కీర్తనల గ్రంథము 124 : 1 (TEV)
మనుష్యులు మనమీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడైయుండనియెడల
కీర్తనల గ్రంథము 124 : 2 (TEV)
వారి ఆగ్రహము మనపైని రగులుకొనినప్పుడు
కీర్తనల గ్రంథము 124 : 3 (TEV)
యెహోవా మనకు తోడైయుండనియెడల వారు మనలను ప్రాణముతోనే మింగివేసియుందురు
కీర్తనల గ్రంథము 124 : 4 (TEV)
జలములు మనలను ముంచివేసి యుండును ప్రవాహము మన ప్రాణములమీదుగా పొర్లిపారి యుండును
కీర్తనల గ్రంథము 124 : 5 (TEV)
ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణములమీదుగా పొర్లి పారియుండును అని ఇశ్రాయేలీయులు అందురు గాక.
కీర్తనల గ్రంథము 124 : 6 (TEV)
వారి పండ్లకు మనలను వేటగా అప్పగింపని యెహోవా స్తుతినొందును గాక.
కీర్తనల గ్రంథము 124 : 7 (TEV)
పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరినుండి తప్పించుకొని యున్నది ఉరి తెంపబడెను మనము తప్పించుకొని యున్నాము.
కీర్తనల గ్రంథము 124 : 8 (TEV)
భూమ్యాకాశములను సృజించిన యెహోవా నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది.

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: