కీర్తనల గ్రంథము 14 : 1 (TEV)
దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయ ములో అనుకొందురు.వారు చెడిపోయినవారు అసహ్యకార్యములుచేయుదురు.మేలుచేయు వాడొకడును లేడు.
కీర్తనల గ్రంథము 14 : 2 (TEV)
వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అనియెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరి శీలించెను
కీర్తనల గ్రంథము 14 : 3 (TEV)
వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారుమేలుచేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు
కీర్తనల గ్రంథము 14 : 4 (TEV)
యెహోవాకు ప్రార్థన చేయక ఆహారము మింగునట్లు నా ప్రజలను మింగుచుపాపము చేయువారికందరికిని తెలివి లేదా?పాపము చేయువారు బహుగా భయపడుదురు.
కీర్తనల గ్రంథము 14 : 5 (TEV)
ఎందుకనగా దేవుడు నీతిమంతుల సంతానము పక్ష మున నున్నాడు
కీర్తనల గ్రంథము 14 : 6 (TEV)
బాధపడువారి ఆలోచనను మీరు తృణీకరించుదురు అయినను యెహోవా వారికి ఆశ్రయమై యున్నాడు.
కీర్తనల గ్రంథము 14 : 7 (TEV)
సీయోనులోనుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగునుగాక.యెహోవా చెరలోని తన ప్రజలను రప్పించునప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును.

1 2 3 4 5 6 7

BG:

Opacity:

Color:


Size:


Font: