కీర్తనల గ్రంథము 149 : 1 (TEV)
యెహోవాను స్తుతించుడి యెహోవాకు క్రొత్త కీర్తన పాడుడి భక్తులు కూడుకొను సమాజములో ఆయనకు స్తోత్ర గీతము పాడుడి.
కీర్తనల గ్రంథము 149 : 2 (TEV)
ఇశ్రాయేలీయులు తమ్మును పుట్టించినవానినిబట్టి సంతో షించుదురు గాక సీయోను జనులు తమ రాజునుబట్టిఆనందించుదురు గాక.
కీర్తనల గ్రంథము 149 : 3 (TEV)
నాట్యముతో వారు ఆయన నామమును స్తుతించు దురు గాక తంబురతోను సితారాతోను ఆయననుగూర్చి గానము చేయుదురు గాక.
కీర్తనల గ్రంథము 149 : 4 (TEV)
యెహోవా తన ప్రజలందు ప్రీతిగలవాడు. ఆయన దీనులను రక్షణతో అలంకరించును.
కీర్తనల గ్రంథము 149 : 5 (TEV)
భక్తులు ఘనతనొంది ప్రహర్షించుదురు గాక వారు సంతోషభరితులై తమ పడకలమీద ఉత్సాహ గానము చేయుదురు గాక.
కీర్తనల గ్రంథము 149 : 6 (TEV)
వారినోట దేవునికి చేయబడు ఉత్సాహస్తోత్రము లున్నవి.
కీర్తనల గ్రంథము 149 : 7 (TEV)
అన్యజనులకు ప్రతిదండన చేయుటకును ప్రజలను శిక్షించుటకును
కీర్తనల గ్రంథము 149 : 8 (TEV)
గొలుసులతో వారి రాజులను ఇనుప సంకెళ్లతో వారి ఘనులను బంధించుటకును
కీర్తనల గ్రంథము 149 : 9 (TEV)
విధింపబడిన తీర్పు వారిమీద నడుపుటకును వారి చేతిలో రెండంచులుగల ఖడ్గమున్నది. ఆయన భక్తులకందరికి ఘనత యిదే యెహోవాను స్తుతించుడి.

1 2 3 4 5 6 7 8 9