కీర్తనల గ్రంథము 132 : 1 (TEV)
యెహోవా, దావీదునకు కలిగిన బాధలన్నిటిని అతని పక్షమున జ్ఞాపకము చేసికొనుము.
కీర్తనల గ్రంథము 132 : 2 (TEV)
అతడు యెహోవాతో ప్రమాణపూర్వకముగా మాట యిచ్చి
కీర్తనల గ్రంథము 132 : 3 (TEV)
యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను.
కీర్తనల గ్రంథము 132 : 4 (TEV)
ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు
కీర్తనల గ్రంథము 132 : 5 (TEV)
నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను నేను పరుండు మంచముమీది కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కన్ను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.
కీర్తనల గ్రంథము 132 : 6 (TEV)
అది ఎఫ్రాతాలోనున్నదని మేము వింటిమి యాయరు పొలములలో అది దొరికెను.
కీర్తనల గ్రంథము 132 : 7 (TEV)
ఆయన నివాసస్థలములకు పోదము రండి ఆయన పాదపీఠము ఎదుట సాగిలపడుదము రండి.
కీర్తనల గ్రంథము 132 : 8 (TEV)
యెహోవా, లెమ్ము నీ బలసూచకమైన మందసముతో కూడ రమ్ము నీ విశ్రాంతి స్థలములో ప్రవేశింపుము.
కీర్తనల గ్రంథము 132 : 9 (TEV)
నీ యాజకులు నీతిని వస్త్రమువలె ధరించుకొందురుగాక నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురు గాక.
కీర్తనల గ్రంథము 132 : 10 (TEV)
నీ సేవకుడైన దావీదు నిమిత్తము నీ అభిషిక్తునికి విముఖుడవై యుండకుము.
కీర్తనల గ్రంథము 132 : 11 (TEV)
నీ గర్భఫలమును నీ రాజ్యముమీద నేను నియ మింతును. నీ కుమారులు నా నిబంధనను గైకొనినయెడల నేను వారికి బోధించు నా శాసనమును వారు అనుస రించినయెడల వారి కుమారులుకూడ నీ సింహాసనముమీద నిత్యము కూర్చుందురని
కీర్తనల గ్రంథము 132 : 12 (TEV)
యెహోవా సత్యప్రమాణము దావీదుతో చేసెను ఆయన మాట తప్పనివాడు.
కీర్తనల గ్రంథము 132 : 13 (TEV)
యెహోవా సీయోనును ఏర్పరచుకొని యున్నాడు. తనకు నివాసస్థలముగా దానిని కోరుకొని యున్నాడు.
కీర్తనల గ్రంథము 132 : 14 (TEV)
ఇది నేను కోరినస్థానము, ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించెదను
కీర్తనల గ్రంథము 132 : 15 (TEV)
దాని ఆహారమును నేను నిండారులుగా దీవించెదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచెదను
కీర్తనల గ్రంథము 132 : 16 (TEV)
దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింప జేసెదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసెదరు.
కీర్తనల గ్రంథము 132 : 17 (TEV)
అక్కడ దావీదునకు కొమ్ము మొలవ జేసెదను నా అభిషిక్తునికొరకు నే నచ్చట ఒక దీపము సిద్ధపరచి యున్నాను.
కీర్తనల గ్రంథము 132 : 18 (TEV)
అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింప జేసెదను అతని కిరీటము అతనిమీదనే యుండి తేజరిల్లును అనెను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18

BG:

Opacity:

Color:


Size:


Font: