కీర్తనల గ్రంథము 2 : 1 (TEV)
అన్యజనులు ఏల అల్లరి రేపుచున్నారు?జనములు ఏల వ్యర్థమైనదానిని తలంచుచున్నవి?
కీర్తనల గ్రంథము 2 : 2 (TEV)
మనము వారి కట్లు తెంపుదము రండివారి పాశములను మనయొద్దనుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు
కీర్తనల గ్రంథము 2 : 3 (TEV)
భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికినివిరోధముగా నిలువబడుచున్నారుఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు.
కీర్తనల గ్రంథము 2 : 4 (TEV)
ఆకాశమందు ఆసీనుడగువాడు నవ్వుచున్నాడుప్రభువు వారినిచూచి అపహసించుచున్నాడు
కీర్తనల గ్రంథము 2 : 5 (TEV)
ఆయన ఉగ్రుడై వారితో పలుకునుప్రచండకోపముచేత వారిని తల్లడింపజేయును
కీర్తనల గ్రంథము 2 : 6 (TEV)
నేను నా పరిశుద్ధ పర్వతమైన సీయోను మీదనా రాజును ఆసీనునిగా చేసియున్నాను
కీర్తనల గ్రంథము 2 : 7 (TEV)
కట్టడను నేను వివరించెదనుయెహోవా నాకీలాగు సెలవిచ్చెనునీవు నా కుమారుడవునేడు నిన్ను కనియున్నాను.
కీర్తనల గ్రంథము 2 : 8 (TEV)
నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగానుభూమిని దిగంతములవరకు సొత్తుగాను ఇచ్చెదను.
కీర్తనల గ్రంథము 2 : 9 (TEV)
ఇనుపదండముతో నీవు వారిని నలుగగొట్టెదవుకుండను పగులగొట్టినట్టు వారిని ముక్క చెక్కలుగాపగులగొట్టెదవు
కీర్తనల గ్రంథము 2 : 10 (TEV)
కాబట్టి రాజులారా, వివేకులై యుండుడిభూపతులారా, బోధనొందుడి.
కీర్తనల గ్రంథము 2 : 11 (TEV)
భయభక్తులు కలిగి యెహోవాను సేవించుడిగడగడ వణకుచు సంతోషించుడి.
కీర్తనల గ్రంథము 2 : 12 (TEV)
ఆయన కోపము త్వరగా రగులుకొనునుకుమారుని ముద్దుపెట్టుకొనుడి; లేనియెడల ఆయన కోపించును అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు.ఆయనను ఆశ్రయించువారందరు ధన్యులు.

1 2 3 4 5 6 7 8 9 10 11 12

BG:

Opacity:

Color:


Size:


Font: