కీర్తనల గ్రంథము 126 : 1 (TEV)
సీయోనుకు తిరిగి వచ్చినవారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు
కీర్తనల గ్రంథము 126 : 2 (TEV)
మనము కలకనినవారివలె నుంటిమి మన నోటి నిండ నవ్వుండెను మన నాలుక ఆనందగానముతో నిండియుండెను. అప్పుడుయెహోవా వీరికొరకు గొప్పకార్యములు చేసెనని అన్యజనులు చెప్పుకొనిరి.
కీర్తనల గ్రంథము 126 : 3 (TEV)
యెహోవా మనకొరకు గొప్పకార్యములు చేసి యున్నాడు మనము సంతోషభరితులమైతివిు.
కీర్తనల గ్రంథము 126 : 4 (TEV)
దక్షిణదేశములో ప్రవాహములు పారునట్లుగా యెహోవా, చెరపట్టబడిన మా వారిని రప్పించుము.
కీర్తనల గ్రంథము 126 : 5 (TEV)
కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు.
కీర్తనల గ్రంథము 126 : 6 (TEV)
పడికెడు విత్తనములు చేత పట్టుకొని యేడ్చుచుపోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసికొనివచ్చును.

1 2 3 4 5 6

BG:

Opacity:

Color:


Size:


Font: