కీర్తనల గ్రంథము 136 : 1 (TEV)
యెహోవా దయాళుడు ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 2 (TEV)
దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 3 (TEV)
ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 4 (TEV)
ఆయన ఒక్కడే మహాశ్చర్యకార్యములు చేయువాడు ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 5 (TEV)
తన జ్ఞానముచేత ఆయన ఆకాశమును కలుగజేసెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 6 (TEV)
ఆయన భూమిని నీళ్లమీద పరచినవాడు ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 7 (TEV)
ఆయన గొప్ప జ్యోతులను నిర్మించినవాడు ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 8 (TEV)
పగటి నేలుటకు ఆయన సూర్యుని చేసెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 9 (TEV)
రాత్రి నేలుటకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 10 (TEV)
ఐగుప్తుదేశపు తొలిచూలులను ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 11 (TEV)
వారి మధ్యనుండి ఇశ్రాయేలీయులను ఆయన రప్పిం చెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 12 (TEV)
చేయి చాచి తన బాహుబలముచేత వారిని రప్పించెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 13 (TEV)
ఎఱ్ఱసముద్రమును ఆయన పాయలుగా చీల్చెను. ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 14 (TEV)
ఆయన ఇశ్రాయేలీయులను దాని నడుమ దాటిపో జేసెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 15 (TEV)
ఫరోను అతని సైన్యమును ఎఱ్ఱసముద్రములో ఆయన ముంచివేసెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 16 (TEV)
అరణ్యమార్గమున ఆయన తన ప్రజలను తోడుకొని వచ్చెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 17 (TEV)
గొప్ప రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 18 (TEV)
ప్రసిద్ధినొందిన రాజులను ఆయన హతముచేసెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 19 (TEV)
అమోరీయుల రాజైన సీహోనును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 20 (TEV)
బాషాను రాజైన ఓగును ఆయన హతము చేసెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 21 (TEV)
ఆయన వారి దేశమును మనకు స్వాస్థ్యముగా అప్ప గించెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 22 (TEV)
తన సేవకుడైన ఇశ్రాయేలునకు దానిని స్వాస్థ్యముగా అప్పగించెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 23 (TEV)
మనము దీనదశలోనున్నప్పుడు ఆయన మనలను జ్ఞాప కము చేసికొనెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 24 (TEV)
మన శత్రువుల చేతిలోనుండి మనలను విడిపించెను ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 25 (TEV)
సమస్త జీవులకును ఆయన ఆహారమిచ్చుచున్నాడు ఆయన కృప నిరంతరముండును.
కీర్తనల గ్రంథము 136 : 26 (TEV)
ఆకాశమందుండు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిం చుడి ఆయన కృప నిరంతరముండును.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26

BG:

Opacity:

Color:


Size:


Font: