (TEV)
శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొఱ్ఱపెట్టిరి ఆయన వారి ఆపదలలోనుండి వారిని విడిపించెను.
కీర్తనల గ్రంథము 107 : 29 (TEV)
ఆయన తుపానును ఆపివేయగా దాని తరంగములు అణగిపోయెను.
కీర్తనల గ్రంథము 107 : 30 (TEV)
అవి నిమ్మళమైనవని వారు సంతోషించిరి వారు కోరిన రేవునకు ఆయన వారిని నడిపించెను.
కీర్తనల గ్రంథము 107 : 31 (TEV)
ఆయన కృపనుబట్టియు నరులకు ఆయనచేయు ఆశ్చర్య కార్యములనుబట్టియువారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
కీర్తనల గ్రంథము 107 : 32 (TEV)
జనసమాజములో వారాయనను ఘనపరచుదురుగాక పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక
కీర్తనల గ్రంథము 107 : 33 (TEV)
దేశనివాసుల చెడుతనమునుబట్టి
కీర్తనల గ్రంథము 107 : 34 (TEV)
ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను సత్తువగల భూమిని చవిటిపఱ్ఱగాను మార్చెను.
కీర్తనల గ్రంథము 107 : 35 (TEV)
అరణ్యమును నీటిమడుగుగాను ఎండిన నేలను నీటి ఊటల చోటుగాను ఆయన మార్చి
కీర్తనల గ్రంథము 107 : 36 (TEV)
వారు అచ్చట నివాసపురము ఏర్పరచుకొనునట్లును పొలములో విత్తనములు చల్లి ద్రాక్షతోటలు నాటి
కీర్తనల గ్రంథము 107 : 37 (TEV)
వాటివలన సస్యఫలసమృద్ధి పొందునట్లును ఆయన ఆకలికొనినవారిని అచ్చట కాపురముంచెను
కీర్తనల గ్రంథము 107 : 38 (TEV)
మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధిక ముగా సంతానాభివృద్ధి నొందిరి ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు
కీర్తనల గ్రంథము 107 : 39 (TEV)
వారు బాధవలనను ఇబ్బందివలనను దుఃఖమువలనను తగ్గిపోయినప్పుడు
కీర్తనల గ్రంథము 107 : 40 (TEV)
రాజులను తృణీకరించుచు త్రోవలేని యెడారిలో వారిని తిరుగులాడ జేయు వాడు.
కీర్తనల గ్రంథము 107 : 41 (TEV)
అట్టి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తెను వాని వంశమును మందవలె వృద్ధిచేసెను.
కీర్తనల గ్రంథము 107 : 42 (TEV)
యథార్థవంతులు దాని చూచి సంతోషించుదురు మోసగాండ్రందరును మౌనముగా నుందురు.
కీర్తనల గ్రంథము 107 : 43 (TEV)
బుద్ధిమంతుడైనవాడు ఈ విషయములను ఆలోచించును యెహోవా కృపాతిశయములను జనులు తల పోయు దురుగాక.
❮
❯