కీర్తనల గ్రంథము 118 : 1 (TEV)
యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము...... నిలుచును ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి
కీర్తనల గ్రంథము 118 : 2 (TEV)
ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురు గాక.
కీర్తనల గ్రంథము 118 : 3 (TEV)
ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశ స్థులు అందురు గాక.
కీర్తనల గ్రంథము 118 : 4 (TEV)
ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులుగలవారు అందురు గాక.
కీర్తనల గ్రంథము 118 : 5 (TEV)
ఇరుకునందుండి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టితిని విశాలస్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చెను
కీర్తనల గ్రంథము 118 : 6 (TEV)
యెహోవా నా పక్షమున నున్నాడు నేను భయ పడను నరులు నాకేమి చేయగలరు?
కీర్తనల గ్రంథము 118 : 7 (TEV)
యెహోవా నా పక్షము వహించి నాకు సహకారియై యున్నాడు నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను.
కీర్తనల గ్రంథము 118 : 8 (TEV)
మనుష్యులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
కీర్తనల గ్రంథము 118 : 9 (TEV)
రాజులను నమ్ముకొనుటకంటె యెహోవాను ఆశ్రయించుట మేలు.
కీర్తనల గ్రంథము 118 : 10 (TEV)
అన్యజనులందరు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
కీర్తనల గ్రంథము 118 : 11 (TEV)
నలుదిశలను వారు నన్ను చుట్టుకొనియున్నారు యెహోవా నామమునుబట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
కీర్తనల గ్రంథము 118 : 12 (TEV)
కందిరీగలవలె నామీద ముసిరి యున్నారు ముండ్లు కాల్చిన మంట ఆరిపోవునట్లు వారు నశించి పోయిరి యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసెదను.
కీర్తనల గ్రంథము 118 : 13 (TEV)
నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి యెహోవా నాకు సహాయము చేసెను.
కీర్తనల గ్రంథము 118 : 14 (TEV)
యెహోవా నా దుర్గము నా గానము ఆయన నాకు రక్షణాధారమాయెను.
కీర్తనల గ్రంథము 118 : 15 (TEV)
నీతిమంతుల గుడారములలోరక్షణనుగూర్చిన ఉత్సాహ సునాదము వినబడును యెహోవా దక్షిణహస్తము సాహస కార్యములను చేయును.
కీర్తనల గ్రంథము 118 : 16 (TEV)
యెహోవా దక్షిణహస్తము మహోన్నత మాయెను యెహోవా దక్షిణహస్తము సాహసకార్యములను చేయును.
కీర్తనల గ్రంథము 118 : 17 (TEV)
నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివ రించెదను.
కీర్తనల గ్రంథము 118 : 18 (TEV)
యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు.
కీర్తనల గ్రంథము 118 : 19 (TEV)
నేను వచ్చునట్లు నీతి గుమ్మములు తీయుడి నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించెదను.
కీర్తనల గ్రంథము 118 : 20 (TEV)
ఇది యెహోవా గుమ్మము నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు.
కీర్తనల గ్రంథము 118 : 21 (TEV)
నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి యున్నావు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను.
కీర్తనల గ్రంథము 118 : 22 (TEV)
ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను.
కీర్తనల గ్రంథము 118 : 23 (TEV)
అది యెహోవావలన కలిగినది అది మన కన్నులకు ఆశ్చర్యము
కీర్తనల గ్రంథము 118 : 24 (TEV)
ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము దీనియందు మనము ఉత్సహించి సంతోషించెదము.
కీర్తనల గ్రంథము 118 : 25 (TEV)
యెహోవా, దయచేసి నన్ను రక్షించుము యెహోవా, దయచేసి అభివృద్ధి కలిగించుము.
కీర్తనల గ్రంథము 118 : 26 (TEV)
యెహోవాపేరట వచ్చువాడు ఆశీర్వాద మొందును గాక యెహోవా మందిరములోనుండి మిమ్ము దీవించు చున్నాము.
కీర్తనల గ్రంథము 118 : 27 (TEV)
యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు నను గ్రహించియున్నాడు ఉత్సవ బలిపశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి.
కీర్తనల గ్రంథము 118 : 28 (TEV)
నీవు నా దేవుడవు నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను నీవు నా దేవుడవు నిన్ను ఘనపరచెదను.
కీర్తనల గ్రంథము 118 : 29 (TEV)
యెహోవా దయాళుడు ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29

BG:

Opacity:

Color:


Size:


Font: