కీర్తనల గ్రంథము 116 : 1 (TEV)
యెహోవా నా మొరను నా విన్నపములను ఆలకించి యున్నాడు. కాగా నేనాయనను ప్రేమించుచున్నాను.
కీర్తనల గ్రంథము 116 : 2 (TEV)
ఆయన నాకు చెవియొగ్గెను కావున నా జీవితకాలమంతయు నేనాయనకు మొఱ్ఱ పెట్టుదును
కీర్తనల గ్రంథము 116 : 3 (TEV)
మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.
కీర్తనల గ్రంథము 116 : 4 (TEV)
అప్పుడుయెహోవా, దయచేసి నా ప్రాణమును విడిపింపుమని యెహోవా నామమునుబట్టి నేను మొఱ్ఱపెట్టితిని.
కీర్తనల గ్రంథము 116 : 5 (TEV)
యెహోవా దయాళుడు నీతిమంతుడు మన దేవుడు వాత్సల్యతగలవాడు.
కీర్తనల గ్రంథము 116 : 6 (TEV)
యెహోవా సాధువులను కాపాడువాడు. నేను క్రుంగియుండగా ఆయన నన్ను రక్షించెను.
కీర్తనల గ్రంథము 116 : 7 (TEV)
నా ప్రాణమా, యెహోవా నీకు క్షేమము విస్తరింప జేసియున్నాడు. తిరిగి నీ విశ్రాంతిలో ప్రవేశింపుము.
కీర్తనల గ్రంథము 116 : 8 (TEV)
మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు.
కీర్తనల గ్రంథము 116 : 9 (TEV)
సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును.
కీర్తనల గ్రంథము 116 : 10 (TEV)
నేను ఆలాగు మాటలాడి నమి్మక యుంచితిని. నేను మిగుల బాధపడినవాడను.
కీర్తనల గ్రంథము 116 : 11 (TEV)
నేను తొందరపడినవాడనై ఏ మనుష్యుడును నమ్మదగినవాడు కాడను కొంటిని.
కీర్తనల గ్రంథము 116 : 12 (TEV)
యెహోవా నాకు చేసిన ఉపకారములన్నిటికి నేనాయనకేమి చెల్లించుదును?
కీర్తనల గ్రంథము 116 : 13 (TEV)
రక్షణపాత్రను చేత పుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసెదను.
కీర్తనల గ్రంథము 116 : 14 (TEV)
యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. ఆయన ప్రజలందరి యెదుటనే చెల్లించెదను
కీర్తనల గ్రంథము 116 : 15 (TEV)
యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది
కీర్తనల గ్రంథము 116 : 16 (TEV)
యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను, నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనైయున్నాను నీవు నాకట్లు విప్పియున్నావు.
కీర్తనల గ్రంథము 116 : 17 (TEV)
నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను, యెహోవా నామమున ప్రార్థనచేసెదను
కీర్తనల గ్రంథము 116 : 18 (TEV)
ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను
కీర్తనల గ్రంథము 116 : 19 (TEV)
యెరూషలేమా, నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను. యెహోవాను స్తుతించుడి.
❮
❯