కీర్తనల గ్రంథము 108 : 1 (TEV)
దేవా, నా హృదయము నిబ్బరముగా నున్నది నేను పాడుచు స్తుతిగానము చేసెదను నా ఆత్మ పాడుచు గానముచేయును.
కీర్తనల గ్రంథము 108 : 2 (TEV)
స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను
కీర్తనల గ్రంథము 108 : 3 (TEV)
జనులమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను
కీర్తనల గ్రంథము 108 : 4 (TEV)
యెహోవా, నీ కృప ఆకాశముకంటె ఎత్తయినది నీ సత్యము మేఘములంత ఎత్తుగానున్నది.
కీర్తనల గ్రంథము 108 : 5 (TEV)
దేవా, ఆకాశముకంటె అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకొనుము.
కీర్తనల గ్రంథము 108 : 6 (TEV)
నీ ప్రభావము సర్వభూమిమీద కనబడనిమ్ము నీ ప్రియులు విమోచింపబడునట్లుn నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము.
కీర్తనల గ్రంథము 108 : 7 (TEV)
తన పరిశుద్ధత తోడని దేవుడు మాట యిచ్చియున్నాడు నేను ప్రహర్షించెదను షెకెమును పంచిపెట్టెదను సుక్కోతు లోయను కొలిపించెదను.
కీర్తనల గ్రంథము 108 : 8 (TEV)
గిలాదు నాది మనష్షే నాది ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణము యూదా నా రాజ దండము.
కీర్తనల గ్రంథము 108 : 9 (TEV)
మోయాబు నేను కాళ్లు కడగుకొను పళ్లెము ఎదోముమీదికి నా చెప్పువిసరివేయుదును ఫిలిష్తియనుబట్టి జయోత్సవము చేసియున్నాను.
కీర్తనల గ్రంథము 108 : 10 (TEV)
కోటగల పట్టణములోనికి నన్ను ఎవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును?
కీర్తనల గ్రంథము 108 : 11 (TEV)
దేవా, నీవు మమ్మును విడనాడి యున్నావుగదా? దేవా, మా సేనలతోకూడ నీవు బయలుదేరుట మాని యున్నావుగదా?
కీర్తనల గ్రంథము 108 : 12 (TEV)
మనుష్యుల సహాయము వ్యర్థము. శత్రువులను జయించుటకు నీవు మాకు సహాయము దయచేయుము
కీర్తనల గ్రంథము 108 : 13 (TEV)
దేవునివలన మేము శూరకార్యములు జరిగించెదము మా శత్రువులను అణగద్రొక్కువాడు ఆయనే.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13

BG:

Opacity:

Color:


Size:


Font: