కీర్తనల గ్రంథము 23 : 1 (TEV)
యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు.
కీర్తనల గ్రంథము 23 : 2 (TEV)
పచ్చికగల చోట్లను ఆయన నన్ను పరుండజేయు చున్నాడుశాంతికరమైన జలములయొద్ద నన్ను నడిపించుచున్నాడు.
కీర్తనల గ్రంథము 23 : 3 (TEV)
నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు తన నామమునుబట్టి నీతిమార్గములలో నన్ను నడిపించు చున్నాడు.
కీర్తనల గ్రంథము 23 : 4 (TEV)
గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడనునీవు నాకు తోడై యుందువు నీ దుడ్డుకఱ్ఱయు నీదండమును నన్ను ఆదరించును.
కీర్తనల గ్రంథము 23 : 5 (TEV)
నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధ పరచుదువునూనెతో నా తల అంటియున్నావునా గిన్నె నిండి పొర్లుచున్నది.
కీర్తనల గ్రంథము 23 : 6 (TEV)
నేను బ్రదుకు దినములన్నియు కృపాక్షేమములే నా వెంట వచ్చునుచిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసెదను.
❮
❯