కీర్తనల గ్రంథము 110 : 1 (TEV)
ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చినవాక్కు నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయువరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము.
కీర్తనల గ్రంథము 110 : 2 (TEV)
యెహోవా నీ పరిపాలనదండమును సీయోనులోనుండి సాగజేయుచున్నాడు నీ శత్రువులమధ్యను నీవు పరిపాలన చేయుము.
కీర్తనల గ్రంథము 110 : 3 (TEV)
యుద్ధసన్నాహదినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు. నీ ¸°వనస్థులలో శ్రేష్ఠులు పరిశుద్ధాలంకృతులైమంచు వలె అరుణోదయగర్భములోనుండి నీయొద్దకువచ్చెదరు
కీర్తనల గ్రంథము 110 : 4 (TEV)
మెల్కీసెదెకు క్రమము చొప్పున నీవు నిరంతరము యాజకుడవైయుందువని యెహోవా ప్రమాణము చేసియున్నాడు, ఆయన మాట తప్పనివాడు.
కీర్తనల గ్రంథము 110 : 5 (TEV)
ప్రభువు నీ కుడిపార్శ్వమందుండి తన కోపదినమున రాజులను నలుగగొట్టును.
కీర్తనల గ్రంథము 110 : 6 (TEV)
అన్యజనులకు ఆయన తీర్పు తీర్చును దేశము శవములతో నిండియుండును విశాలదేశముమీది ప్రధానుని ఆయన నలుగగొట్టును.
కీర్తనల గ్రంథము 110 : 7 (TEV)
మార్గమున ఏటి నీళ్లు పానముచేసి ఆయన తల యెత్తును.

1 2 3 4 5 6 7

BG:

Opacity:

Color:


Size:


Font: