కీర్తనల గ్రంథము 3 : 1 (TEV)
యెహోవా, నన్ను బాధించువారు ఎంతో విస్తరించియున్నారునామీదికి లేచువారు అనేకులు.
కీర్తనల గ్రంథము 3 : 2 (TEV)
దేవుని వలన అతనికి రక్షణ యేమియు దొరకదనినన్నుగూర్చి చెప్పువారు అనేకులు (సెలా.)
కీర్తనల గ్రంథము 3 : 3 (TEV)
యెహోవా, నీవే నాకు కేడెముగానునీవే నాకు అతిశయాస్పదముగాను నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు.
కీర్తనల గ్రంథము 3 : 4 (TEV)
ఎలుగెత్తి నేను యెహోవాకు మొఱ్ఱపెట్టునప్పుడుఆయన తన పరిశుద్ధ పర్వతమునుండి నాకుత్తరమిచ్చును.
కీర్తనల గ్రంథము 3 : 5 (TEV)
యెహోవా నాకు ఆధారము, కావున నేను పండుకొని నిద్రపోయి మేలుకొందును
కీర్తనల గ్రంథము 3 : 6 (TEV)
పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించిననునేను భయపడను
కీర్తనల గ్రంథము 3 : 7 (TEV)
యెహోవా, లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుమునా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవునీవే.
కీర్తనల గ్రంథము 3 : 8 (TEV)
రక్షణ యెహోవాదినీ ప్రజలమీదికి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. (సెలా.)

1 2 3 4 5 6 7 8

BG:

Opacity:

Color:


Size:


Font: