కీర్తనల గ్రంథము 16 : 1 (TEV)
దేవా, నీ శరణుజొచ్చియున్నాను, నన్ను కాపాడుము.
కీర్తనల గ్రంథము 16 : 2 (TEV)
నీవే ప్రభుడవు, నీకంటె నాకు క్షేమాధారమేదియులేదని యెహోవాతో నేను మనవి చేయుదును
కీర్తనల గ్రంథము 16 : 3 (TEV)
నేనీలాగందునుభూమిమీదనున్న భక్తులే శ్రేష్టులు; వారు నాకు కేవలము ఇష్టులు.
కీర్తనల గ్రంథము 16 : 4 (TEV)
యెహోవాను విడచి వేరొకని అనుసరించువారికిశ్రమలు విస్తరించును.వారర్పించు రక్త పానీయార్పణములు నేనర్పింపనువారి పేళ్లు నా పెదవులనెత్తను.
కీర్తనల గ్రంథము 16 : 5 (TEV)
యెహోవా నా స్వాస్థ్యభాగము నా పానీయభాగమునీవే నా భాగమును కాపాడుచున్నావు.
కీర్తనల గ్రంథము 16 : 6 (TEV)
మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెనుశ్రేష్ఠమైన స్వాస్థ్యము నాకు కలిగెను.
కీర్తనల గ్రంథము 16 : 7 (TEV)
నాకు ఆలోచనకర్తయైన యెహోవాను స్తుతించెదనురాత్రిగడియలలో నా అంతరింద్రియము నాకుబోధించుచున్నది.
కీర్తనల గ్రంథము 16 : 8 (TEV)
సదాకాలము యెహోవాయందు నా గురి నిలుపుచున్నాను.ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుకనేను కదల్చబడను.
కీర్తనల గ్రంథము 16 : 9 (TEV)
అందువలన నా హృదయము సంతోషించుచున్నదినా ఆత్మ హర్షించుచున్నదినా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది
కీర్తనల గ్రంథము 16 : 10 (TEV)
ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడచిపెట్టవునీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు
కీర్తనల గ్రంథము 16 : 11 (TEV)
జీవమార్గమును నీవు నాకు తెలియజేసెదవు నీ సన్నిధిని సంపూర్ణసంతోషము కలదునీ కుడిచేతిలో నిత్యము సుఖములుకలవు.

1 2 3 4 5 6 7 8 9 10 11

BG:

Opacity:

Color:


Size:


Font: