కీర్తనల గ్రంథము 135 : 1 (TEV)
యెహోవాను స్తుతించుడి యెహోవా నామమును స్తుతించుడి యెహోవా సేవకులారా,
కీర్తనల గ్రంథము 135 : 2 (TEV)
యెహోవా మందిరములో మన దేవుని మందిరపు ఆవరణములలో నిలుచుండు వారలారా, యెహోవాను స్తుతించుడి.
కీర్తనల గ్రంథము 135 : 3 (TEV)
యెహోవా దయాళుడు యెహోవాను స్తుతించుడి ఆయన నామమును కీర్తించుడి అది మనోహరము.
కీర్తనల గ్రంథము 135 : 4 (TEV)
యెహోవా తనకొరకు యాకోబును ఏర్పరచుకొనెను తనకు స్వకీయధనముగా ఇశ్రాయేలును ఏర్పరచు కొనెను.
కీర్తనల గ్రంథము 135 : 5 (TEV)
యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతలకంటె గొప్పవాడనియు నేనెరుగుదును.
కీర్తనల గ్రంథము 135 : 6 (TEV)
ఆకాశమందును భూమియందును సముద్రములయందును మహాసముద్రములన్నిటి యందును ఆయన తనకిష్టమైనదంతయు జరిగించువాడు
కీర్తనల గ్రంథము 135 : 7 (TEV)
భూదిగంతములనుండి ఆవిరి లేవజేయువాడు ఆయనే. వాన కురియునట్లు మెరుపు పుట్టించువాడు ఆయనే తన నిధులలోనుండి గాలిని ఆయన బయలువెళ్లజేయును.
కీర్తనల గ్రంథము 135 : 8 (TEV)
ఐగుప్తులో మనుష్యుల తొలిచూలులను పశువుల తొలి చూలులను ఆయన హతముచేసెను.
కీర్తనల గ్రంథము 135 : 9 (TEV)
ఐగుప్తూ, నీ మధ్యను ఫరోయెదుటను అతని ఉద్యో గస్థుల యెదుటను ఆయనే సూచకక్రియలను మహత్కార్యములను జరి గించెను.
కీర్తనల గ్రంథము 135 : 10 (TEV)
అనేకులైన అన్యజనులను బలిష్ఠులైన రాజులను ఆయన హతము చేసినవాడు.
కీర్తనల గ్రంథము 135 : 11 (TEV)
అమోరీయుల రాజైన ఓగును హతముచేసెను కనాను రాజ్యములన్నిటిని పాడుచేసెను.
కీర్తనల గ్రంథము 135 : 12 (TEV)
ఆయన వారి దేశమును స్వాస్థ్యముగాను ఇశ్రాయేలీయులైన తన ప్రజలకు స్వాస్థ్యముగాను అప్పగించెను.
కీర్తనల గ్రంథము 135 : 13 (TEV)
యెహోవా, నీ నామము నిత్యము నిలుచును యెహోవా, నీ జ్ఞాపకార్థమైన నామము తరతరము లుండును.
కీర్తనల గ్రంథము 135 : 14 (TEV)
యెహోవా తన ప్రజలకు న్యాయము తీర్చును తన సేవకులనుబట్టి ఆయన సంతాపము నొందును.
కీర్తనల గ్రంథము 135 : 15 (TEV)
అన్యజనుల విగ్రహములు వెండి బంగారువి అవి మనుష్యుల చేతిపనులు.
కీర్తనల గ్రంథము 135 : 16 (TEV)
వాటికి నోరుండియు పలుకవు కన్నులుండియు చూడవు
కీర్తనల గ్రంథము 135 : 17 (TEV)
చెవులుండియు వినవు వాటి నోళ్లలో ఊపిరి లేశమైన లేదు.
కీర్తనల గ్రంథము 135 : 18 (TEV)
వాటినిచేయువారును వాటియందు నమి్మకయుంచు వారందరును వాటితో సమానులగుదురు.
కీర్తనల గ్రంథము 135 : 19 (TEV)
ఇశ్రాయేలు వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి అహరోను వంశీయులారా, యెహోవాను సన్ను తించుడి
కీర్తనల గ్రంథము 135 : 20 (TEV)
లేవి వంశీయులారా, యెహోవాను సన్నుతించుడి యెహోవాయందు భయభక్తులుగలవారలారా, యెహో వాను సన్నుతించుడి.
కీర్తనల గ్రంథము 135 : 21 (TEV)
యెరూషలేములో నివసించు యెహోవా సీయోనులోనుండి సన్నుతింపబడును గాక యెహోవాను స్తుతించుడి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21

BG:

Opacity:

Color:


Size:


Font: