కీర్తనల గ్రంథము 114 : 1 (TEV)
ఐగుప్తులోనుండి ఇశ్రాయేలు అన్యభాషగల జనులలోనుండి యాకోబు బయలు వెళ్లినప్పుడు
కీర్తనల గ్రంథము 114 : 2 (TEV)
యూదా ఆయనకు పరిశుద్ధస్థలమాయెను ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను.
కీర్తనల గ్రంథము 114 : 3 (TEV)
సముద్రము దానిని చూచి పారిపోయెను యొర్దాను నది వెనుకకు మళ్లెను.
కీర్తనల గ్రంథము 114 : 4 (TEV)
కొండలు పొట్టేళ్లవలెను గుట్టలు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేసెను.
కీర్తనల గ్రంథము 114 : 5 (TEV)
సముద్రమా, నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించి నది? యొర్దానూ, నీవు వెనుకకు మళ్లుటకు నీకేమి తటస్థించి నది?
కీర్తనల గ్రంథము 114 : 6 (TEV)
కొండలారా, మీరు పొట్లేళ్లవలెను గుట్టలారా, మీరు గొఱ్ఱపిల్లలవలెను గంతులు వేయు టకు మీకేమి సంభవించినది?
కీర్తనల గ్రంథము 114 : 7 (TEV)
భూమీ, ప్రభువు సన్నిధిని యాకోబు దేవుని సన్ని ధిని వణకుము
కీర్తనల గ్రంథము 114 : 8 (TEV)
ఆయన బండను నీటిమడుగుగాను చెకుముకి రాతిబండను నీటి ఊటలుగాను చేయు వాడు.
❮
❯