కీర్తనల గ్రంథము 19 : 1 (TEV)
ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతిపనిని ప్రచురపరచుచున్నది.
కీర్తనల గ్రంథము 19 : 2 (TEV)
పగటికి పగలు బోధచేయుచున్నది. రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది.
కీర్తనల గ్రంథము 19 : 3 (TEV)
వాటికి భాషలేదు మాటలులేవు వాటి స్వరము వినబడదు.
కీర్తనల గ్రంథము 19 : 4 (TEV)
వాటి కొలనూలు భూమియందంతట వ్యాపించి యున్నదిలోకదిగంతములవరకు వాటి ప్రకటనలు బయలువెళ్లు చున్నవివాటిలో ఆయన సూర్యునికి గుడారము వేసెను.
కీర్తనల గ్రంథము 19 : 5 (TEV)
అతడు తన అంతఃపురములోనుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడుశూరుడు పరుగెత్త నుల్లసించునట్లు తన పథమునందు పరుగెత్త నుల్లసించుచున్నాడు.
కీర్తనల గ్రంథము 19 : 6 (TEV)
అతడు ఆకాశమున ఈ దిక్కునుండి బయలుదేరి ఆ దిక్కువరకు దానిచుట్టు తిరిగి వచ్చుచున్నాడు అతని వేడిమికి మరుగైనది ఏదియు లేదు.
కీర్తనల గ్రంథము 19 : 7 (TEV)
యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థ మైనది అది ప్రాణమును తెప్పరిల్లజేయునుయెహోవా శాసనము నమ్మదగినది అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును.
కీర్తనల గ్రంథము 19 : 8 (TEV)
యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవిహృదయమును సంతోషపరచునుయెహోవా ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, అది కన్ను లకు వెలుగిచ్చును.
కీర్తనల గ్రంథము 19 : 9 (TEV)
యెహోవాయందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచునుయెహోవా న్యాయవిధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి.
కీర్తనల గ్రంథము 19 : 10 (TEV)
అవి బంగారుకంటెను విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవితేనెకంటెను జుంటితేనెధారలకంటెను మధురమైనవి.
కీర్తనల గ్రంథము 19 : 11 (TEV)
వాటివలన నీ సేవకుడు హెచ్చరిక నొందును వాటిని గైకొనుటవలన గొప్ప లాభము కలుగును.
కీర్తనల గ్రంథము 19 : 12 (TEV)
తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్నునిర్దోషినిగా తీర్చుము.
కీర్తనల గ్రంథము 19 : 13 (TEV)
దురభిమాన పాపములలో పడకుండ నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనియ్యకుము అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహముచేయకుండ నిందా రహితుడనగుదును.
కీర్తనల గ్రంథము 19 : 14 (TEV)
యెహోవా, నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలును నా హృదయ ధ్యానమునునీ దృష్టికి అంగీకారములగును గాక.

1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14

BG:

Opacity:

Color:


Size:


Font: