కీర్తనల గ్రంథము 133 : 1 (TEV)
సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు! ఎంత మనోహరము!
కీర్తనల గ్రంథము 133 : 2 (TEV)
అది తలమీద పోయబడి అహరోను గడ్డముమీదుగా కారి అతని అంగీల అంచువరకు దిగజారిన పరిమళ తైలమువలె నుండును
కీర్తనల గ్రంథము 133 : 3 (TEV)
సీయోను కొండలమీదికి దిగి వచ్చు హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలెనని యెహోవా సెలవిచ్చి యున్నాడు.

1 2 3

BG:

Opacity:

Color:


Size:


Font: