కీర్తనల గ్రంథము 148 : 1 (TEV)
యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా, యెహోవాను స్తుతించుడి ఉన్నతస్థలముల నివాసులారా, ఆయనను స్తుతించుడి
కీర్తనల గ్రంథము 148 : 2 (TEV)
ఆయన దూతలారా, మీరందరు ఆయనను స్తుతించుడి ఆయన సైన్యములారా, మీరందరు ఆయనను స్తుతిం చుడి
కీర్తనల గ్రంథము 148 : 3 (TEV)
సూర్యచంద్రులారా, ఆయనను స్తుతించుడి కాంతిగల నక్షత్రములారా, మీరందరు ఆయనను స్తుతించుడి.
కీర్తనల గ్రంథము 148 : 4 (TEV)
పరమాకాశములారా, ఆకాశముపైనున్న జలములారా, ఆయనను స్తుతించుడి.
కీర్తనల గ్రంథము 148 : 5 (TEV)
యెహోవా ఆజ్ఞ ఇయ్యగా అవి పుట్టెను అవి యెహోవా నామమును స్తుతించును గాక
కీర్తనల గ్రంథము 148 : 6 (TEV)
ఆయన వాటిని నిత్యస్థాయువులుగా స్థిరపరచి యున్నాడు ఆయన వాటికి కట్టడ నియమించెను ఏదియు దాని నతిక్రమింపదు.
కీర్తనల గ్రంథము 148 : 7 (TEV)
భూమిమీదనున్న మకరములారా, అగాధజలములారా, యెహోవాను స్తుతించుడి
కీర్తనల గ్రంథము 148 : 8 (TEV)
అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ,
కీర్తనల గ్రంథము 148 : 9 (TEV)
పర్వతములారా, సమస్తమైన గుట్టలారా, ఫలవృక్షములారా, సమస్తమైన దేవదారు వృక్షము లారా,
కీర్తనల గ్రంథము 148 : 10 (TEV)
మృగములారా, పశువులారా, నేలను ప్రాకు జీవులారా, రెక్కలతో ఎగురు పక్షు లారా,
కీర్తనల గ్రంథము 148 : 11 (TEV)
భూరాజులారా, సమస్త ప్రజలారా, భూమిమీద నున్న అధిపతులారా, సమస్త న్యాయాధి పతులారా, యెహోవాను స్తుతించుడి.
కీర్తనల గ్రంథము 148 : 12 (TEV)
¸°వనులు కన్యలు వృద్ధులు బాలురు
కీర్తనల గ్రంథము 148 : 13 (TEV)
అందరును యెహోవా నామమును స్తుతించుదురు గాక ఆయన నామము మహోన్నతమైన నామము ఆయన ప్రభావము భూమ్యాకాశములకు పైగా నున్నది.
కీర్తనల గ్రంథము 148 : 14 (TEV)
ఆయన తన ప్రజలకు ఒక శృంగమును హెచ్చించి యున్నాడు. అది ఆయన భక్తులకందరికిని ఆయన చెంతజేరిన జనులగు ఇశ్రాయేలీయులకును ప్రఖ్యాతికరముగా నున్నది. యెహోవాను స్తుతించుడి.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14