కీర్తనల గ్రంథము 112 : 1 (TEV)
యెహోవాను స్తుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవాడు ఆయన ఆజ్ఞలనుబట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు.
కీర్తనల గ్రంథము 112 : 2 (TEV)
వాని సంతతివారు భూమిమీద బలవంతులగుదురు యథార్థవంతుల వంశపువారు దీవింపబడుదురు
కీర్తనల గ్రంథము 112 : 3 (TEV)
కలిమియు సంపదయు వాని యింట నుండును వాని నీతి నిత్యము నిలుచును.
కీర్తనల గ్రంథము 112 : 4 (TEV)
యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియుగలవారు.
కీర్తనల గ్రంథము 112 : 5 (TEV)
దయాళులును అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయవిమర్శలో వారి వ్యాజ్యెము గెలుచును
కీర్తనల గ్రంథము 112 : 6 (TEV)
అట్టివారు ఎప్పుడును కదలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు.
కీర్తనల గ్రంథము 112 : 7 (TEV)
వాని హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిర ముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు.
కీర్తనల గ్రంథము 112 : 8 (TEV)
వాని మనస్సు స్థిరముగానుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు.
కీర్తనల గ్రంథము 112 : 9 (TEV)
వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నొంది హెచ్చింపబడును.
కీర్తనల గ్రంథము 112 : 10 (TEV)
భక్తిహీనులు దాని చూచి చింతపడుదురు వారు పండ్లుకొరుకుచు క్షీణించి పోవుదురు భక్తిహీనుల ఆశ భంగమైపోవును.

1 2 3 4 5 6 7 8 9 10

BG:

Opacity:

Color:


Size:


Font: