కీర్తనల గ్రంథము 113 : 1 (TEV)
యెహోవాను స్తుతించుడి యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించుడి. యెహోవా నామమును స్తుతించుడి.
కీర్తనల గ్రంథము 113 : 2 (TEV)
ఇది మొదలుకొని యెల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడునుగాక.
కీర్తనల గ్రంథము 113 : 3 (TEV)
సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది.
కీర్తనల గ్రంథము 113 : 4 (TEV)
యెహోవా అన్యజనులందరియెదుట మహోన్నతుడు ఆయన మహిమ ఆకాశ విశాలమున వ్యాపించి యున్నది
కీర్తనల గ్రంథము 113 : 5 (TEV)
ఉన్నతమందు ఆసీనుడైయున్న మన దేవుడైన యెహో వాను పోలియున్నవాడెవడు?
కీర్తనల గ్రంథము 113 : 6 (TEV)
ఆయన భూమ్యాకాశములను వంగిచూడననుగ్రహించు చున్నాడు.
కీర్తనల గ్రంథము 113 : 7 (TEV)
ప్రధానులతో తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై
కీర్తనల గ్రంథము 113 : 8 (TEV)
ఆయన నేలనుండి దరిద్రులను లేవనెత్తువాడు పెంట కుప్పమీదనుండి బీదలను పైకెత్తువాడు
కీర్తనల గ్రంథము 113 : 9 (TEV)
ఆయన సంతులేనిదానిని ఇల్లాలుగాను కుమాళ్ల సంతోషముగల తల్లిగాను చేయును. యెహోవాను స్తుతించుడి.

1 2 3 4 5 6 7 8 9