కీర్తనల గ్రంథము 137 : 1 (TEV)
బబులోను నదులయొద్ద కూర్చుండియున్నప్పుడు మనము సీయోనును జ్ఞాపకము చేసికొని యేడ్చు చుంటిమి.
కీర్తనల గ్రంథము 137 : 2 (TEV)
వాటిమధ్యనున్న నిరవంజిచెట్లకు మన సితారాలు తగి లించితివిు.
కీర్తనల గ్రంథము 137 : 3 (TEV)
అచ్చట మనలను చెరగొన్నవారుఒక కీర్తనపాడుడి అనిరి మనలను బాధించినవారు సీయోను కీర్తనలలో ఒకదానిని మాకు వినిపించుడి అని మనవలన ఉల్లాసము గోరిరి
కీర్తనల గ్రంథము 137 : 4 (TEV)
అన్యుల దేశములో యెహోవా కీర్తనలు మనమెట్లు పాడుదుము?
కీర్తనల గ్రంథము 137 : 5 (TEV)
యెరూషలేమా, నేను నిన్ను మరచినయెడల నా కుడిచేయి తన నేర్పు మరచును గాక.
కీర్తనల గ్రంథము 137 : 6 (TEV)
నేను నిన్ను జ్ఞాపకము చేసికొననియెడల, నా ముఖ్య సంతోషముకంటె నేను యెరూషలేమును హెచ్చుగా ఎంచనియెడల నా నాలుక నా అంగిటికి అంటుకొనును గాక.
కీర్తనల గ్రంథము 137 : 7 (TEV)
యెహోవా, ఎదోము జనులు చేసినది జ్ఞాపకము చేసి కొనుము యెరూషలేము పాడైన దినమును జ్ఞాపకమునకు తెచ్చు కొనుము. దానిని నాశనముచేయుడి సమూలధ్వంసము చేయుడి అని వారు చాటిరి గదా.
కీర్తనల గ్రంథము 137 : 8 (TEV)
పాడు చేయబడబోవు బబులోను కుమారీ, నీవు మాకు చేసిన క్రియలనుబట్టి నీకు ప్రతికారము చేయువాడు ధన్యుడు
కీర్తనల గ్రంథము 137 : 9 (TEV)
నీ పసిపిల్లలను పట్టుకొని వారిని బండకువేసి కొట్టు వాడు ధన్యుడు.

1 2 3 4 5 6 7 8 9

BG:

Opacity:

Color:


Size:


Font: