కీర్తనల గ్రంథము 26 : 1 (TEV)
యెహోవా, నేను యథార్థవంతుడనై ప్రవర్తించు చున్నాను నాకు తీర్పు తీర్చుము ఏమియు సందేహపడకుండ యెహోవాయందు నేను నమి్మక యుంచియున్నాను.
కీర్తనల గ్రంథము 26 : 2 (TEV)
యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షిం చుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశో ధించుము.
కీర్తనల గ్రంథము 26 : 3 (TEV)
నీ కృప నా కన్నులయెదుట నుంచుకొనియున్నాను నీ సత్యము ననుసరించి నడుచుకొనుచున్నాను
కీర్తనల గ్రంథము 26 : 4 (TEV)
పనికిమాలినవారితో నేను సాంగత్యముచేయను వేషధారులతో పొందుచేయను.
కీర్తనల గ్రంథము 26 : 5 (TEV)
దుష్టుల సంఘము నాకు అసహ్యము భక్తిహీనులతో సాంగత్యముచేయను
కీర్తనల గ్రంథము 26 : 6 (TEV)
నిర్దోషినని నా చేతులు కడుగుకొందును యెహోవా, నీ బలిపీఠముచుట్టు ప్రదక్షిణము చేయు దును.
కీర్తనల గ్రంథము 26 : 7 (TEV)
అచ్చట కృతజ్ఞతాస్తుతులు చెల్లింతును. నీ ఆశ్చర్యకార్యములను వివరింతును.
కీర్తనల గ్రంథము 26 : 8 (TEV)
యెహోవా, నీ నివాసమందిరమును నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించు చున్నాను.
కీర్తనల గ్రంథము 26 : 9 (TEV)
పాపులతో నా ప్రాణమును చేర్చకుము నరహంతకులతో నా జీవమును చేర్చకుము.
కీర్తనల గ్రంథము 26 : 10 (TEV)
వారి చేతిలో దుష్కార్యములు కలవు వారి కుడిచెయ్యి లంచములతో నిండియున్నది.
కీర్తనల గ్రంథము 26 : 11 (TEV)
నేను యథార్థవంతుడనై నడుచుకొనుచున్నాను నన్ను విమోచింపుము, నన్ను కరుణింపుము.
కీర్తనల గ్రంథము 26 : 12 (TEV)
సమభూమిలో నా పాదము నిలిపియున్నాను సమాజములలో యెహోవాను స్తుతించెదను.

1 2 3 4 5 6 7 8 9 10 11 12