కీర్తనల గ్రంథము 122 : 1 (TEV)
యెహోవా మందిరమునకు వెళ్లుదమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని.
కీర్తనల గ్రంథము 122 : 2 (TEV)
యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి
కీర్తనల గ్రంథము 122 : 3 (TEV)
యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణమువలె నీవు కట్టబడియున్నావు
కీర్తనల గ్రంథము 122 : 4 (TEV)
ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుటకై వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్లును.
కీర్తనల గ్రంథము 122 : 5 (TEV)
అచ్చట న్యాయము తీర్చుటకై సింహాసనములు దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి యున్నవి.
కీర్తనల గ్రంథము 122 : 6 (TEV)
యెరూషలేముయొక్క క్షేమముకొరకు ప్రార్థన చేయుడి యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు.
కీర్తనల గ్రంథము 122 : 7 (TEV)
నీ ప్రాకారములలో నెమ్మది కలుగును గాక. నీ నగరులలో క్షేమముండును గాక.
కీర్తనల గ్రంథము 122 : 8 (TEV)
నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమి త్తమును నీకు క్షేమము కలుగును గాక అని నేనందును.
కీర్తనల గ్రంథము 122 : 9 (TEV)
మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలుచేయ ప్రయత్నించెదను.

1 2 3 4 5 6 7 8 9