కీర్తనల గ్రంథము 121 : 1 (TEV)
కొండలతట్టు నా కన్ను లెత్తుచున్నాను నాకు సహాయము ఎక్కడనుండి వచ్చును?
కీర్తనల గ్రంథము 121 : 2 (TEV)
యెహోవావలననే నాకు సహాయము కలుగును ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు.
కీర్తనల గ్రంథము 121 : 3 (TEV)
ఆయన నీ పాదము తొట్రిల్లనియ్యడు నిన్ను కాపాడువాడు కునుకడు.
కీర్తనల గ్రంథము 121 : 4 (TEV)
ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు
కీర్తనల గ్రంథము 121 : 5 (TEV)
యెహోవాయే నిన్ను కాపాడువాడు నీ కుడిప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును.
కీర్తనల గ్రంథము 121 : 6 (TEV)
పగలు ఎండ దెబ్బయైనను నీకు తగులదు. రాత్రి వెన్నెల దెబ్బయైనను నీకు తగులదు.
కీర్తనల గ్రంథము 121 : 7 (TEV)
ఏ అపాయమును రాకుండ యెహోవా నిన్ను కాపా డును ఆయన నీ ప్రాణమును కాపాడును
కీర్తనల గ్రంథము 121 : 8 (TEV)
ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: