కీర్తనల గ్రంథము 109 : 1 (TEV)
నా స్తుతికి కారణభూతుడవగు దేవా, మౌనముగా ఉండకుము
కీర్తనల గ్రంథము 109 : 2 (TEV)
నన్ను చెరపవలెనని భక్తిహీనులు తమ నోరు కపటముగల తమ నోరు తెరచియున్నారు వారు నామీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు.
కీర్తనల గ్రంథము 109 : 3 (TEV)
నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడు చున్నారు నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు
కీర్తనల గ్రంథము 109 : 4 (TEV)
నేను చూపిన ప్రేమకు ప్రతిగా వారు నామీద పగ పట్టియున్నారు అయితే నేను మానక ప్రార్థనచేయుచున్నాను.
కీర్తనల గ్రంథము 109 : 5 (TEV)
నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నామీద ద్వేష ముంచుచున్నారు.
కీర్తనల గ్రంథము 109 : 6 (TEV)
వానిమీద భక్తిహీనుని అధికారిగా నుంచుము అపవాది వాని కుడిప్రక్కను నిలుచును గాక.
కీర్తనల గ్రంథము 109 : 7 (TEV)
వాడు విమర్శలోనికి తేబడునప్పుడు దోషియని తీర్పు నొందును గాక వాని ప్రార్థన పాపమగునుగాక
కీర్తనల గ్రంథము 109 : 8 (TEV)
వాని జీవితదినములు కొద్దివగును గాక వాని ఉద్యోగమును వేరొకడు తీసికొనును గాక.
కీర్తనల గ్రంథము 109 : 9 (TEV)
వాని బిడ్డలు తండ్రిలేనివారవుదురు గాక వాని భార్య విధవరాలగును గాక
కీర్తనల గ్రంథము 109 : 10 (TEV)
వాని బిడ్డలు దేశద్రిమ్మరులై భిక్షమెత్తుదురు గాక పాడుపడిన తమ యిండ్లకు దూరముగా జీవనము వెదకుదురు గాక
కీర్తనల గ్రంథము 109 : 11 (TEV)
వాని ఆస్తి అంతయు అప్పులవారు ఆక్రమించు కొందురు గాక వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక
కీర్తనల గ్రంథము 109 : 12 (TEV)
వానికి కృప చూపువారు లేకపోదురు గాక తండ్రిలేనివాని బిడ్డలకు దయచూపువారు ఉండక పోదురు గాక
కీర్తనల గ్రంథము 109 : 13 (TEV)
వాని వంశము నిర్మూలము చేయబడును గాక వచ్చుతరమునందు వారి పేరు మాసిపోవును గాక
కీర్తనల గ్రంథము 109 : 14 (TEV)
వాని పితరులదోషము యెహోవా జ్ఞాపకములోనుంచు కొనును గాక వాని తల్లి పాపము తుడుపుపెట్టబడక యుండును గాక
కీర్తనల గ్రంథము 109 : 15 (TEV)
ఆయన వారి జ్ఞాపకమును భూమిమీదనుండి కొట్టి వేయునట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనబడు చుండునుగాక.
కీర్తనల గ్రంథము 109 : 16 (TEV)
ఏలయనగా కృప చూపవలెనన్నమాట మరచి శ్రమనొందినవానిని దరిద్రుని నలిగిన హృదయము గలవానిని చంపవలెనని వాడు అతని తరిమెను.
కీర్తనల గ్రంథము 109 : 17 (TEV)
శపించుట వానికి ప్రీతి గనుక అది వానిమీదికి వచ్చి యున్నది. దీవెనయందు వానికిష్టము లేదు గనుక అది వానికి దూరమాయెను.
కీర్తనల గ్రంథము 109 : 18 (TEV)
తాను పైబట్ట వేసికొనునట్లు వాడు శాపము ధరించెను అది నీళ్లవలె వాని కడుపులో చొచ్చియున్నది తైలమువలె వాని యెముకలలో చేరియున్నది
కీర్తనల గ్రంథము 109 : 19 (TEV)
తాను కప్పుకొను వస్త్రమువలెను తాను నిత్యము కట్టుకొను నడికట్టువలెను అది వానిని వదలకుండును గాక.
కీర్తనల గ్రంథము 109 : 20 (TEV)
నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట లాడువారికి ఇదే యెహోవావలన కలుగు ప్రతికారము.
కీర్తనల గ్రంథము 109 : 21 (TEV)
యెహోవా ప్రభువా, నీ నామమునుబట్టి నాకు సహాయము చేయుము నీ కృప ఉత్తమమైనది గనుక నన్ను విడిపింపుము.
కీర్తనల గ్రంథము 109 : 22 (TEV)
నేను దీనదరిద్రుడను నా హృదయము నాలో గుచ్చ బడియున్నది.
కీర్తనల గ్రంథము 109 : 23 (TEV)
సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు
కీర్తనల గ్రంథము 109 : 24 (TEV)
ఉపవాసముచేత నా మోకాళ్లు బలహీనమాయెను నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయెను.
కీర్తనల గ్రంథము 109 : 25 (TEV)
వారి నిందలకు నేను ఆస్పదుడనైతిని వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు
కీర్తనల గ్రంథము 109 : 26 (TEV)
యెహోవా నాదేవా, యిది నీచేత జరిగినదనియు యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియు నట్లు
కీర్తనల గ్రంథము 109 : 27 (TEV)
నాకు సహాయము చేయుము నీ కృపనుబట్టి నన్ను రక్షింపుము.
కీర్తనల గ్రంథము 109 : 28 (TEV)
వారు శపించుచున్నారు గాని నీవు దీవించుదువు వారు లేచి అవమానము పొందెదరు గాని నీ సేవకుడు సంతోషించును.
కీర్తనల గ్రంథము 109 : 29 (TEV)
నా విరోధులు అవమానము ధరించుకొందురు గాక తమ సిగ్గునే నిలువుటంగీవలె కప్పుకొందురు గాక
కీర్తనల గ్రంథము 109 : 30 (TEV)
నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను అనేకుల మధ్యను నేనాయనను స్తుతించెదను.
కీర్తనల గ్రంథము 109 : 31 (TEV)
దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచువారి చేతి లోనుండి అతని రక్షించుటకై యెహోవా అతని కుడిప్రక్కను నిలుచుచున్నాడు.
❮
❯