కీర్తనల గ్రంథము 115 : 1 (TEV)
మాకు కాదు, యెహోవా మాకు కాదు నీ కృపాసత్యములనుబట్టి నీ నామమునకే మహిమ కలగునుగాక
కీర్తనల గ్రంథము 115 : 2 (TEV)
వారి దేవుడేడి అని అన్యజనులెందుకు చెప్పుకొందురు?
కీర్తనల గ్రంథము 115 : 3 (TEV)
మా దేవుడు ఆకాశమందున్నాడు తన కిచ్ఛవచ్చినట్లుగా సమస్తమును ఆయన చేయు చున్నాడు
కీర్తనల గ్రంథము 115 : 4 (TEV)
వారి విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు
కీర్తనల గ్రంథము 115 : 5 (TEV)
వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు
కీర్తనల గ్రంథము 115 : 6 (TEV)
చెవులుండియు వినవు ముక్కులుండియు వాసనచూడవు
కీర్తనల గ్రంథము 115 : 7 (TEV)
చేతులుండియు ముట్టుకొనవు పాదములుండియు నడువవు గొంతుకతో మాటలాడవు.
కీర్తనల గ్రంథము 115 : 8 (TEV)
వాటిని చేయువారును వాటియందు నమి్మకయుంచు వారందరును వాటివంటివారై యున్నారు.
కీర్తనల గ్రంథము 115 : 9 (TEV)
ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
కీర్తనల గ్రంథము 115 : 10 (TEV)
అహరోను వంశస్థులారా, యెహోవాను నమ్ముకొనుడి. ఆయన వారికి సహాయము వారికి కేడెము
కీర్తనల గ్రంథము 115 : 11 (TEV)
యెహోవాయందు భయభక్తులుగలవారలారా యెహోవాయందు నమి్మక యుంచుడి ఆయన వారికి సహాయము వారికి కేడెము.
కీర్తనల గ్రంథము 115 : 12 (TEV)
యెహోవా మమ్మును మరచిపోలేదు ఆయన మమ్ము నాశీర్వదించును ఆయన ఇశ్రాయేలీయుల నాశీర్వదించును అహరోను వంశస్థులనాశీర్వదించును
కీర్తనల గ్రంథము 115 : 13 (TEV)
పిన్నలనేమి పెద్దలనేమి తనయందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును.
కీర్తనల గ్రంథము 115 : 14 (TEV)
యెహోవా మిమ్మును మీ పిల్లలను వృద్ధిపొందించును.
కీర్తనల గ్రంథము 115 : 15 (TEV)
భూమ్యాకాశములను సృజించిన యెహోవాచేత మీరు ఆశీర్వదింపబడినవారు.
కీర్తనల గ్రంథము 115 : 16 (TEV)
ఆకాశములు యెహోవావశము భూమిని ఆయన నరుల కిచ్చియున్నాడు.
కీర్తనల గ్రంథము 115 : 17 (TEV)
మృతులును మౌనస్థితిలోనికి దిగిపోవువారును యెహోవాను స్తుతింపరు
కీర్తనల గ్రంథము 115 : 18 (TEV)
మేమైతే ఇది మొదలుకొని నిత్యము యెహోవాను స్తుతించెదము యెహోవాను స్తుతించుడి.
❮
❯